ఆ తోక కావాలనే తగిలించాలేండి. దయ్యాలు, భూతాలవంటి వాటిని చూపించకుండానే జనాలని భయపెట్టడంలో సిధ్ధహస్తుడైన రోలేండ్ ఏమెరిచ్ ( 'గాడ్జిలా', 'ఇండిపెండెన్స్ డే', '10,000 బీసీ', 'ద డే ఆఫ్టర్ టుమారో' చిత్రాలు గుర్తున్నాయా?) సరికొత్త సృష్టే ఈ 2012 చిత్రం. తినడానికి నిన్న బయటకెళ్ళి అనుకోకుండా చూసిన చిత్రమిది.
కధలోకొస్తే 2012 డిసెంబర్ 21 (12-21-12) నాడు అంతమయ్యే మాయన్ కేలండర్, దాని చూట్టూ అల్లుకున్న "ఎండ్ ఆఫ్ ద వోర్ల్డ్" కధల నేపధ్యంలో తీసిన ఫేంటసీ సినీమా ఇది. ఆ రోజు ప్రపంచం నిజంగా అంతమైపోతుందని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారనుకోండి, కానీ ఆ భయాలకి ఒక చలన చిత్ర రూపమిచ్చి, అద్భుతమైన గ్రేఫిక్స్ తో ప్రేక్షకులని భయపెట్టడం ఏమెరిచ్ కే చెల్లింది. భారతదేశం సంగతి ఇంకా తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఈ సినీమా ఒక చిన్నపాటి సంచలనం సృష్టిస్తోంది.
కధలోకొస్తే - ఒక భారతీయ శాస్త్రజ్ఞుడు భూమి పొరల్లో జరిగే గందరగోళాన్ని కనిపెట్టి, ఏదో పెద్ద విధ్వంసం జరగబోతోందని గ్రహించి, తన మిత్రుడైన ఓ అమేరికన్ శాస్త్రజ్ఞుడికి ఆ విషయం చెప్తడు. ఆ అమేరికన్ వెంటనే ప్రభుత్వానికి ఆ విషయం తెలియచేస్తాడు. ఏం జరగబోతోందా అని విశ్లేషిస్తే అతి త్వరలో భూమండలం సర్వనాశనం కాబోతోందన్న విషయం తెలుస్తుంది. ఇక దానినుండి వీలయినంతమంది ప్రజలని ( ధనవంతులనే అనుకోండి ) కాపాడడానికి ప్రయత్నాలు మొదలవుతాయి - ఎక్కడో టిబెట్ లో, ఒక డేం పేరుతో, ఎవరికీ తెలియకుండా. ఈ లోగా ఒక సామాన్యుడైన రచయిత & డ్రైవర్ కి యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ లో ఒక రేడీయో జాకీ ద్వారా ఈ విషయం తెలుస్తుంది. వెంటనే తననుండి విడిపోయిన తన భార్యా పిల్లలని రక్షించే ప్రయత్నాలు మొదలుపెడతాడు. శాస్త్రవేత్తలు ఊహించిన "ఎపోలొకేలిప్స్" అమేరికాలోనే మొదలవుతుంది. క్షణాలలో కేలిఫోర్నియా లోని "బే ఏరియా" తుడిచిపెట్టుకుపోతుంది - కనీ వినీ ఎరగని భూకంపాలతో. మన రచయిత గారు ఎలాగో కష్టపడి ఒక విమానం సంపాదించి దానిలోకి ఫేమిలీని చేరుస్తాడు - కానీ ఆ లక్కపిడత విమానంలో చైనా చేరేదెలా?
క్రిందనేమో మిలియన్లకొద్దీ ప్రజలు గంట గంటకీ మరణిస్తూ ఉంటారు. ప్రపంచ ప్రభుత్వాధినేతలందరూ చైనా ప్రయాణమవుతారు, తమని తాము రక్షించుకోడానికి - ఒక్క అమేరికా, ఇటలీ నేతలు తప్ప - వారు మాత్రం సామాన్య ప్రజానీకంతో కలిసి ప్రాణత్యాగం చెయ్యడానికే సిధ్ధపడతారు. విధ్వంసం ఏ రకంగా జరుగుతుంది, ఎంత వేగంతో జరుగుతుంది, దానినుండి రక్షంపబడేవారెవరు, చివరికి భూమిపై ఏమి మిగులుతుంది అనేదే తదుపరి కధాంశం.
ఈ సినిమాకి గ్రేఫిక్స్/విషువల్స్ పెద్ద హైలైట్. నాకయితే మాత్రం బాగా నచ్చాయి. ప్రేక్షకులని సీట్లకి అంటిపెట్టుకునేలా చేస్తాయి. సినేమేటొగ్రఫీ కూడా బాగుంది. అయితే ఈ సినిమాకి పెద్ద లోపం: కధలో బలం లేకపోవడం. (అదీగాక "ద నోయింగ్" ( నికొలాస్ కేజ్) చిత్రం కూడ ఇలాంటి కధాంశంతోనే ఈ ఏడాది మొదట్లో విడుదలయ్యింది) కధనం బాగున్నా, కొత్తదనం లేని కధ మూలంగా, ప్రేక్షకులలో తరవాత వచ్చే సన్నివేశంలో గ్రేఫిక్స్ ఎలా ఉంటాయోనన్న ఆసక్తి తప్పితే తరవాత ఏమిజరుగుతుందోనన్న ఉత్కంఠత కనిపించదు. కొంతమందికి ఇదో కామెడి సినిమాలా కూడా అనిపించచ్చు. కొన్ని సన్నివేశాలైతే పాత సినీమాల కాపీలే. ఫలితం ముందే "ఫిక్స్" చేసిన క్రికెట్ మేచ్ చూస్తున్న ఫీలింగ్ ప్రేక్షకులకి ఖచ్చితంగా కలుగుతుంది, అయితే "ఫలితం ఎవడికి కావాలెహే? సెహ్వాగ్, తెండుల్కర్ కొట్టే సిక్సులు చూడడానికొచ్చా" అనేరకం ప్రేక్షకులకి ఈ చిత్రం విపరీతంగా నచ్చేస్తుంది, ముఖ్యంగా చిన్నపిల్లలకి. మీ పిల్లలతో కలిసి హాయిగా సరదాగా చూడాలి అనుకుంటే తప్పకుండా చూడండి, మీకు డబ్బులు గిట్టుబాటే! ఏదో కళాఖండం చూద్దామని వెడితే మాత్రం నిరాశ తప్పదు.
నాకు నవ్వుతెప్పించిన డయలాగ్:
"Do you mean to say that the North Pole has shifted to Wisconsin?"
"Sir! It's actually the South Pole!"
ఈ చిత్రానికి నా రేటింగ్ - ఐదుకి రెండున్నర!
కొసమెరుపు: ఈ సినిమా చూస్తున్న సంగతి మా ఆవిడకి చెప్పిన వెంటనే (ఈ వారం నేను ఆస్టిన్ వెళ్ళలేదు), "నువ్వొచ్చినప్పుడు కలిసి చూద్దామని నేను, నీ కూతురు వెయిట్ చేస్తుంటే నాకు చెప్పకుండా చూసేస్తున్నావా!" అని చిందులెయ్యడం మొదలెట్టింది. విధ్వంసం 2012 వరకూ ఆగకపోవచ్చేమో :))
నేనూ నిన్నే చూసాను. CGI అద్భుతంగా ఉంది కాకపొతే మీరన్నట్టు అక్కడక్కడ కామెడి ఎక్కువైంది. ఆ ఎల్లో స్టోన్ లో జాన్ క్యుసాక్ వెనకాల లావా పడడం, సరిగ్గా వీళ్ళ లిమో ఒక్కటీ సురక్షితంగా ఎయిర్ పోర్ట్ కెల్లడం చూస్తే సైనికుడు (గుణశేఖర్ గారి కళా ఖండం) లో సీన్లు గుర్తుకొచ్చాయ్ :). స్క్రిప్ట్ విషయం లో కొంచం జాగ్రత్త వహిస్తే అటు క్రిటిక్స్ కీ ప్రేక్షకులకీ కూడా ఇంకా నచ్చేది. IMAX /3D లో వచ్చుంటే కూడా ఇంకా బావుండేది.
రిప్లయితొలగించండినేను కూడ నిన్నే చూసాను ఇదే స్టొరీ తో వచ్చిన సినిమాలు చూడకపోవటం వలన కావచ్చు నాకు నచ్చింది . మీ కొసమెరుపు మెరుపు అదిరింది :)
రిప్లయితొలగించండిమరి దియేటర్ లో మీ పక్కన కూర్చుని సీన్ సీన్ కి భయపడుతూ మీ భుజాల మీద వాలి సేద తీరిన ''ఆమె ఎవరు? ''. madam యి కామెంట్ చూసాక విద్వ్మసం పన్నెండో నెల దాక కూడా ఆగదేమో భరద్వాజ్ .
రిప్లయితొలగించండికధ విషయాం ఏలా ఉన్న సినిమా మాత్రం బాగుంది
రిప్లయితొలగించండిఒక్క సారి సుడచ్చు
''ఆమె ఎవరు?
రిప్లయితొలగించండిమీరు sms ద్వారా మీ జావాబు తేలియాజేయలను కుంటె ''ఆమె ఎవరు? అని టైప్ చేసి space ఇచ్చి A,B,C,D లో ఏదో ఒక్కటి టైప్ చేసి 57575 కీ sms చేయండి
ఆమె ఎవరు ?
రిప్లయితొలగించండిఅ. అరుంధతి
బ. అమ్మోరు
చ. నీలాంబరి
ద . పైవేవి కాదు
నిజమే, భూకంపాలు, వాల్కనో ఎరప్షన్స్ , సునామీలు ఇవేవీ క్యూసాక్ అండ్ ఫ్యామిలీని ఆపలేకపోవడం కామెడీ కాక మరేమిటి!!
రిప్లయితొలగించండిఅయినా సరే నాకు బాగా నచ్చేసింది :-)
మధ్య మధ్యలో వచ్చిన డ్రామా (క్రూస్ షిప్ లో ఇద్దరు మ్యుజీషియన్స్) బావుంది..
మీరు చెప్పిన డైలాగ్ తో పాటు, చివర్లో కుక్కపిల్లని తీసుకుని షిప్ లోపలికివెళ్ళబోతూ రష్యన్ గర్ల్ ఫ్రెండ్, మూసుకుంటున్న తలుపుల్లోంచి తన బాయ్ ఫ్రెండ్ కి గుడ్ బై చెప్పిన విధానం హిలేరియస్ :-)
Vasu,
రిప్లయితొలగించండిI agree
Sravya,
Well .. నాకింకా కాళ్ళు వణుకుతున్నాయ్
Pavan & Vijayakranti
మీరిద్దరూ కలిసి నా కొంప ముంచేట్టున్నరే?
నిషీజీ,
నిజమే, ఆ సీన్ నిజంగా టాప్!
రవిగారూ,
మా ఆవిడకి తెలుగు చదవడం రాదుగా... హే జజ్జినకా, హే డింగుఠకా!
మీకు జన్మదిన శుభాకాంక్షలు :)
రిప్లయితొలగించండిభరద్వాజ్ మీరు యి రోజు తో యిరవై ఏడో ఏట నుంచి యిరవై ఐదో ఏట అడుగు పెడుతున్న సుభ సందర్భం లో శుభ కాంక్షలు .హస్చర్య కరమైన విషయం ఏంటంటే యి రోజే నా ''అతను ఎవరు '' కధానాయకి పుట్టిన రోజు కూడా.
రిప్లయితొలగించండిHAPPY BIRTHDAY TO YOU
రిప్లయితొలగించండిHAPPY BIRTHDAY TO YOU
HAPPY BIRTHDAY DEAR MALAKPET ROWDY
HAPPY BIRTHDAY TO YOU
మళ్ళి మళ్ళి ఇది రాని రోజు..హ్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిMalak anna, MANY MANY HAPPY RETURNS OF THE DAY !!!
రిప్లయితొలగించండిమీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సౌమ్య
రిప్లయితొలగించండిThank you all -
రిప్లయితొలగించండిBrihaspati
Ravigaru
Pavan
Badri
Sowmya
జన్మదినదిన శుభాకాంక్షలు మలక్ జీ :-)
రిప్లయితొలగించండిThanks Nishi ji
రిప్లయితొలగించండిఊరికే చెప్పేస్తామా రేపు మా బర్త్ డేలకు మీరు చెప్పాలి శుభాకాంక్షలు..లేకపోతే నేనూరుకోను :)
రిప్లయితొలగించండిSure sure .. let me know the date. I will have it on my calendar
రిప్లయితొలగించండి