25, జూన్ 2010, శుక్రవారం

ఆర్యులా? ద్రవిడులా?? గాడిదగుడ్డా??? - మొదటి భాగం

Pulling these old posts back (originally posted in March/April 2009)



ఆ మధ్య కాలంలో మేధావులని ఒక ఊపు ఊపింది ఆర్య-ద్రవిడుల సిద్ధాంతం. నేడు కూడా అది ఒక వివాదాస్పదమైన విషయమే - కాకపోతే అప్పుడు ఎవరో ఒకరిద్దరు వ్రాసిన పుస్తకాల ఆధారంగా వాదోపావాదాలు జరుగుతుండేవి, ఇప్పుడీ ఇంటర్నెట్ విప్లవం వల్ల ఈ విషయం మీద రచనలు, చర్చలు చాలా వెలుగులోకి వచ్చాయి. పని భారం వల్ల కాస్త ఆఫీసులో ఆలస్యమై, బయటనుండి తిండి తెప్పించుకుని తిని, పొట్ట బరువెక్కితే పార్కింగ్ లాట్ దాకా నడవడానికి బద్ధకం వేసి వ్రాస్తున్న టపా ఇది. పొట్ట బరువు తగ్గేలోగా ఈ నా సుత్తి అయిపోవాలని దేవుని ప్రార్ధించుకోండి.

సరే విషయంలోకొస్తే (సీరియస్ పోస్టులు రాయడం మనకి చేతకాదు - దేవుడి మీద భారం వేసి ప్రయత్నిస్తున్నా),

విషయంలోకొస్తే ...

అనగనగా ఓ విశ్వం ఉంది
ఆ విశ్వంలో పాలపుంత ఉంది
ఆ పుంతలో సౌర మండలముంది
దానిలో ఓ భూగోళం ఉంది
భూగోళం పై ప్రపంచముంది
ప్రపంచంలో ఐరోపా ఖండముంది
దానిలో జర్మనీ దేశం ఉంది
"మేక్స్ ముల్లర్" అనే శాల్తీ ఉంది

ఆ శాల్తీ మనకి కావాలీ
అతనిగురించే నేను వ్రాయాలీ!!!!


ఖంగారు పడద్దు .. ఏమి లెదు లెండి ... ఆ విధంగా 1823 లో జర్మనీలో పుట్టిన మేక్స్ ముల్లర్ ఏమి చేశాడయ్యా అంటే ...

1841 లో లీప్జిగ్ యునివర్సిటీకెళ్ళాడూ ... తందానా తానా
1843 లో పీ హెచ్ డీ దిగ్రీ తెచ్చుకున్నాడూ ... తందానా తానా
1846 ఇంగ్లండ్లో సంస్కృతం చదివాడూ ... తందానా తానా
ఆ తర్వాత ఇండీయా వచ్చీ చరిత్రని కెలికాడూ .. ... తందానా తానా
కెలికి కెలికి మన భారతీయుల మధ్య చిచ్చే పెట్టాడూ .. తందానా తానా

చిరాకేస్తోందా? చెప్పు తియ్యాలనిపిస్తోందా?? వద్దులేండి, కాస్త సీరియస్ గా వ్రాస్తా ...

ఈయన చేసిన ఘనకార్యం, తను చదివినదాని ఆధారంగా "భారతీయులలో రెండు వర్గాలున్నాయి - యూరోపు నుండి వచ్చిన ఆర్యులు, వారిచేత తరిమివెయ్యబడిన ద్రవిడులు" అని చెప్పి చక్కా పోవడం. దానిని పట్టుకుని హిట్లర్ తను ఆర్యుడనని ప్రకటించుకోవడం, మన రోమిలా థాపర్ లాంటి కమ్మ్యూనిష్టు స్కాలరు దానిని తలకెక్కించుకుని చరిత్ర పుస్తకాలు వ్రాయడం మనందరికీ తెలిసిందే. ఆ సిధ్ధాంతాన్ని కాస్తంత పరికించి చూడడమే ఈ పోస్టు ముఖ్యోద్దేశం.

ఆర్యుల దండయాత్ర సిధ్ధాంతాన్ని బలపరిచేవారు చెప్పేదేమిటంటే ...

* శ్వేతవర్ణపు ఆర్యులు క్రీ పూ 1500 దగ్గరలో భారతదేశం మీద దండెత్తారు
* ఉత్తర భారతంలో నివశించిన భారతీయులను దక్షిణానికి వెళ్ళగొట్టారు
* తమతో పాటుగా ప్రొటొ యూరోపియన్ భాష అయిన సంస్కృతాన్ని తీసుకొచ్చారు
* వాళ్ళ గౌరవం పెంచుకోడానికి వేదాలు, పురాణాలు సృష్టించారు
* హిందుమతం అనబడే కొత్త పధ్ధతిని ప్రవేశపెట్టారు
* 6000 సంవత్సరాల భారత చరిత్ర అంతా బూటకం
* శ్వేతవర్ణపు ఆర్యులు అగ్రకులావారు, యూరోపునుండి / ప్రష్యానుండి వచ్చినవారు
* నీలివర్ణపు ద్రవిడులు దళితులు

మనమందరం చిప్పూడు స్కూళ్ళలో ఇవే పాఠాలు చదువుకున్నాం కూడా - బ్రిటిషు ప్రభుత్వం వారు మన పాఠ్యాంశాలలోనికి చాలా తెలివిగా దీనిని చొప్పించారు. తర్వాత వచ్చిన భారత ప్రభుత్వాలు కూడా దీనిని మార్చే ప్రయత్నం చెయ్యలేదు. కమ్యూనిష్టులు సరే సరి - భారదేశంలో భిన్నత్వాన్ని సొమ్ముచేసుకుని మనుషుల మధ్య అగాధాలు సృష్టిస్తేనే కదా వాళ్ళకి వోట్లు పడేది. బ్రిటిషువారి హయాంలో పనిచేసిన కొంతమంది అగ్రవర్ణాలవారు కూడా "నిజమే కదా. మనము ఆర్యులమే. మిగిలిన వారికన్నా గొప్పవారమే" అని తేల్చేశారు.

హిందువుల పై అసలైన/నకిలీ ప్రేమతోనొ, ఓట్లకోసమో, లేక హిందువుల మద్దతుకోసమో గానీ కొంతమంది హిందుత్వ వాదులు ఈ సిధ్ధాంతంలో పసలేదు అనే గొడవ లేవదీశారు. దీనితో కమ్యూనిష్టు చరిత్రకారుల గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. చరిత్రని క్షుణ్ణంగా అధ్యయనం చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడినుండి గొడవ మొదలయ్యింది.

(సశేషం)

34 కామెంట్‌లు:

  1. బానే ఉంది కానీ, రేటింగేమిటి అన్నీ బాగా ఉండే ఆప్షన్లే ఇచ్చారు. ఒక్కటైనా చెడు లేదా బాగోలేదు అని ఇవ్వలేదు.
    (నేను ఆసక్తికరమైన అని ఓటు వేసాను)

    రిప్లయితొలగించండి
  2. ఆసక్తికరంగా మొదలుపెట్టారు! మీరు హాస్యభరితంగా రాస్తేనే బాగుంటుంది.(అలవాటైంది)అలాగే కొనసాగించండి.

    పాపం, కమ్యూనిస్టులంటే మీకు భలే మంట సుమా!

    రిప్లయితొలగించండి
  3. ఉత్తర(UP,Bihar)-దక్షిణ(Tamilandu,Kerala)-తూర్పు (West Bengal,Orissa)-పశ్చిమ(Pujab,Haryana)-ఇంకా north east వైపుకు కువెళితే భారతీయుల మధ్య, శరీరనిర్మాణం, సాంస్కృతిక విధానాల్లో తేడాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.కాబట్టి మనది mixed race అనేది కాదనలేని సత్యం.

    1947 కు మునుపు భారతదేశం అనేది ఒక దేశంకూడా కాదు. It was a "great idea" and it still is. రాజకీయంగా,భౌగోళికంగా ఒకటైనంత మాత్రానా, ‘అందరూ ఒకటే’ అనే సిద్ధాంతం కూడా చెల్లదు.కాబట్టి ఆర్య-ద్రవిడులే కాదు, నానా జాతుల సమాహారం భారతదేశం. అదే భిన్నత్వంలో ఏకత్వం.

    ఈ భావనని అర్థం చేసుకోకుండా, ఎవడో కుట్ర చేసాడనికి మనం కుట్రలు అల్లుకుంటూ వామపక్ష చరిత్రకారులమీదా, మ్యాక్స్ ముల్లర్ మీదా పడి ఏడిస్తే ఏంలాభం?

    రిప్లయితొలగించండి
  4. గాడిద గుడ్డే! ఆర్యులు నిజంగా యూరోపు నుండి వచ్చి ఇక్కడ వెలగబెడితే, మరి అంత గొప్ప నాగరికత అక్కడి నుండి ఏ కాకి ఎత్తుకుపోయింది?

    రిప్లయితొలగించండి
  5. శరీర నిర్మాణం లో తేడాలా? అంటే మూడు కళ్ళు నాలుగు చేతులు రెండు సెన్సార్లు నా :-X ...

    రిప్లయితొలగించండి
  6. కుహాన లౌకికవాదులప్పుడే గింజుకోవటం మొదలెట్టారు.., తరువాయి భాగం కోసం ఎదురు చూస్తూ..!

    రిప్లయితొలగించండి
  7. @రచయిత., మీ స్టైల్ బాగుంది.
    కత్తి గారు, ఇక్కడ పాయింట్ అందరూ ఒకటే జాతి వాళ్లా కాదా అనికాదు . కొందరు బయట వాళ్లు కొందరు లోపల వాళ్లు అని. అయినా మనకేమన్నా నీగ్రోలకు తెల్లవాళ్ళకు ఉన్నన్ని తేడాలు ఉన్నాయా? చైనా , జపాన్ వాళ్ల లాగా పసుపు పచ్చ పొట్టి శరీరాలు , చిన్ని కళ్లు ఉన్నాయా? సంసృతం విదేశి భాష అంటే మనకు అసలు హిస్టరీ నే లేనట్లు. మనమేదో అడవి మను షులం అయితే ఈ europe వాళ్లు వచిచ్చి మనకు జ్ఞానం ఇచ్చారుట.

    దీనికి ఒకటే ఆధారం వాళ్లు చూబిస్తోంది ఏమిటంటే సంసృతం లో మాటలు వాళ్ల భాష లో కూడా ఉన్నాయట.
    వాళ్ల పెద్దవాళ్ళు మన దేశానికీ నలందా, తస్ఖసిల లాంటి వాటికి వచ్చి చదువు కొని వాళ్ల భాషలో కలుపుకొని ఉండచ్చు కదా. ఇప్పుడు మనవాళ్ళు ఎగేసుకొని హార్వర్డ్ , ఆక్స్ఫర్డ్ వెళ్ళినట్లు..

    ఇంకో విశేషం ఏమిటంటే ఇదంతా విని మన ఇరానీలు ఊరికే చాయి కాచుకొంటూ ఊరుకొంటారా... వాళ్ళూ మేమే ఆర్యులం, మా భాషలో కూడా సంసృతం ఉన్నది. అంటున్నారు.

    మనం వెధవలమని మనమే నమ్మితే ఎవరైనా అంటారు.

    ఈ వెధవ సిద్దాంతాన్ని పట్టుకొని తమిళ మహానుబహావులు , ఇప్పటికీ తోటి భారతీయుల కంటే శ్రీలంక వాళ్లు మాకు దగ్గర చుట్టాలని అంటున్నారు. వాళ్లకు హిందీ అంటే అసహ్యం, సంసృతం చదివితే స్టేట్ first ఇవ్వరు. కాని ఇంగ్లీష్ అంటే ఇష్టం. కొందరు తెలుగు వాళ్లకు కూడా ఈ పిచ్చి ఎక్కుతున్నది ఈ మద్య. ముఖ్యం గా మూలల్లో గోదావరి లంకల్లో ఉంటూ కడుపు నిండి ఏమి చెయ్యాలో తెలియని వాళ్లకు, తమిళ తంబులతో వ్యాపారాలు, పెళ్లి సంబంధాలు ఉన్న కొన్ని కులాలకు ఈ మెంటల్ మొదలయ్యింది.

    రిప్లయితొలగించండి
  8. @అజ్ఞాత: "బయట" "లోపల" అనేవి చారిత్రాత్మకంగా సమస్యాత్మకమైన నిర్వచనాలు.ఆప్ఘనిస్తాన్ అవతలినుంచీ బర్మాలోని చిట్టగాంగ్ వరకూ, వీలైతే ధాయిలాండ్ వరకూ, హిమాలయాలనుంచీ శ్రీలంకవరకూ "అఖంఢ భారతం"గా కొన్ని సిద్ధాంతాల ఆధారంగా వాదించొచ్చు, కొంత వరకూ నిరూపించొచ్చుకూడా.

    ఇక శరీరాల్లో తేడాలంటారా,ఒక సారి మణిపూర్ వెళ్ళి తరువాత బీహార్ రండి. లేకపోతే పంజాబ్ నుంచీ తమిళనాడుకి ప్రయాణం కట్టండి. తేడాలు మీకు కొట్టొచ్చినట్టు కనబడతాయి.

    మనకంటూ హిస్టరీ ఉన్నట్టా లేనట్టా అనే బాధ అసంబద్ధం."మనదంటూ" ఒకప్పుడు ఏమీలేదు. ఎందుకంటే ఒక definitive దేశంగా మనం మారిందే 1947 లో, అంతవరకూ ఒదొక notionally unified culture అంతే!

    Recorded history కన్నా ముందు, ఎవరు ఎక్కడికి ఖండాంతరాల వలస వచ్చారు అన్నదానికి ఒకదానుకొకటి పొంతనలేకుండా వంద సిద్ధాంతాలు ప్రతిపాదించొచ్చు. కాని దానివల్ల మన వర్తమానానికొచ్చే నష్టంగానీ, విరగ్గాసే లాభంగానీ లేదనే నా ఉద్దేశం.

    తమిళనాడు neo-political-cultural nationalism ఒక ప్రత్యేకమైన case దాని గురించి చర్చించాలంటే అదొక పెద్ద కథ అవుతుంది.

    రిప్లయితొలగించండి
  9. సుత్తి నరేష్ మాత్రమేనా... యోగి అనే బుడ్డోడి పేరు యింటే యీడికి ఇప్పుడుకూడా నిద్ర లేని రాత్రులే. ఇప్పటికి కూడా ఎవరు ఎక్కడ ఎదిరించినా అదిగో అదిగదిగో యోగి అని మనోడు తెగ గింజుకుంటాడు. పాపం ఆ పిల్లోడు కూడా యీ మద్దెన రాయటం మానేశాడు యీ యెదవ నాయాల్తో ఎందుకని.

    బాబూ యోగి కత్తిగాడు మళ్ళొచ్చేసాడు, అక్క యిజయశాంతి కూడా మళ్ళొచ్చేసినాది, ఇది సదివితే నువ్వు గూడా ఒకసారి ఇటొచ్చి.....

    రిప్లయితొలగించండి
  10. @రెండో అజ్ఞాత: ఈ బ్లాగురాసే వ్యక్తికి నాగురించి నీకన్నా బాగా తెలుసు.ఒక స్థాయిలో పరిచయస్తులంకూడా. నీ వార్నింగులు కట్టిపెట్టి నీపని నువ్వు చూసుకో. కనీసం సొంత పేరుతో వ్యాఖ్య చేసే సత్తా లేదుగానీ, నువ్వా చర్చలకొచ్చేది!తగ్గుతగ్గు.

    రిప్లయితొలగించండి
  11. ఆర్యులు, ద్రావిడుల సిద్దంతం గురించి MSR Murthy గారు "ఏది చరిత్ర" అనే పుస్తకంలో విపుళంగా చర్చించారు (అజో, విభో, కందలం ఫౌండషన్ వారి ప్రచురణ). ఇందులో "మాయదారి మాక్స్‌ముల్లర్" అనే చాప్టర్లో ముల్లర్ మహాశయుడు మన చరిత్రను ఎలా త్రప్పుద్రోవ పట్టించాడో ఆధారలతో సహా వివరించాడు. వీలయితే చదవండి.

    రిప్లయితొలగించండి
  12. నీతో ఎవడ్రా సామీ చర్చకొచ్చింది? నాకు అంత ఓపిక లేదు సామీ, నువ్వు మూసుకోని నీ పని సూసుకో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మనదేశ రాజకీయాల లాగే నువ్వుకూడా ఒకదివి ఉడలి బాసు, విషయాన్ని పక్కదారి పట్టించడానికి
      http://amruthabhandam.wordpress.com/

      తొలగించండి
  13. Dr Sreenu:గారు బాగా గుర్తుచేశారు. ఇందులోనే Hitler తీరు వల్ల Max Muller తన స్వయం ప్రవచిత "సిద్ధాంతాన్ని" ఖండించవలసిన వచ్చిన తీరు కూడా వివరించారు. ఆర్యులిక్కడకు "దండెత్తిరావటానికి" దాదాపు 5000 సం.||లకు పూర్వమే ఇక్కడ ఆర్య నాగరికత పరిఢవిల్లిందనిచెప్పడానికి ఆధారాలు కూడా వున్నాయని ఋజువుచేశారు. "భారతదేశ భావన" గురించి ఆయనతో విభేదించినప్పటికీ ఈ విషయంలో మాత్రం ఏకీభవిస్తాను.

    మహేష్ గారు: మీరొకసారి ఈ పుస్తకాని సమీక్షిస్తే చూడాలని వుంది. "భారతదేశమనే" భావన మరీ 1947 వరకూ లేదంటే నమ్మశక్యంగాలేదు. ఏందుకలా అనుకుంటున్నారో వివరించగలరా?

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. ప్రదీప్,

    నేనేదో డీఫాల్ట్ టెంప్లేట్ పెట్టాను. రేపెప్పుడో మార్చేస్తాను ...

    సుజాత గారూ, అందరూ కాదండి .. ఇండీయం కమ్యూనిష్టులలో మాత్రం చాలామంది

    మహేష్ గారూ, మరీ అలా ఫాస్ట్ ఫార్వార్డ్ నొక్కితే ఎలా .. మీరు ఎత్తిన కత్తిని కాస్త ఆఖరి భాగం పడేవరకు దించండి .. అప్పటికీ మీ కామేంటు ఇదే అంటే అప్పుడు కత్తులు దూసుకుందాం :)) లేకపొతే మీ చేతులకే నొప్పి హీ హీ హీ ..

    నాగన్న, శ్రీనివాస్, కొల్లి గార్లకి ... మిగతా భాగాలలో ఇంతకన్నా పెద్ద చర్చ జరుగుతుందని ఆశిస్తున్నా

    అజ్ఞాతలూ, నిజంగా ధన్యవాదాలు. మీకెందుకు కోపం వచ్చిందో కూడా నాకు అర్థం అయ్యింది. కానీ ఒక విన్నపం .. ఇజాలని సిద్ధాంతాలని చీల్చి చెండాదండి, బాంబులతో లేపెయ్యండి ... కానీ దయచేసి వ్యక్తిగత దాడులకు దిగద్దు .. ఏమి అనుకోవద్దు గానీ మీ పోస్టులు కొన్నిటిని ఎడిట్ చేస్తున్నాను

    డా. శ్రీను గారూ, మినర్వా గారూ, తప్పకుండా చదువుతా అది దొరికితే ..

    రిప్లయితొలగించండి
  16. EDITED POST (Originally posted by Anonymous)
    _______________



    హిందువు కాదు ముస్లిం కాదు.. ********* EDITED ******** ఈనాడు అగ్ర కులాలను, హిందూ మతాన్ని, మధ్య తరగతిని దూషిస్తూ .. ఎవరో తమ ఊర్లల్లోని కొందరు భూస్వాములను చూసి హిందూ మతమంతా ఇంతే .. అగ్ర కులాలు అన్ని ఇంతే అని తమలో తామూ ఊహించుకుని అగ్రకులాలకు పడి ఏడుస్తారు. ఒక రకమైన వింత వ్యాధి తో బాద పడే ఈయన్ని చూసి జాలి పడండి అంతే గాని దూషించకండి.

    కనకపు సింహాసనమున సునకమును కూర్చుండ బెట్టిన వెనకటి గుణమేల మాను అన్నట్టు మంచి పొసిషన్ కి వచ్చినా ***** EDITED ***** వారి బుద్దులు మారవు.

    ఇంకా ఇతను కాశ్మీర్ ను పాకిస్తాన్ కు ఇవ్వాలని గనక నిజం గా రాస్తే .. **** EDITED ****

    రిప్లయితొలగించండి
  17. Another Edited Post (Original by Anonymous)
    _____________________

    రౌడీ, చాలా బాగా మొదలెట్టారు. హాస్యం పాళ్ళు తగ్గకుండానే రాయండి. బ్లాగుల్లో ఇలాంటి సీరియస్ టాపిక్స్ మీద చాలా పెద్ద పెద్ద చర్చలూ గొడవలూ ఇదివరకు అయ్యాయి. ఇలాంటి చర్చల్లో తగుదునమ్మా అని తలదూర్చే ఒక పెద్ద మనిషి గురించి ముందు తెలుసుకోండి. అతనెవరో కాదు - కత్తి మహేష్.

    ’కుహనా మేధావి’, ’సూడో సెక్యులరిస్టు’, ’మెకాలే మానసపుత్రుడు’ మొదలైన బిరుదులు అతనికన్నా బాగా ఇంకెవరికీ సరిపోవు. తియ్య తియ్యగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తూనే విద్వేష పూరితమైన, విధ్వంసకరమైన ప్రచారం చెయ్యడంలో అతన్ని మించినవాడు లేడు. అతని పేరునిబట్టి హిందువనుకుంటే పొరపాటు. **** EDITED **** హిందూ మతాన్ని ద్వేషిస్తాడు. ఆ మతం గురించి దుష్ప్రచారం చేస్తాడు. దేశభక్తి లేదంటాడు. కాశ్మీర్ ని పాకిస్తాన్ కి ఇచ్చెయ్యాలంటాడు. ఇలాంటి మూర్ఖుడితో వాదించి, వాదించి అనవసరం అని చాలామంది వదిలేశారు. ఒకాయన అయితే కొన్నాళ్ళు సుత్తి నరేష్ అన్న పేరుతో వీడి భరతం పట్టాడు. (http://panashaala.blogspot.com). మహేషు గాడి పాత రాతలు చదివితే గానీ ఆ సైటు గమ్మున అర్థం కాదు. అతను కూడా విసిగిపోయి ఈ మధ్య రాయడం మానేశాడు.

    మీ టపాలు రాసేటప్పుడు మహేష్ గాడి లాంటి *** EDITED **** జాగర్త అని చెప్పడానికే ఈ హిస్టరీ అంతా రాశాను.

    రిప్లయితొలగించండి
  18. I think you should edit mahesh's dammunte raa comment also.

    రిప్లయితొలగించండి
  19. Another Edited Comment (Original from Katti Mahesh Kumar)

    ___________________________________

    కత్తి మహేష్ కుమార్ అన్నారు...
    @మధ్య అజ్ఞాత: పేరు చెప్పుకునే దమ్ము లేదుగానీ నువ్వా నాకు **** EDITED **** భయం పెట్టేది!!!

    నేను కాశ్మీర్ పై రాసిన టపా లంకె ఇక్కడిస్తున్నాను.
    http://parnashaala.blogspot.com/2008/08/blog-post_17.html

    నేను హైదరాబాద్ లోనే ఉంటాను ***** EDITED **** కు నువ్వు మెయిల్ చెయ్యగలిగితే నా ఫోన్ నెంబరూ,అడ్రస్సూ ఇస్తాను.నీకు ఏంచేతనవ్వునో, **** EDITED **** చూద్ధాం.

    *****EDITED ***** అని నువ్వన్న ఈ మాట నీ కుల అహంకారానికి చిహ్నం. ఈ ఒక్క వాక్యంచాలు నువ్వు శ్రీకృష్ణజన్మస్థాన దర్శనం చెయ్యడానికి.

    ***** EDITED *****

    April 1, 2009 10:36 AM

    రిప్లయితొలగించండి
  20. మీరు ఎడిట్ చేసిన కామెంట్స్ చదువుతుంటే... నేను అప్పుడెప్పుడో చదివిన ఆంధ్రభూమి వారపత్రిక గుర్తుకొస్తుంది... అందులో చందూ సోంబాబు గారి నవలలో మద్యమద్యలో ఇలాగే ఎడిట్ ఎడిట్ అని సికరాజు (సి. కనకాంబర రాజు) గారు మితిమీరిన శృంగారాన్ని కట్ చేసేవారు. అది చూసి మేమేదో చదవకుండ మిస్సయిపోయామని ఎడిట్ చేసిన ఎడిటర్ గార్ని తిట్టుకునేవాళ్లం.

    రిప్లయితొలగించండి
  21. @Indian Minerva: మీకు చరిత్ర తెలిసీ అడుగుతున్నారో లేక నాకు తెలుసోలేదో అని అడుగుతున్నారో తెలీదు. కానీ,చెప్పడం నా బాధ్యత కాబట్టి వివరించడానికి ప్రయత్నిస్తాను.

    1857-1947 వరకూ జరిగిన స్వాతంత్రోద్యమ కాలంలో ఏకీకృతమైన "భారతీయ భావన" కల్పించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ఉమ్మడి శతృవు బ్రిటిష్ వాళ్ళు గనక, ఆ దమనపాలనకు వ్యతిరేకంగా ఒకటిగా పోరాడే ప్రయత్నం జరిగిందేతప్ప స్వాభావికంగా ఒకరమన్న స్పృహ అప్పటికీ ఇప్పటికీ లేదు. అంతేకాకుండా,విస్తీర్ణంలో మిక్కిలైనవీ, జనాభా రీత్యాకూడా బాహుళ్యమైనవీ అయిన లెక్కకు మించి రాజ్యాలూ, సంస్థానాలూ వారి పనుల్లో వారున్నారేతప్ప స్వాంతంత్ర్యోద్యమ స్పూర్తికూడా వీరిని అంటలేదు.

    మైసూర్, ట్రావెంకూర్, హైదరాబాద్, కాశ్మీర్, జునాగడ్, జైపూర్,బార్మేర్,ఉదైపూర్,బికానేర్,జోధ్పుర్,north-east రాజ్యాలూ, భోపాల్ మరియు ఇతర మధ్యభారతంలోని పలు విశాలమైన సంస్థానాలు ప్రత్యేకరాజ్యాలుగా స్వాతంత్ర్యానంతరం వరకూ మిగిలాయి.

    బ్రిటిష్ పాలనలో, మిగతా భారతదేశంకూడా ప్రెసిడేంసీల మయమేతప్ప ఒక సంఘటిత పాలనా యూనిట్ కూడా కాదు.గోవా,యానాం,పాండిచ్చేరి వంటి భాగాల్లో ఫ్రెంచ్ వారు, పోర్చుగీసువారుకూడా పరిపాలించే వారు.ఈ భాగాల్నన్నింటినీ ఒక రాజకీయపటంగా మార్చడానికి దాదాపు 1975(సిక్కిం భారతదేశంలో కలిసే)వరకూ పరిశ్రమించాల్సివచ్చింది.

    నిజానికి 1947 లో స్వతంత్ర్యం వచ్చినప్పుడు భారతదేశం ఒక దేశంగా మనగలుగుతుందనే ఆశ ప్రపంచదేశాల్లో ఎవరికీ లేదు. ఎందుకంటే ,భారతదేశం అనేది అప్పటికి కేవలం ఒక గొప్ప ఆలోచన మాత్రమే. ఇప్పటికీ అది మన ఆలోచనల్లో స్థిరపడిందేతప్ప, నిజమై ఆవిష్కరింపబడలేదు. కాకపోతే, ఈ దేశం ఇంకా రాజకీయంగా, భౌతికంగా ఒకటిగా ఉందంతే.మానసికంగా we are a fragmented country still.

    ఈ పుస్తకం దొరకబుచ్చుకుని చదవడానికి ప్రయత్నిస్తాను. చదివిన తరువాత సమీక్షించడం గురించి ఆలోచిస్తాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మా ఇల్లు కూడా ఒక ఆలోచన మాత్రమే అన్నట్లు ఉంది

      తొలగించండి
  22. @Malakpet Rowdy

    అజ్ఞాతల పేరుతో కామెంట్లు ఎవడైనా (మీరో, నేనో) రాయొచ్చు. కాబట్టి ఎవడైనా వెధవ కామెంటు రాసినప్పుడు డిలీట్ చెయ్యండి. అంతగా దమ్ముంటే వాడే మళ్ళీ పేరు పెట్టుకొని రాస్తాడు.

    రిప్లయితొలగించండి
  23. బాబు కత్తి గారు,

    "భారతీయుల మధ్య, శరీరనిర్మాణం, సాంస్కృతిక విధానాల్లో తేడాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.కాబట్టి మనది mixed race అనేది కాదనలేని సత్యం"

    ఇంత చదువుకొని ఇలా రాయటం...!!!!! చాలా అశ్చర్యం!!!

    మీకు gene mutations (see X-men movies) గురించి తెలుసా???

    there is scientifically possible after some generation mutations will occur naturally.

    For example eye color, Rare genetic mutations can even lead to unusual eye colors

    see

    http://en.wikipedia.org/wiki/Eye_color

    and there is possibility to get human color and శరీరనిర్మాణం by rare mutations. For example: God Rama have blue skin and some powers. Its possible, but we don't known which genes cause for this.. we have wait for finding that...

    OK

    Enjoy

    రిప్లయితొలగించండి
  24. @మరమరాలు: ఇంత చదువుకుని కూడా కాల్పనికజగత్తులో బ్రతుకుతున్నది నేను కాదు. మీ సమాధానం చూస్తే మీరే అనిపిస్తోంది.

    శరీరలక్షణాల్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల్ని "జాతులు"(race)గా ethnologists విభజించారు. నల్లగింగిరాల జుత్తు, ఒత్తైన పెదవులు,ధృఢమైన శరీరం గల వాళ్ళని ఒక జాతిగా.చిన్నచిన్నకళ్ళు,పొట్టికాయం వంటివారిని మరొకజాతిగా.ఇలా 5 జాతులుగా విభజించారు.అవే Caucasoid race,Negroid race, Capoid race,Mongoloid race, Australoid race.

    మన భారతదేశంలో దాదాపు ఈ అన్ని లక్షణాలకి సంబంధించిన ప్రజలూ కనిపిస్తారు.వివిధ జాతుల సంగమమైన భారతదేశం a country of mixed race అన్నాను. If you want to debate that let's do it.

    కానీ mutation, supernatural powers అంటూ మీ ఫేంటసీ సినిమా చర్చ కావాలంటే I am sorry, I am educated enough to differentiate fact from fantasy.

    రిప్లయితొలగించండి
  25. "ఉమ్మడి శతృవు బ్రిటిష్ వాళ్ళు గనక, ఆ దమనపాలనకు వ్యతిరేకంగా ఒకటిగా పోరాడే ప్రయత్నం జరిగిందేతప్ప స్వాభావికంగా ఒకరమన్న స్పృహ అప్పటికీ ఇప్పటికీ లేదు."

    మరి అప్పట్లో "భారత" అనే పదం దేన్ని వుద్దేశ్యించి వాడేవాళ్ళు? ఈ సంస్థానాలు అవీ వుండడం వల్ల భౌతికంగా ఒకరమన్న స్ప్రుహ లేదేమోకనీ స్వాభావికంగా భారతీయులమేకదా! తమ తమ శత్రుత్వాలను విడిచి పోరాడింది ఆ స్ప్రుహతోనే కద. తీవ్రతలో తేడాలుండవచ్చు అది నాయకునిపై ఆధార పడిన విషయం నాకెందుకో మీరు కొద్దిపాటి విషయాలను మరీ పెద్దవిగా చూస్తున్నారేమో అనిపిస్తుంది (మీ సిక్కిం మరియు ఇతర french వలసల గురించిన ప్రస్తావన నన్నిలా ఆలోచింపజెసింది) అప్పటి భారతీయ భావనకి, ఇప్పటి భారతీయ భావనకీ భౌతికంగా మరియు స్వాభావికంగా గల తేడాలేమాత్రం గణ్యమైనవి?. ఇక్కడ నేను పాలకుల గురించి మాట్లాడటంలేదు సామాన్యప్రజలను గూర్చి మాట్లాడుతున్నాను. మీరన్నట్లు పాలకులకొక "ఉమ్మడి" శత్రువు కావాలి సంఘటితం కావటానికి. కానీ పాలిత ప్రజలు ఎల్లలు మరచి తామంతా ఒకటేనన్న భావంతో వివిధ రీతుల్లో ఎవరిని? ఎక్కడనుండి? పారత్రోలటానికి పోరాడారు. పాలకుల పక్షాన్నుంచి అవి స్వతంత్ర సంస్థానాలే కావచ్చు ప్రజాంగీకారం లేకుండా, ప్రజల్లో ఆ భావనలేకుండా ఆ సంస్థానాల విలీనం సాధ్యమా? అలా విలీనమైన సంస్థానం కనీసం ఒకటైనా వుందా?

    చివరిగా ఒకమాట నేనింకా చరిత్రచదువుకుంటూనే వున్నాను కావున నా ప్రశ్నలను సందేహాలుగానే భావించగలరు.

    రిప్లయితొలగించండి
  26. @Indian Minerva: భరతుడి పేరుమీద ఏర్పడిందని భావిస్తున్న భరతఖండం తద్వారా భారతదేశం అనేవి కాల్పనిక ప్రమాణాలేతప్ప. భారతీయత అనే మూల భావనలకు ఆధారాలు ఏమాత్రం కాదు.

    బిపిన్ చంద్ర రాసిన "India's Struggle for Independence" లో ఒక పూర్తిస్థాయి చాప్టర్ భారత జాతీయభావనలు(Indian nationalism) ఎలా ఏర్పడ్డాయి అన్నదాని గురించి ఉంటుంది.

    ప్రస్తుతం ద్రవిడ-ఆర్య సిద్ధాంతాలను కుట్రలంటున్నవాళ్ళ discourses లో "అనుకుంటున్న" భారతీయత సాంస్కృతికపరమైన భారతీయత(cultural nationalism)కానీ, స్వాతంత్ర్యోద్యమ సమయంలో వచ్చిన చైతన్యం రాజకీయ భారతీయత(political nationalism)కు చెందిన సృహ. కేవలం rhetoric కోసం ఈ రెంటినీ కలగాపులగం చేసి వాడుకుని, ఒక emotional issue చేస్తున్నారుగానీ అవి రెండూ వేరు.

    భారతీయరాజకీయ భావనకూడా భారతదేశం మొత్తం ఏకస్థాయిలో లేదు. ఉదాహరణకు కాశ్మీర్ లో ఉండే భారతీయ భావన యొక్క తీవ్రత,definition వేరుగా ఉంటే, గోవా లో దాని స్వరూపం విభిన్నంగా ఉంటుంది.సిక్కింలో దాని రూపం వేరుగా ఉంటే పంజాబ్ లో పరిస్థితి మారుతుంది.

    అందుకే మనలో భిన్నత్వంలో ఏకత్వం ఎంతో ఏకత్వంలో భిన్నత్వమూ ఇప్పటికీ అంతేకాబట్టి India as one nation with ONE PEOPLE అనే అపోహనుంచీ దూరమవ్వాలని నా అభిప్రాయం.

    మీరు సంస్థానాల విలీనం గురించి కొంత over simplification చేస్తున్నట్లు అనిపిస్తోంది.వీలైతే రామచంద్ర గుహ రాసిన India after Gandhi చదవండి. మీరు అనుకుంటున్న "చిన్నపాటి విషయాలు" ఎంత పెద్దవో తెలుస్తుంది.

    రిప్లయితొలగించండి
  27. @కత్తి గారు,
    I am talking about Genetic (modern science with molecular level ANALYSIS ): The fact that living things inherit traits from their parents has been used since PREHISTORIC (the period before written history) times to improve animals (including human) and crop plants through selective and natural breeding.


    cut it
    turn your clock to

    3
    0
    0

    y
    e
    a
    r
    s

    b
    a
    c
    k

    Your talking about Ethnology (theoretical, its just object level COMPARISON ): That compares and analyzes the origins, distribution, technology, religion, language, and social structure of the ethnic, racial, and/or national divisions of humanity.

    Old time first they decide there is difference between humans ... then they start predict a theory from there fantasy..

    Its just for your information... I am sorry, no debate from my side.

    రిప్లయితొలగించండి
  28. మీరు వ్యాఖ్యలను నియంత్రిస్తేనే గాని ఇలాంటి అంశాల మీదఁ ఆరోగ్యకరమైన చర్చ జరగదు।

    ఈ టపాలో ప్రస్తావించిన విషయమై, నేనూ ఒక భాషా శాస్త్రవేత్తా పాపికొండల విహారంలో జరుపుకున్న ఆసక్తికరమైన చర్చను ఇక్కడ చెబుదామనుకున్నాను కానీ, దానికి సానుకూల చర్చావాతావరణం ఇక్కడ లేకపోవడం చూసి, మీ ఈ వ్యాసపరంపరలో పాలుపంచుకోవడం నుండి వైదొలగవలసివస్తుంది।

    ఎప్పుడైనా అమెరికాలో కలసినప్పుడు వ్యక్తిగతంగా చెబుతాను। బ్లాఙ్ముఖంగా రామ అన్నా పిత్తు అంటున్నారు లోకాః ॥

    రిప్లయితొలగించండి
  29. ఓహో! ఇదన్నమాట సంగతి. :-).

    అన్నట్టు మలక్, ఓ చిన్న తావీదు. ఈ సిరీస్ (కామెంట్లు కాదు :-)) నేను ఏ పన్నెండో సారో చదవడం. Too good.

    రిప్లయితొలగించండి
  30. అద్బుతంగా రాసారు . మీకు నా మనస్పూర్తిగా వందనాలు.......

    రిప్లయితొలగించండి
  31. అద్బుతంగా రాసారు సర్ ......మనస్పూర్తిగా వందనాలు

    రిప్లయితొలగించండి
  32. బ్రాహ్మణుల భాష సంస్కృతం.ఈ సంస్కృతంలో కొన్ని తెలుగు పదాలు వున్నాయి.ex:చాతుర్వర్ణం మయాసిశ్టం గుణ కర్మ విభాగ:ఇందులో గణం అనేది తెలుగులో కూడా వాడతాం.అలాగే త్రిమూర్తులు అనే పదంలో three అనే ఇంగ్లీషు పదం కూడా వుంది.అలాగే పంచమ అంటే హిందీలో 5 అని అర్థం. జాతి అనే పదం తమిళంలో మళయాళంలో కూడా వాడతారు.అరబిక్+హిందీ=ఉర్దూ.ఈ భాష కొంతమంది
    ముస్లింలకురాదు.కాబట్టిfriends.బ్రాహ్మణులు విదేశీయులు అనేది పచ్చి అబద్ధం.ఆర్యులు అంటే ఉత్తములు అని అర్దం.మద్యములు అంటే శూద్రులు అని.అంత్యములు అంటే వూరిచివరి మాల మాదిగలు.ఇలా భారతీయ సమాజాన్ని విభజించడం జరిగింది.ఇక తండాలు పల్లెలకు దూరంగా వుంటాయి.అందుకే వీరిని గిరిజనులు అన్నారు.తండాలో వుండేవారికి వారికి వేరే భాష వుంటుంది.అది వారికి తప్పితే ఎవరికీ రాదు.దానికి లిపి కూడా వుండదు.ఎరుకలవారు కూడా శూద్రులే.సింధూ నాగరికత కాలంలో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం.తర్వాత కాలక్రమంలో వ్యవసాయానికి కావలసిన అవసరాలు తీర్చడానికి కొంతమంది వడ్రంగిగా మారారు.వంటపాత్రలు చెయ్యడానికి కుమ్మరులుగా.గొర్రెలు కాసేవాడు.చేపలు పట్టే వాడు.బట్టలు కుట్టేవాడు.చెప్పులు కుట్టేవాడు.కూలివాడు.అడుక్కుని తినేవాడు.ఇలా కులాలుగా మారారు.ఇందులో సంస్కృతంలో మాట్లాడేవారికి తెలివితేటలు ఎక్కువగా వుండటం వల్ల వారు పూజార్లుగా మారారు.ఎవరైతే కుస్తీ పోటీల్లో గెలుస్తారో వారిని రాజులుగా నాయకుడిగా చేసారు.ఇక దాన్యమును కొని పశువుల పాలు అమ్మేవారు వైశ్యులు అయ్యారు.గ్రామానికి కొన్ని కట్టుబాట్లు వుండేవి.ఒక కులం పిల్లను ఇంకొక కులం వారు చేసుకోకూడదు.అలా చేసుకుంటే వూరికి కీడు వస్తుంది అని వారిని వెలివేసేవారు.పిల్లులు ఎలుకలు తినేవారిని వెలివేసారు.భూమి నుంచి లోహాలు వెలికి తీసేవారు.అలా తీయగానే భూదేవిని శాంతింపజేయడానికి యజ్ఞాలు చేసేవారు.ఇవి చేసేటపుడు గోవులను బలిగా ఇచ్చేవారు.యజ్ఞం కాగానే ఆ మాంసమును భుజించేవారు.కాలక్రమేణా గోవులను తినటం అలవాటుగా మారింది.కానీ మాల మాదిగలు విపరీతంగా గోవులను తినటం వారికి నచ్చలేదు.వారి అనుమతి లేకుండా తినటం వల్ల వారిని కూడా వెలివేసారు.ఇదీ అసలు కథ.

    రిప్లయితొలగించండి