3, మే 2011, మంగళవారం

ఒసామా చావు నా ఒబామహాభారతం నాటకాన్ని కూడా చంపేసింది :((

అప్పుడెప్పుడో ప్రమాదవనంలో ఐదు భాగలుగా వ్రాసుకున్న నాటకం .. ఈసారెలా అయినా దీపావళికి పిట్స్బర్గ్ లో వేయిద్దామనుకున్నది - ఒసామా చావుతో స్క్రిప్ట్ మార్చాల్సొస్తోంది. నాటకం ఏమిటి అంటారా?

మీరే చదువుకోండి మొత్తం ఒకటే భాగంలో ..


*************************************


లైట్స్ ఆన్!
కేమెరా!!
ఏక్షన్!!!

(వైట్ హౌస్)

ట్ర్రిర్రిర్రిర్రిర్రిర్రింగ్ ట్ర్రిర్రిర్రిర్రిర్రిర్రింగ్

ఒబామా: హెలోవ్! దిస్ ఈస్ బరాక్

ఫోనులో గొంతు: ఆఫ్గన్ నుండి రీపోర్ట్ ఇప్పుడే వచ్చింది సార్. విషయం బాడ్.
మనం స్ట్రేటజీ మార్చకపోతే మటాష్!

ఒబామా: అలాగా, సరే, థాంక్స్.

మళ్ళీ ట్ర్రిర్రిర్రిర్రిర్రిర్రింగ్ ట్ర్రిర్రిర్రిర్రిర్రిర్రింగ్

ఒబామా: హెలోవ్! దిస్ ఈస్ బరాక్

ఫోనులో ఆడ గొంతు: హలో యా! హవ్ ఆర్ యూ యా! దిస్ ఇస్ హిల్లరీ యా!

ఒబామా: వాట్ హేపెండ్ టూ యో లేడీ? వై ఆం ఐ హియరింగన్ ఏక్సెంట్?

హిల్లరీ: ఐ "యాం" "యిన్" "యిండియా" యా. ఎండ్ ఐ లైక్ యిండియన్ యాక్సెంట్ యూ నో

ఒబామా: అమ్మా! తల్లీ! ఇండియన్ ఏక్సెంట్ మాట్లాడింది చాలు గానీ విషయం చెప్పు!

హిల్లరీ: ఇప్పుడే అఫ్ఘాన్ రిపోర్టు వచ్చింది. పరిస్థితి బాలేదు.

ఒబామా: తెలిసింది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అసలు టెర్రరిస్టులకి
ఫండింగ్ ఎలా వస్తోందొ?

హిల్లరీ: లేమేన్ చేతో వామూ చేతో మనమే ఫండింగ్ చేయించాల్సింది.
ఈపాటికి చచ్చూరుకునేవాళ్ళు.

ఒబామా: నేరం నాది కాదు. జార్జ్ బుష్ ది!

హిల్లరీ: సరే! ఇప్పుడేం చేద్దాం?

ఒబామా: ఏముందీ? స్ట్రేటజీ మార్చాలి. కొత్త పధ్ధతులు ట్రై చెయ్యాలి.

హిల్లరీ: కొత్తవాటికన్నా పాతవే బెటర్ ఏమో?

ఒబామా: అంటే?

హిల్లరీ: ఇది వరకూ సక్సెస్ అయిన ఫార్మ్యూలాలు ఉపయోగించచ్చు కదా?

ఒబామా: అర్థం కాలేదు.

హిల్లరీ: నీకోపట్టాన అర్థం కాదని నాకు తెలుసు గానీ, నేనందేది పాత కాలం
నాటి యుధ్ధ నీతులు ఉపయోగించచ్చు కదా అని

ఒబామా: గుడ్ అయిడియా. సివిల్ వార్ నీతులు ఉపయోగిద్దామా?

హిల్లరీ: నీ యెంక్ .. వద్దులే తిట్లోలొస్తున్నాయి - నేను మాట్లాడేది వేలకు
వేల ఏళ్ళ క్రితం యుధ్ధాల గురించి

ఒబామా: సరే ఇండియాలోనే ఉన్నావు కద - రామాయణ మహాభారతాలు తీసుకురా

హిల్లరీ: నాయనా, బాబూ తండ్రీ - ఇది పుస్తకాలు చదివి నేర్చుకునేది కాదు.

ఒబామా: మరి?

హిల్లరీ: డా|| బ్రౌన్ తో మాట్లాడి టైం మెషీన్ తెప్పించుకో. అది తీసుకుని
భారతం టైం కి వెళ్ళి త్రిక్కులన్నీ నేర్చుకుని రా!

ఒబామా: ఇదేదో బాగానే ఉందే? నేనొక్కడనే వెళ్తే మరి కల్చర్ గేప్ ఉంటూంది కదా?

హిల్లరీ: అదీ నిజమే. ఇక్కడ అమర్ కింగ్ అని ఒక పెద్ద నెగోషియేటర్ ఉన్నాడు.
నాకు మాంచి ఫ్రెండ్. తోడు తీసుకెళ్ళు

ఒబామా: మరి అతనికి యుద్ధం, డిఫెన్స్ గురించి తెలుసా?

హిల్లరీ: అసలు తెలియదు. కానీ పనులు చక్కబెట్టుకొస్తాడు. డిఫెన్స్ కోసం
అయితే కే కే ఏంథోనీ ని కూడా తీసుకెళ్ళు. అలగే
కాస్త వినోదం కోసం ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహ్మాన్ ని కూడా తీసుకెళ్ళు

ఒబామా: అలాగే - థేంక్యూ!! ఇప్పుడే ఈ-మెయిల్ పంపిస్తున్నా

(కంప్యూటర్ బూట్ చెయ్యడానికి ప్రయత్నించి)

ఒబామా: వాట్ ద హెక్? సప్పోర్ట్ లైన్ కి కాల్ చేస్తా

(డయల్ చేస్తున్న చప్పుడు)

ఫోన్ లో కంఠం: "మీరు డయల్ చేసిన నెంబరు మరియొకసారి సరిచూసుకొండి! ప్లీస్
చెక్ ద నంబర్ యూ హావ్ డయల్డ్)

ఒబామా: ఓరినీ! నా టెక్ సపోర్ట్ కూడా అవుట్సోర్స్ అయ్యిందా? రామ రామ!
తప్పు తప్పు .. జీసస్ జీసస్!!

(మళ్ళీ డయల్ చేస్తున్న చప్పుడు)

ఫోన్ లో కంఠం: టెక్ సపోర్ట్ - మై నేం ఈస్ రాక్ మేన్ ! హౌ కెన్ ఐ హెల్ప్ యూ?

ఒబామా: (కాసంత చిరాగ్గా) ఏమిటి నీ పేరు రాక్ మేనా? క్రేక్ మేన్ ఏమి కాదూ?
నువ్వు ఇండీయాలో ఉన్నావని తెలుసుగాని అసలు పేరు చెప్పి చావు

ఫోన్ లో కంఠం: బండయ్యండి. అయ్యగారు టీ తాగడానికెళ్ళి నన్ను కూకోబెట్టారండి.

ఒబామా: ఖర్మ. ఈ స్లండాగ్ సినిమా తీసినవాడిని షూట్ చెయ్యాలి!!

బండయ్య: ఏటనీసినారేటి? ఏటేటో తెలీకుండా అనీసినారు. రేతిరసలే వన్నం
తినకుండా మందు కొట్టీసి సెట్టు కింద తొంగున్న - ఇప్పటికీ పిచ్చిపిచ్చిగా
ఉన్నాది

ఒబామా: ఏమి అనలేదు గాని - నా కంప్యూటర్ బూట్ అవ్వట్లేదు - ఏమి చెయ్యాలో చెప్తావా?

బండయ్య: ఏటవ్వట్లేదూ?

ఒబామా: బూట్ ! బూట్!! అదే ఆన్ అవ్వట్లేదు

బండయ్య: ఓస్ ఇంతేనా! ఆన్ ఆఫ్ ' సిచ్చి ' నొక్కీసి ఆన్ సెయ్యండీ!

(టిక్ క్లిక్ )

ఒబామా: వావ్ యూ ఆర్ ఎ జీనియస్. ఆన్ అయ్యింది. కానీ ఇప్పుడూ ప్రింటర్ పని
చెయ్యట్లేదే? అసలే విండోస్ విస్తా నాది

బండయ్య: మీరేటంటున్నారో నాకు మళ్ళీ అర్థం కాలేదు. ఇక్కడ ఏది పని
చెయ్యకపోయిన ఆఫ్ సేసి ఆన్ చేసీస్తారు కదేటి? పోయినవన్నీ బేగి
యెల్లిపొచ్చీస్తాయ్

(టిక్ క్లిక్ )

ఒబామా: వావ్ - పని చేస్తోంది - థేంక్యూ థేంక్యూ బాయ్ - హమ్మయా ఈ మెయిల్
వెళ్ళిపోయింది!

****************************************************


ఒబామా: సరే అందరూ వచ్చారా?

ఏంథోనీ: అమర్ కింగ్ గారికి కొంచం లేట్ అవ్వచ్చండీ!

ఒబామా: ఏం? ఎందుకని??

ఏంథోనీ: పొద్దున్న అమితాబ్ బచ్చన్ గారు నిద్ర లేచినప్పుడు ఆయన పేంటు
చినిగిందిట - అది కుట్టించుకుని రావడానికెళ్ళారు ... అదిగో వచ్చేశారు

ఒబామా: సరే ఇంక బయల్దేరదాం ...

(అందరూ బయల్దేరతారు)

అమర్ కింగ్: అరే 1999 - బెంగళూరు ఎంత కళకళలాడుతోందో!

అంథోనీ: 1998 - న్యూక్లియర్ టెస్ట్! వా వా !!

ఒబామా: 1975 - మా తాత .. మా తాత!

అంథోనీ: (రెహ్మాన్ చెవిలో): ఈయనకి జూనియర్ ఎం టీ ఆర్ పూనలేదు కదా?

రెహ్మాన్: ఇష్ ఇష్!!!

(కాసేపయ్యాక)

రెహ్మాన్: అలసటగా ఉంది కాసేపు దిగుదామా?

అంథోనీ: ఏ కాలంలో ఉన్నాం?

ఒబామా: అక్బర్ కాలంలో

అమర్: సరే దిగి ఒకసారి ఆయన్ని చూసొద్దాం

(అందరూ అక్బర్ దర్బారుకెళతారు)

అంథోనీ: (రెహ్మాన్ చెవిలో) ఈయనెవడండీ బాబూ? అచ్చం ఆ తెలుగు ఏక్టర్
బ్రహ్మానందంలా ఉన్నాడు?

రెహ్మాన్: ఇష్ ఇష్ - ఆయనే బీర్బల్

అంథోనీ: అసలు బీర్బల్ అంటే అర్థం ఏమిటండీ? బీరుతో బలం పుంజుకున్నవాడా మన
విజయ్ మాల్యా లా??

రెహ్మాన్: ఎహే! సుత్తాపి సైలెంటుగా ఉండు కాసేపు!

"జహాపనా అక్బార్ బాద్షా విచ్చేయుచున్నారొహో - సబ్ ఖడే హోజాఓ"

అంథోనీ: ఏంటీ? ఈ కాలంలో ఉర్దూ ఉందా?

రెహ్మాన్: ఉర్దూ పుట్టిందే ఇప్పుడు. ఈ కాలంలో సామాన్య సైనికుడూ మాట్లాడే
భాషని ఉర్దూ అని పిలిచేవారు

అంథోనీ: ఓహో!

(బేక్ గ్రౌండ్లో పాట: జబ్ ప్యార్ కియాతో డర్నా క్యా - 4 లైనులు)

అంథోనీ: ఓరినీ! ఇది నౌషాద్ గారి పాట అనుకునా!! ఆయన కాపీ కొట్టిందా?

అమర్: నీ బొంద. అది నా మొబైల్ ఫోన్ రింగ్ టోను. అభిషేఖ్ బేటా ఫోన్
చేస్తున్నాడు

ఫోనులో: బేటే - నేణు అక్బర్ టైంలో ఉన్నా ఢిల్లీ లో

....... అబ్బే అక్బర్ రోడ్ కాదు బేటా అక్బర్ కాలంలో !! నీకర్ధం కాదు గానీ
ఒక రెండూ రోజుల్లోగా నేనే ఫోన్ చేశ్తాలే. అప్పుడు వెళ్ళి కొందాం ఐష్వర్యా
బేటి చీరకి మేచింగ్ చెప్పులు!

(ఈలోగా అక్బర్ ప్రవేశం)

అక్బర్: అందరూ కూర్చోండి. (మన వాళ్ళ కేసి చూసి) ఎవరు వీరు? విచిత్ర
వేషధారణలో ఉన్నారు??

ఒబామా: మీ తరువాత కాలం వాళ్ళం. ఈ సమయ యంత్రాం ద్వారా మీదగ్గరకొచ్చాం

అక్బర్: భలే భలే! మా భవిష్యత్తు మీకు తెలుసన్నమాట .. కాస్త చెప్పండీ?

ఒబామా: చాలా ఘోరాలు జరిగాయి - అవన్నీ చెప్పకూడదు - చెప్పడానికి సమయం
కూడా లేదు. మిమ్మల్ని చూసి పోదామని వచ్చాం అంతే ..

(ఈలోగా గంట మోగుతుంది)

అక్బర్: ఎవరది? ఎవరో న్యాయం కోసం వచ్చినట్టున్నారే?

సేవకుడు: అవును జహాపనా. పిల్లలు పాఠాలు వినట్లేదని ఉపాధ్యాయ్లని
తీసేసార్ట. వాళ్ళు న్యాయం కోసం వచ్చారు.

అక్బర్: అలాగా? ప్రవేశ పెట్టండి!!

(లోపలికి వచ్చిన పంతుళ్ళతో)

ఏమిటయ్యా .. పిల్లలు పాఠాలు ఎందుకు వినట్లేదు

పంతుళ్ళు: వాళ్ళకి ఆవు అంబా అనును మేక మే మే అనును అంటే నచ్చట్లేదు జహాపనా!

రెహ్మాన్: అలాంటప్పుడు కొత్త పధ్ధతిలో చెప్పండి

పంతుళ్ళు: ఏ కొత్త పధ్ధతి?

రెహ్మాన్: నేనొక సంగీత విద్వాంసుడిని. అదే పాఠం నేను కూర్చిన ఒక గేయ రూపంలో
వినిపిస్తా ఉండండి

.... కావు కావని అరిచిందంటే కాకి అని దానర్ధం
.... మ్యావు మ్యావని కూసిందంటే పిల్లి అని దానర్ధం
.... రంకె పెద్దది వేసిందంటే ఎద్దు అని దానర్ధం
.... ఓండ్ర గట్టిగా పెట్టిందంటే గాడిదని దానర్ధం అర్ధం


.... కావు కావని అరిచిందంటే కాకి అని దానర్ధం
.... మ్యావు మ్యావని కూసిందంటే పిల్లి అని దానర్ధం
.... రంకె పెద్దది వేసిందంటే ఎద్దు అని దానర్ధం
.... ఓండ్ర గట్టిగా పెట్టిందంటే గాడిదని దానర్ధం అర్ధం


పంతుళ్ళు: ఇదేదో బాగనే ఉన్నది. ప్రయత్నిస్తాం. ఉంటామండీ

అక్బర్: ఆహా! మీ చాతుర్యం అపూర్వం. మా అతిధులుగా కొన్నాళ్ళుండమని ప్రార్ధిస్తున్నా

సలీం: అనార్కలి ఈ పాటకి నృత్యం బాగా చేస్తుంది

అక్బర్: అబ్బా ఉండరా సలీం. నీకెప్పుడూ ఆ అనార్కలి గోలే!

ఒబామా: జహాపనా .. మాకంత సమయం లేదు. మేంఉ బయల్దేరతాం ఇంక.

అక్బర్: ఎక్కడికెడుతున్నరో కనీసం అదయినా చెప్పండి

ఒబామా: మహాభారత కాలానికి

అక్బర్: ఆహా .. అలాగ? అయితే నేనుకూడ రావచ్చునా?

ఒబామా: మీరా? సరే రండి. మీరు కూడా నేర్చుకునేది చాలా ఉంటుంది

(అందరూ టైం మెషీన్ మళ్ళీ ఎక్కుతారు)


ఒబామా: అది సరే గానీ రెహ్మాన్ గారూ - మీ సౌత్ ఇండియన్ రాజకీయాలు ఎలా ఉన్నాయ్?

రెహ్మాన్: చప్పగా ఉన్నాయండి. కాని ఆంధ్రాలో మాత్రం విచిత్రంగా ఉన్నాయ్

ఒబామా: అవునా? ఏం జరుగుతోందక్కడ? నాకు తెలియాలి

అంథోనీ: అమ్మో ఇప్పుడు ఈయనకి జునియర్ ఎం టీ ఆర్ వాళ్ళ నాన్న పూనాడు

అమర్ : ఇష్ ఇష్

*************************************************



ఒబామా: అందరూ బెల్టులు కట్టుకోండి, యుగం మారుతున్నాం . కాస్త కుదుపులుండవచ్చు

అందరూ: సరే సరే!!!!

అమర్: అరే! ఈ కుక్క ఎవరిది?

అక్బర్: నాదే! నా తిండి తిని, నా పొరుగురాజ్యం వాడిపట్ల విశ్వాసం గా ఉంటుంది. నామీదే మొరుగుడు పైగా! అందుకే మహాభారత కాలంలో ఏకలవ్యుడి దగ్గర వదిలేద్దామని వచ్చా.

అమర్: అయ్యా! ఇలాంటివాళ్ళు మా కాలంలో కూడా ఉన్నారు - మేము వాళ్ళని కమ్యూనిష్టులని పిలుస్తాం

అక్బర్: ఓహో!!!

ఒబామా: సరే - భారతం వచ్చేసింది .. దిగండి

(అందరూ దిగాక)

రెహ్మాన్: ఏదో తేడాగా ఉంది .. సంథింగ్ రాంగ్!

ఒబామా: యుగం మారింది కదా ... జెట్ లేగ్ అయ్యుంటుంది!

రెహ్మాన్: కాదు కాదు .. ఏదో తేడాగా ఉంది .. సరే సరే పదండి

ఆంథోనీ: (పక్కన పడుకున్న ఒకతన్ని చూసి) ఈయనెవరండీ బాబూ, మిట్ట మధ్యాహ్నం నిద్రపోతున్నాడు, కుంభకర్ణుడిలాగా?

దారిన పోయే దానయ్య: స్వామీ, ఆయన కుంభకర్ణుడే!!!

రెహ్మాన్: సంథింగ్ రాంగ్!

అమర్: భజరంగ్ దళ్ ! భజరంగ్ దళ్ !

ఆంథోనీ: భజరంగ్ దళ్ కాదు... అవి కోతులు! వానర సైన్యం లా ఉంది ...

రెహ్మాన్: ఇప్పుడు అర్ధం అయ్యింది ... ఒబామా గారూ, మనం పొరపాటూన త్రేతాయుగానికొచ్చేశాం. ఇది రామాయణ కాలం, భారతం కాదు.


ఒబామా: అవునా! అయ్యో .. సరే ఎలాగూ వచ్చాం కదా .. రాములవారిని చూసి పోదాం

ఆంథోనీ (అమర్ చెవిలో): ఏమండీ అమర్ కింగ్ గారూ! మీకో చిన్న మాట

అమర్: ఏంటీ? నువ్వు కూడా ఆ తెలుగు గంగాధర్ మిమిక్రీ విన్నావా? తిన్నగా విషయం చెప్పి చావు

ఆంథోనీ: అదేనండీ, ఇప్పుడు రాములవారున్నారని తేలితే మన యూ.పీ.ఏ పార్ట్ నర్ కరుణానిధి మొహం ఎక్కడ పెట్టుకోవాలి?

అమర్: నిజమే! వీళ్ళని అసలు రాములవారి వైపు వెళ్ళనివ్వకూడదు

(ఒబామా తొ)

ఒబామా గారూ, ఒక్క విషయం. మరి కొన్ని రోజుల్లో యుద్ధం జరగబోతోంది. రాముల వారిని కలిసే అవకాశం మనకి రాదు. దాని బదులు ఆయన స్నేహితుడు సుగ్రీవుడిని కలుద్దాం

ఒబామా: సుగ్రీవుడినెందుకబ్బా?

అమర్: (ఒబామ చెవిలో కిచ కిచ కిచ కిచ)

ఒబామా: వండర్ఫుల్ వండర్ఫుల్ .. హిల్లరీ చెబితే ఏమో అనుకున్నా గానీ, మీరు అసాధ్యులే

(అందరూ సుగ్రీవుడి దగ్గరకెడతారు)

సుగ్రీవుడు: రండి రండి కలియుగ వాసులారా - మీ అద్భుతమైన సమయ విమానము గూర్చి వింటిని. సీతమ్మతల్లిని రావణుడి చెరనుండి విడిపించిన పిదప దానిని చూడవలెనని మనసు ఉవ్విళ్ళూరుచున్నది

అమర్: సుగ్రీవులవారికి నమస్సులు. యుద్ధము ఎప్పుడు మొదలగునో చెప్పగలరా?

సుగ్రీవుడు: ఇంకా వారధి తయారగుచున్నది కదా

అమర్: మేము కూడా రామ భక్తులమే స్వామీ

అంథోని (అమర్ చెవిలో): ఆ మాట బీ జే పీ వాళ్ళూ వినారంటే చంపేస్తారు నిన్ను

అమర్: ఇష్ష్ ఇష్ష్

(సుగ్రీవునితో)

సుగ్రీవా! మేము కూడా రామ భక్తులమే. ఆ రామ సేతు వారధి కాంట్రాక్టు మాకు అప్పగిస్తే అయొధ్య బాబ్రీ మసీదు స్థానంలో గుడి బీ.జే.పీ వారికన్నా ముందు మేమే కట్టీస్తాం - కదండీ ఒబామా గారూ?

అక్బర్: ఏమిటీ? మా తాతగారి మసీదు స్థానంలోనా? నేనొప్పుకోను

అమర్: ఎక్కువ మాట్లాడకు, నీ కుక్కని మళ్ళీ వెనక్కి నీతోనే పంపిస్తా!

అక్బర్: ఒద్దొద్దు బాబోయ్!

సుగ్రీవుడు: మీ మాటలు నాకు అవగతమగుటలేదు

అమర్: ఏమీ లేదు రాజా. మీరు వారధి కట్టే పనిని (ఒబా)మాకు అప్పగించండి. మేము కలియుగ కార్మికులని తీసుకు వచ్చి పని పూర్తిచేసెదము.

ఆంథోని: మధ్యలో ఒబామా లింక్ ఏమిటి?

అమర్: మనమే డిరెక్టుగా తీసుకుంటే మొత్తం మింగేది రూలింగ్ పార్టీ వాళ్ళే. ఒబామా అయితే బ్రిడ్జ్ అమేరికన్ టెక్నాలజీ, అవుట్సోర్సింగ్ మనకి .. అర్థమయ్యిందా

సుగ్రీవుడు: మీకది సాధ్యమేనా?

అమర్: సాధ్యమే ప్రభూ


(బేక్ గ్రౌండ్ లో పాట - మన వాళ్ళ దేన్సు

అన్ హోనీ కో హోనీ కర్దే (
హోని కో అన్ హోని
ఏక్ జగహ్ జబ్ జమా హో తీనో (

అమర్ అక్బర్ ఏంథోనీ
అమర్ అక్బర్ ఏంథోనీ )


ఆంథోని: అమర్ గారూ, మరి అందులో ఇసక ఎంత కలపాలి?

అమర్: దాని గురించి గట్టిగా మాట్లాదద్దు

సుగ్రీవుడు: నాకు వినబడినది. పవిత్రమైన రామ సేతువును మట్టితో నిర్మించెదరా? ఎంత అపచారము! మర్యాదగా మీకాలానికి పోవుడు, లేనిచో కఠినంగా శిక్షించెదము

అమర్: ఆంథోనీ, మొత్తం చెడగొట్టావు కదా ... ఇంక పద ..

(అందరూ మళ్ళీ టైం మేషీన్ లో)



*****************************************************



(అందరూ మళ్ళీ టైం మషీన్ లో)

రెహ్మాన్: ఒబామా గారూ, ఈ సారైనా కొంచం జాగ్రత్తగా
పోనివ్వండి. పొరపాటున డైనాసోర్ల యుగానికి తీసుకెళ్ళీపోతే మన పని “జింతాత జిత చిత జింతాత థా”

ఒబామా: జింతాత అంటే?
( అందరూ జింతాత దరువెయ్యడం మొదలు పెడతారు )

ఏంథోనీ: జింతాత అంటే లాఠీ, జిత చితా అంటే ఫేసు జింతాత థా అంటే పచ్చడి పచ్చడి కింద కొట్టడం

ఒబామా: ఒక్క ముక్క అర్ధం కాలేదు

ఋఎహ్మాన్: అబ్బో అదో పెద కధ లెండి – అదంతా తరవాత చెప్తా గానీ ముందు మీరు పోనివ్వండి

ఓబామా: అలాగే అలాగే

అక్బర్: ఇదంతా సరే గాని మరి నా కుక్కో?

అమర్ కింగ్: అరే చుప్. మహాభారతంలో వదిలేద్దామనుకున్నాం గా - మళ్ళీ మాట్లాడితే నీ కుక్క చేట నిన్నే కరిపిస్తా

అక్బర్: వద్దులే

ఏంథోనీ: అయ్యా ఈ కుక్కని చూస్తుంటే అప్పుడెప్పుడో వచ్చిన తేరీ మెహెర్బానియా అనే సినిమా గుర్తొస్తోందండీ

అమర్ (డొక్కుంటూ): ఉవ్వక్ – ఊవ్వక్ థూ – ఆ దిక్కుమాలిన కుక్క సినిమాని గుర్తు తెచ్చి డొకులు తెప్పిస్తావా? నీ సంగతి తరవాత చూస్తా

(కాసేపయ్యాక)

అక్బర్: అబ్బా!!

అమర్: ఏమిటీ సంగతీ?

ఏంథోనీ: అక్బర్ ఏద్చాడు

అమర్: నడ్డి మీద రెండు తగిలించు

ఏంథోనీ: నువ్వుండవయ్యా! ఆఅయన్ని దోమ కుట్టినట్టుంది
ఒబామా: అయ్యో దోమ! అమ్మో దోమ! స్వైన్ ఫ్లూ బాబోఇ!

రెహ్మాన్: ఒబామా గారూ – ఊరుకోండి. శ్వైన్ ఫ్లూ దోమలవల్ల రాదు – అదీ కాక ఇది ఇండీయా దోమ – మెక్సికన్ ది కాదు

ఒబామా: ఏమో, అయినా ఇక్కడీకి దోమెలా వచ్చింది

ఏంథోని: అమర్ గారి ముంబాయి పర్యటన పర్యావసానం

రెహ్మాన్: ఏమిటో – ఈ దోమని చూస్తుంటే ఆ తెలుగు షార్పీ పట్నాయక్ గారి పాట వేసుకోవాలనిపిస్తోంది

అమర్: వేసుకోండి అయితే

రెహ్మాన్:

చెప్పవే ప్రేమ, చెలియ చిరునామా .. చీ చీ ..

________________________________


కుట్టకే దోమ, చెయ్యకే హంగామా

ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడూన్నా

కుట్టకే దోమ, చెయ్యకే హంగామా

ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడూన్నా

వంటింట్లో నువ్వే, నట్టింట్లో నువ్వె, పడకింట్లో నువ్వే

మా ఇల్లంతా నువ్వే .. ఒహో హో


ఇప్పుడే ఎవరినో కుట్టావనే సంగతీ

పిల్లల ఏడుపూ నాకు చెబుతున్నదీ

ఇప్పుడే ఎవరినో కుట్టావనే సంగతీ

పిల్లల ఏడుపూ నాకు చెబుతున్నదీ

మార్టీను ఎంతకొట్టినా, టార్టాయిస్ మంట పెట్టినా

మార్టీను ఎంతకొట్టినా, టార్టాయిస్ మంట పెట్టినా

చావవే నిన్ను చంపేదెలా .. ఆ .. ఆ .. ఆ .. ఆ ..

కుట్టకే ||

ఒబామా: పాటలు సరేగానీ భారతం వచ్చేసింది దిగండి


**************************************

ఒబామా: భారతం వచ్చేసిందండీ. దిగండి

అమర్: నిజంగా భారతమే కదా, ఎందుకైనా మంచిది ఒక సారి చెక్ చేసుకోండి

ఒబామా: 100% పక్కా అండీ

ఏంథోనీ: కొంచం ధైర్యం చెయ్యండి అమర్ కింగ్ గారూ - మీకెలాగూ తెలివిలేదు కాబట్టీ మీరు ధైర్యవంతులే

అమర్: ధైర్యవంతుడంటే తెలివిలేనివాడా? ఎవరు చెప్పారు?

ఏంథోనీ: ఒకరు చెప్పాలా? మీరు స్టాలిన్ మతిలేని వ్రాతలు చెదివినట్టులేదు

అమర్: స్టాలిన్ మతిలేని వాడా?

ఏంథోనీ: స్టాలిన్ గురించి అర్థం కావాలంటే మీ సెర్వర్ స్పేసు బేండ్ విడ్త్ సరిపోవు

అమర్: స్టాలిన్ కీ బేండ్ విడ్త్ కీ ఏమిటి సంబంధం?

ఏంథోనీ: కామెంట్లగురించి పట్టించుకునేవాడు విప్లవకారుడు కాలేడు

అమర్: ఒక్క ముక్క అర్ధం అయితే నీ ఎడంకాలి చెప్పుతో కొట్టు

ఏంథోనీ: చెప్పుల కార్మికులని అవమానించద్దు. వారి ద్వారానే విప్లవం వస్తుంది

అక్బర్: నాకు కూడా ఏమీ అర్థం కావట్లేదు.

ఏంథోనీ: నీలా గడ్డం పెంచినవారందరూ సన్యాసులే

ఒబామా: ఇంతకీ మీరు దేనిగురించి మాట్లాడుతున్నారు ఏంథోనీ గారు?

ఏంథోని: పెట్టుబడిదారీ వ్యతిరేక ప్రాలిటేరియన్ వ్యవస్థ లో విమెన్ లిబరేషన్ కు కారణభూడయిన ఒసామా సద్దాం గురించి.

ఒబామా: ఒసామా సద్దామా? ఆయనెవడు?

ఏంథోనీ: నువ్వూ మఠంలో సన్యాసివేనా? వీ యన్ సీ ప్లేయర్ రిమోట్ డెస్క్‌టాప్ అంటే ఏమిటో తెలుసా నీకు?

రెహ్మాన్: అయ్యా ఏంథోనీ గారూ - ఒక వాక్యానికి దాని తరవాత దానికి సంబంధంలేకుండా ఉండే తెలుగు సినిమాపాటలా మాట్లాడుతున్నారు - కొంపదీసి మీ ముద్దు పేరు పక్షిరాజా?

ఏంథోనీ: పక్షికాదు, గ్రాంధిక భాషలో మార్తాండం అని పిలవచ్చు

మిగిలినవారు: హమ్మయ్య! విషయం ఇప్పుడర్ధమయ్యింది. ఎవరైనా ఆయన మొహం మీద కాస్త గోలిసోడా కొట్టండి

అక్బర్: గోలీసోడా వద్దు - పెప్సీనో కోకో కొట్టండి

ఒబామా: అక్బర్ గారూ, మీకివన్నీ ఎలా తెలుసు?

అక్బర్: రామాయణం నుండి భారతం దాకా సాగిన ఈ ప్రయాణంలో మీ మాటలు విని చాలా తెలుసుకున్నా లేండి. అందులో ఇదెఒకటి

అమర్: వాహ్ అయితే ఇప్పుడు మీరు మాడర్న్ అక్బర్ అన్నమాట

అక్బర్: అవును. నేనిప్పుడు జోధా అక్బర్ హ్రుతిక్ని - నా నాయిక ఐశ్వర్య

అమర్: చాలు. ఇక ఆపండి .. ఆపండి .. ఆపండి .. ఆపండి .. ఆపండి ...

ఒమాబా: ఏమయ్యిందండీ?

అమర్: మా ఐశ్వర్య బేటి మా అభిషేక్ బేటాకే నాయకి. వేరెవరికీ కాదు, కాబోదు. అన్నట్టు వెనక్కి వెళ్ళాక గుర్తు చెయ్యండి. ఆమెకి చెప్పులు కొనడానికి వెళ్ళాలి

రెహ్మాన్: సరే సరే దఅందరూ దిగండి. ఏంథోనీ గారికి పూనకం తగ్గి తెలివొచ్చిందా?

(అంతా భూమిమీద)

ఏంథోనీ: అమర్ గారూ, ఇవేవీ మన బీ ఆర్ చోప్రా మహాభారత్ సీరియల్ లో చూపించినట్టు లేవే? ఇక్కడ ఆడవాళ్ళు కూడా నిండుగా కప్పుకుని ఉన్నారు. అందులో చూపించినట్టు చాలీచాలని బట్టలేసుకుని లేరే?

అమర్: ఏహే! మాట్లాడకుండా నడవండి. అరే అటు చూడండి - ఆ గుడేదో విచిత్రంగా ఉంది?

(పక్కన పోయే దానయ్యని పిలిచి)

బాబూ! ఈ దేశానికి రాజెవరు?

దానయ్య (ఎగాదిగా చూసి): నాకు తెలిసినప్పుడు నీకు చెప్తాలే.

అమర్: సరే సరే, ఆ గుడి విచిత్రంగా ఉంది - ఎవరిది?

దానయ్య: ఇక్కడ పక్షి రూపంలో ఉండే ఓ రాక్షసుడు తన అరుపులు గావు కేకలతో జనాలని బెదరగొడుతూ ఉండేవాడు. మహిళలు చిన్నపిల్లలు దడుచుకునేవాళ్ళు

అమర్: ఓహో తరవాత?

దానయ్య: ఆ రాక్షసుడి బాధ పడలేక కొంతమంది లుంఢినీ నగర పురజనులా ఆరాధ్య దైవం కోసం తపస్సు చేశారు?

అమర్: లుంఢినీ నగరమేమిటండీ?

రెహ్మాన్: అదేనండి - ఇప్పటి లండన్.

అమర్: ఓహో

దానయ్య: వీరీమీద దయతలచి ఆయన ఏకలింగావతారం ఎత్తి ఆ రాక్షసుడి పీచమణచాడు. అయినా కృతజ్ఞతలేని వీళ్ళ నాయకుడొకడు ఇక్కడ ఉన్న సందులు మలుపులు కూడళ్ళు అన్నీ
తనవేనన్న ధీమాతో మేలుచేసినవాడిని కూడా బహిష్కరించాడు. కాని ఆ మేలు మరిచిపోలేని కొందరు కట్టించిన ఆలయమే ఈ ఏకలింగేశ్వరాలయం.

అమర్: చాలా కధ ఉందే. ఇంతకీ ఆ రాక్షస పరాభవం ఏలా జరిగింది?

దానయ్య: అబ్బో అదో వీనులవిందయిన ప్రహసనం. ఆ రాక్షసుడూ రోజుకి నాలుగుసార్లు అరుపులు గావుకేకలు పెట్టెవాడు "స్టాలించ మావోచ సద్దాంచ" అంటూ - ఆ అరుపులకర్ధం ఇప్పటికీ ఎవరికీ తెలియదు

అమర్: మాకు తెలుసు లేండి. మీరు కానివ్వండి.

దానయ్య: మన ఏకలింగేశ్వరుడు గంటకొకసారి కేకలు మొదలు పెట్టాడు - ఈ కేకలు భరించలేక ఏదిరించే తెలివి ధైర్యం లేక మార్తాండాసురుడు పలాయనం చిత్తగించాడు.

అక్బర్: ఆహా ఓహో. "గాలీ క జవాబ్ గాలీ సే దియా"

అమర్: అది మా లాల్ బహాదుర్ శాస్త్రి గారి లైన్. కాపీ కొట్టావంటే చంపుతా.

దానయ్య: ఏమంటున్నారూ?

అమర్: అయ్యో మిమ్మల్ని కాదు లెండి - మీరు వెళ్ళి రండి.

(అందరూ మళ్ళీ నడుస్తూ)

ఏంథోనీ: అయ్యా! ద్రౌపది నిజంగానే అయిదుగురు భర్తలున్నరంటారా? ఆ అన్యాయాన్ని ప్రశ్నించే స్త్రీవాదులు ఈ కాలంలో లేరా?

రెహ్మాన్: బాగుంది - భారతంలో ఫెమినిష్టులు - ఇదేదో మన చెంగనాయకమ్మగారి నవలలా ఉందే

ఏంథోనీ: మీరో సుప్రసిధ్ధ రచయిత్రిని అవమానిస్తున్నారు

రెహ్మాన్: అయ్యో! ఆవిడగురించి కాదండీ నేననేది. ఆవిడ అభిమాని, చెంగ ప్రవీణురాలు అయిన చెంగనాయకమ్మగారి గురించి.

ఏంథోనీ: "చెంగ" అంటే?

రెహ్మాన్: అడిగారూ? ఒక సారి తెలుగు ప్రమాదవనం బ్లాగులో రెండో ప్రమాదసూచిక చూడండి. మీకోసం మళ్ళీ టూకీగా ఇక్కడ:

తమ పనులు మానుకుని ప్రక్కవారి పనులు చేసిపెట్టడాన్ని "చెంగ" అని నిర్వచిస్తాం. ఈ చెంగ చేసిన వాడికి లాభమేమి ఉండదు - చేయించుకున్నవాడికి కూడా పెద్దగా లాభం ఉండదు.

ఉదాహరణకి - మీరు ఆవురావురుమంటూ కాలేజిలో కేంటీన్ కి వెళ్తుంటారు. ఈ లోగా ఎవరో అమ్మయి ఎదురుపడి "నాకు అర్జెంటు పనుంది. ఈ పుస్తకాలు లైబ్రరీలో ఇచ్చెయ్యరూ, ప్లీస్?" అంటుంది. వెంటనే మీరు అక్కడికి వెళ్ళి అరగంట క్యూ లో నిలబడి, మీ డబ్బులతో ఫైన్ కూడా కట్టి కేంటిన్ కి తిరిగొచ్చేటప్పటికి, ఆమె తన బాయ్ ఫ్రెండ్ తొ కాఫీ తాగుతూ "థేంక్యూ అన్నయ్యా!" అంటుంది. దీనివల్ల మీకొరిగినదేమీ లేదు, ఆ అమ్మాయికి పెద్దగా లాభమేమీ లేదు, మీ సమయం మాత్రం వృధా. ఇది చెంగలలో అతి సాధారణ చెంగ.


చెంగలు నానావిధాలు:

* పాకిస్తాన్ కోసం ఎవడొ ఆఫ్రికా వాడు కాష్మీరంటే ఏమిటో తెలియకపోయినా వచ్చి చస్తున్నాడు చూడు - దాని వల్ల వాడికి గాని వాడి కుటుంబానికి గాని ఏమి లాభం లేదు. ఎందుకూ చాలని కొంత డబ్బు తప్ప! దీనిని జిహాదీ చెంగ అంటాం!

* మందుకొట్టి పిచ్చిగంతులేస్తున్న ఆడపిల్లల్ని చావగొట్టిన వాళ్లది - సాంస్కృతిక చెంగ - దీనివల్ల ఆ పిల్లలు మారలేదు సరికదా .. వాళ్ళ లోదుస్తులు వీళ్ళకి పంపిస్తున్నారు. "ఉన్నిబట్టలేసుకోవే తల్లీ!" అంటే ఉన్న బట్టలు కూడా ఊడబీక్కున్న బాపతు!

* ఇక ప్రతీదానికీ ప్రభువు కాపాడును అని చెప్పి డబ్బులిచ్చి మరీ మతం మార్పిస్తారే - అది మతమార్పిడి చెంగ. వీళ్ళ డబ్బులయిపోయిన వెంటనే వేరే మతం వాళ్ళూ డబ్బులిచ్చి 'రీ కన్వర్ట్' చెయ్యరూ?

* నీకు నువ్వే చేసుకునే చెంగ (నీ గురించి నువ్వే గొప్పగా బ్లాగుల్లో వ్రాసుకోవటమన్నమాట) స్వచెంగ

* పక్కవాడికి చేసే చెంగ - పరచెంగ ("ఆహా! ఓహో! ఎక్కడికో వెళ్ళిపొయారు సార్ మీరు! మీరు " అంటూ)

* వాడు నీకు నువ్వు వాడికీ చేసేది - పరస్పర చెంగ (ఒకళ్లకొకళ్ళు పొగడ్త కామెంట్లు వ్రాసుకోవటమన్నమాట)

* సూడో చెంగ: అమేరికా వాడు పాకిస్తాన్ కి చెంగ చేస్తున్నట్టు కనిపించినా ఎక్కడ నొక్కెయ్యాలో అక్కడ తొక్కేస్తాడు. ఇది సూడో చెంగ!

* సాముహిక చెంగ: ఇది ఒక సమూహం కలిసి ఒకరికో ఇద్దరికో చేసే చెంగ.

* రాజకీయ చెంగ: అమ్మో! దీని రేంజ్ చాలా ఎక్కువ - మచ్చుకో రెండు ఉదాహరణలు:

******** ఎవడో పెద్ద లీడర్ వచ్చి స్పీచ్ ఇస్తుంటే ఫోటో కోసమ్ పక్క నిలబడి, ఆయనకి సేవలు చేసి, స్టేజ్ ఎక్కి చేతులు ఊపి చేసే చెంగ - తీరా టికెట్ వచ్చేది నీ విరోధికి!

******** భూఆక్రమణ అంటూ పేదలని ఆకట్టుకోడానికి చేసే చెంగ - ఇంతా చేసి ఓట్లు పడేది పొత్తు పెట్టుకున్న చెంగబాబునాయుడికో లేక చెంగశేఖరరావుకో!

* ఇలాంటివే ఫలానా హీరో అభిమాన 'చెంగాలు' కూడా!

* ఎవడో నీకు చెంగ చేస్తే నువ్వు ముగ్గురికి చెంగ చెయ్యటం - "పే ఇట్ ఫోర్వర్డ్" లేక "స్టాలిన్" చెంగ

* ఎవడో నీకు చెంగ చెయ్యటానికొస్తే నువ్వే వాడికి చెంగ చెయ్యటం - రివర్స్ చెంగ

* అవసరమున్నా లేకపోయినా పక్కవాళ్ళని కెలకడం - రౌడీ చెంగ!

చెప్పాలంటే చాలాఉంది గానీ ఇప్పుడు కుదరదు. కావాలంటే ఆ పోశ్తు చదువుకోండి. ఈ లింకులో కిందనుండి రెండో పోస్టు


http://pramaadavanam.blogspot.com/


ఏంథోనీ: ఓహో - సరే సరే! కానీ ఇక్కడ స్త్రీవాదుల సంగతి ఏంటి? ఈ కాలంలో ఫెమినిష్టు చెంగలు లేరా?

అమర్: ఈ కాలం వాళ్ళకి మనవాళ్ళలా పైత్యంలేదండీ. స్త్రీహక్కుల కోసం పోరాడెవారున్నారు గానీ, మగవాడూ సిగరెట్లు తాగితే మనమూ తాగాలి, వాడు మందుకొడితే మనమూ కొట్టాలి, పైటను తగలెయ్యాలి, చీరలను చింపుకోవాలి, పబ్బులను నింపెయ్యాలి, ఇడెమిటని అడిగితే సెక్షం 498A పెట్టి అరెస్టు చెయ్యాలనే విపరీత పోకడలు లేవు

ఏంథోనీ: 498A మహిళలకోసమే కదా

అమర్: అవును కానీ అలాంటి చటాలని మిస్‌యూజ్ చేస్తున్నారని కోర్టులేగొగ్గోలు పెడుతున్నయి కదా. దీనికి తోడు మగ ఫెమినిష్టులు. పైకి చెప్పేవి స్త్రీ జనోధ్ధారణ కబుర్లు. కాని అసలు రహస్యం ఏమిటంటె స్త్రీవాదం పేరుతో రేడికల్ ఫెమినిష్టులకి చేరువై "కావాల్సినది సాధించుకోవడం" - ఆ తరవాత టాటా బైబై అన్నమాట

ఏంథోనీ: అమ్మో. చాలా రాజకీయమే. రెహ్మాన్ గారూ, మీ ట్యూనులో మన రెడికల్ ఫెమినిష్టు అక్కల మీద పాట ఒకటి పాడకూడదూ?

రెహ్మాన్: సరే! ప్రేమదేశం "ముస్తఫా ముస్తఫా" బాణీలో

పల్లవి:

అక్కయా అక్కయ్యా డోంట్ హేట్ మేల్స్ అక్కయ్యా
పురుషుని ద్వేషించకే అక్కయ్యా
అండర్స్టేండ్ అండర్స్టేండ్ అర్ధం చేసుకో అక్కయ్యా
పురుషుడు నీ నేస్తమే అక్కయ్యా

అక్కయా అక్కయ్యా డోంట్ హేట్ మేల్స్ అక్కయ్యా
పురుషుని ద్వేషించకే అక్కయ్యా
అండర్స్టేండ్ అండర్స్టేండ్ అర్ధం చేసుకో అక్కయ్యా
పురుషుడు నీ నేస్తమే అక్కయ్యా

చరణం:

నిన్ను పొగిడితే కాకారాయుడు, లేకుంటే ఎం.సీ.పీ.
నువ్వేరైటంటే వెధవ, తప్పంటే అహంకారి
నీకేసీ చూస్తుంటే "నాట్ ఏ జెంటిల్ మేన్"
నీకేసీ చూడకపోతే "నాట్ ఎట్ ఆల్ ఏ మేన్"

అద్దంలో చూసుకునీ నువ్వే భయపడుతుంటే
"ఒహో ఐశ్వర్యా" అంటే ఎందుకు కోపం?

ఆ చెంగారాయుడినీ అన్ని హింసలు పెట్టడం
ఇదేనా నీ ఇస్త్రీవాద ధర్మం?

ఒహో హో హో హో హో ఓ హో హో హో హో
ఓ హో హో హో హో హో హో హో

అక్కయా అక్కయ్యా డోంట్ హేట్ మేల్స్ అక్కయ్యా
పురుషుని ద్వేషించకే అక్కయ్యా
అండర్స్టేండ్ అండర్స్టేండ్ అర్ధం చేసుకో అక్కయ్యా
పురుషుడు నీ నేస్తమే అక్కయ్యా

ఒబామా: సరే సరే! తొందరగా నడవండి. కౌరవులని పాండవులని కలవాలి


********************************************


(కౌరవ సభ)

దుర్యోధనుడు: పరలోకవాసులారా! రండి, సుస్వాగతం - ఆశీనులుకండి

అమర్: పరలోకం అంటాడేమిటండీ?

రెహ్మాన్: టైం మెషీన్ అంటే అర్ధం కాదని నేనేఅలా చెప్పమని ద్వారం దగ్గర భటులతో చెప్పా

ఒబామా: కృతజ్ఞులము

ఆంథోనీ: దుర్యోధనుడేమిటండీ చాలా హుందాగా ఉన్నాడు. మన ఎంటీఆర్‌లా హెంతమాఠ, క్షత్రీయ పరీక్ష అంటూ ఓవరేక్టింగ్ చెయ్యకుండా?

రెహ్మాన్: అయ్యా ఈయన అసలు దుర్యోధనుడు, పావలాకి రెండురూపాయల నటన చేసే తెలుగు నటుడు కాదు. మీ సందేహాలని కాస్త మీతోనే కాసేపు అట్టేబెట్టుకోండి ప్లీజ్!

దుర్యోధనుడు: యుధ్ధము భీకరముగా సాగుచున్నది. కౌరవులు హతులగుచున్నారు. ఏమిచెయ్యవలెనో తెలియట్లేదు. మీరెమన్న సలహా ఇవ్వగలరా?

ఒబామా (స్వగతం): సరిపోయింది. వీల్లదగ్గర నేనేదో నేర్చుకుందామని వస్తే, వీళ్ళే నన్ను సలహా అడుగుతున్నారేమిటి?

(బయటకు): తప్పకుండా సుయోధనా. కానీ దానికన్నా ముందు మీరు మాకు ఈ యుధ్ధం గురించిన విషయాలను ఎత్తులను సంపూర్ణంగా వివరించాలి.

సుయోధనుడు: తప్పకుండ. శకుని మామా! మొదలు పెట్టండి

(శకుని భారతాన్ని మొత్తం వివరిస్తాడు)

ఒబామా: (స్వగతం) అమ్మో! ఇన్ని ఎత్తులూ జిత్తులూ ఉన్నాయా దీనిలో. వెనక్కి వెళ్ళిన వెంటనే ఒసామా ని చిత్తుచెయ్యడానికి సరిపోయే ట్రిక్కులివి

(బయటకు): అంతా బాగానే ఉంది గానీ శకునిగారూ, ఇటువైపు వందమంది ఎందుకున్నారో అర్థం కావట్లేదు

శకుని: ఏం? అయిదుగురి కన్నా వంద మంది బలవంతులు కారా?

ఒబామా: కానేకారు. దీనికోసం మీరు మా కాలాంలో .. క్షమించాలి .. మా లోకంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, ఇంకా ప్రాసెస్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకోవాలి.

శకుని: అలాగా? చెప్పండి.

ఒబామా: మా మొదటిసూత్రం. అయిదుగురు వ్రాయాల్సిన ప్రోగ్రేములో ...

రెహ్మాన్: ఒబామా గారు! మామూలు భాష .. మామూలు భాష!

ఒబామా: సరే! అయిదుగురు చెయ్యాల్సిన పనిని Yఆభై మందికి అప్పగిస్తే పని తొందరగా జరగడం మాట అటుంచి అసలు పనే జరగకపోవచ్చు అని సూత్రం

శకుని: ఎందుకలా?

ఒబామా: మిగతా నలభై అయిదుగురు పని నేర్చుకుని, అర్ధం చేసుకుని మిగాతావారికి సహకరించేలోగా పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది.

శకుని (అలోచిస్తు): నిజమే!

ఒబామా: అలాగే మీ సైన్యం పడుతున్న ప్రయాసలో వ్యర్ధాన్ని అరికట్టాలి

శకుని: అదెలా?

ఒబామా: దీనికి మా లోకంలో సిక్స్ సిగ్మా అనే విరుగుడు వాడతాం.

శకుని: ఇదేదో బాగుంది - చెప్పండి.

ఒబామా: ఏమీలేదు శకునిగారూ! మీరు పదిమంది మంది సైనికులని మనిషికి రెండు చొప్పున ఇరవై రాళ్ళు మొయ్యమన్నారనుకోంది - అందులో అయిదుగురు ఒక రాయి చొప్పున మరో అయిదుగురు మూడు రాళ్ళ చొప్పునా మోశారనుకోండి - మీరేమంటారు?

శకుని: నా ఇరవైరాళ్ళూ నాకోచ్చేశాయిగా? సరాసరి మనిషికి రెండు

ఒబామా:కాని రిజల్టు వచ్చినా ప్రాసెస్ మటాష్ కదా?

శకుని: అంటే?

ఒబామా: క్షమించాలి. అలవాటుగా మా భాషలో మాట్లాడేశాను. మీకు కావాల్సిన పని ప్రస్తుతానికి జరిగిపోయింది సరే కానీ ఆ పదిమందిలో మీరు అనుకున్నట్టుగా ఎంతమంది సైనికులు పనిచేశారు?

శకుని (కాసేపు ఆలోచించి): అయిదుగురు ఎక్కువ, అయిదుగురు తక్కువ చేశారు. ఒక్కౠ చెప్పినట్టు చెయ్యలేదు

ఒబామా: అంతేకదా? రేపు ఖర్మకాలి మీరు మొదటి అయిదుగురిని రాళు మోసేపనిలో, మిగిలిన అయిదుగురినీ గుర్రాలని పరిగెత్తించే పనిలోను పెట్టారనుకోండి - మీకు ఇబ్బందే కదా?

శకుని: అవును సుమీ! నాకు తట్టనేలేదు

ఒబామా: ఎందుకంటే మీరు తీసుకునే సరాసరి లెక్కలు నిజాని కప్పేస్తాయి. అందుకే ఇలాంటివాటిట్లో మా భాషాలో స్టాండర్డ్ డీవియేషన్ ని వాడతాం. అంటే మీ భాషలో విచలనం లేదా వ్యతిక్రమం అన్నమాట.

శకుని: ఓహో

ఒబామా: ఇప్పుడు మీరు ఇరవై రాళ్ళు మొయ్యమన్న చోట పద్దెనిమిది వచ్చినా చాలు లెకపోతే ఇరవై రెండు రాగానే ఆపెయ్యండి అన్నారనుక్కోండి - మీరు కాస్త సడలింపు ఇచ్చి దానికి పరిమితి పెట్టారన్నమాట.

మీ సైనికుల వ్యతిక్రమం పరిమితికి సమానమైతే దానిని వన్ సిగ్మా అంటాం - అందులో సగమయితే టూ సిగ్మా అంటాం - అలాగే వ్యతిక్రమం గనక పరిమితిలో ఆరవ వంతు ఉన్నట్టయితే దానిని సిక్స్ సిగ్మా అంటాం

ఏంథోనీ: ఈయన చెప్పేది ఒక్క ముక్క కూడా అర్ధం కాల్వట్లేదు

అమర్: నాకూ అంతే

రెహ్మాన్: ఇష్ ఇష్

ఒబామా: సరే ఇప్పుడు మీరు చెయ్యాల్సిన పని వెంటనే యాభై మంది కౌరవ సోదరులని లేఆఫ్ చెయ్యడం.

శకుని: అంటే?

ఒబామా: యుధ్ధం లోంచి తప్పించడం. దీనివల్ల మీకు ఖర్చు తగ్గుతుంది - దక్షత, ఫలోత్పాదక శక్తి పెరుగుతాయి

శకుని: బాగు బాగు - అలాగే చేద్దాం


( దూరంగా పాండవ శిబిరంలో)

ధర్మరాజు: కృష్ణా! ఎవరో పరలోకవాసులు దుర్యోధనునికి సహాయము చేసున్నారని వేగుల కబురు

కృష్ణుడు: భయపడకి యుధిష్టిరా - వారు ఇక్కడికి కూడా వస్తారు. అదిగో మాటల్లోనే వచ్చేశారు. భవిష్య భూలోక వాసుల్లారా! రండి. సుస్వాగతం

అందరూ: నమో కృష్ణ, నమోన్నమ:

కృష్ణుడు: ఏమిటి ఒబామా గారూ! ఏలా ఉంది దుర్యోధనుల వారి ఆతిధ్యం

ధర్మరాజు: మీరు అన్యాయానికి అలా చేయూతనివ్వడం బాలేదు

ఒబామా: కావాలంటే మీకు కూడా సహాయం చేస్తాం

ధర్మరాజు: అదెలా సాధ్యం?

ఒబామా: ఎందుకు కాదు? మీ తరువాయి కాలంలో ఇటు భారత దేశానికి, వారి బధ్ధ శత్రువయిన పాకిస్తానుకి ఒకే సమయంలో సహాయం చేస్తున్నాం కదా - అలాగే

అక్బర్: పాకిస్తాన్ అంటే పవిత్రమైన స్థానం అని - అది మన కర్మ భూమికి శత్రువా?

ఏంథోనీ: అది పేరుకే పాకిస్తానండి. అవన్నీ మీకు చెప్పినా అర్ధం కావు. ఒబామా గారూ మీరు కానివ్వండి.

ఒబామా: కనుక మీకూ కౌరవులకీ ఏకకాలంలో సహాయం చెయ్యడం మాకు ఇబ్బంది కాదు.

కృష్ణుడు: మీ కాలమునుండీ ఇప్పటికే మాకు సహాయమందుచున్నది

ఒబామా: అదెలా?

కృష్ణుడు: మీ కాలపు తంతి రహిత దూరవాణి పరికరం ద్వారా ఒసామా బిన్ లాడెన్ అనునతడు మా అభిమన్య పుత్రునికి సహాయం చేయుచున్నాడు

ఒబామా: ఏంటీ? సెల్‌ఫొనులో ఒసామా అభిమన్యుడికి ట్రైనింగ్ ఇస్తున్నాడా? ఇంపాసిబుల్!!

రెహ్మాన్: అంటే అభిమన్యుడు పాండవుల ఆత్మాహుతిదళం నాయకుడన్నమాట

అమర్: అందుకే పద్మ్యవ్యూహంలోకి ఒక్కడు వెళ్ళి చంపగలిగిన వారిని చంపి తనూకూడా ఆహుతయ్యడు

ఏంథోనీ: అభిమన్యుడి మరణం వెనక ఇంత కధ ఉందన్న మాట

ధర్మరాజు: ఇక మీరందరూ విశ్రాంతి తీసుకోండి. రేపు మాట్లాడదాం. భటులారా! వీరికి విశ్రాంతి మందిరం చూపించండి

(వాళ్ళు వెళ్ళగానే)

కృష్ణా! వేగులు తెచ్చిన మరోవార్త! విరు కౌరవులకి చేసిన సహాయం పాండవుల పాలిట శాపమయ్యింది. వీరు ఇక్కడ ఉంటే ప్రమాదకరం. వేంటనే పంపించి వేయ్యాలి. ఏదయినా ఉపాయం చెప్పు.

కృష్ణుడు: ఏదీ ఆ దూరవాణిని ఒక సారి తెప్పించు. వారి కాలంలో హిల్లరీ అనే మహిళ ఉంది - ఆమేతో మాట్లాలి

(అర్ధరాత్రి అమర్‌కింగ్ కి ఫోన్ - ప్యార్ కియా తో డర్నా క్యా రింగ్ టోను)

అమర్: అబ్బబ్బబ్బా! మర్చిపోయి సెల్‌ఫోన్ జేబులో పెట్టుకొచ్చా. చంపేస్తున్నారు - హలో ఎవరది - బైడెన్ గారూ! మీరా? ఏమిటి విషయాలు?

(మొహం రంగులు మారుతుంది)

ఒబామా గారూ! నిద్రలేవండి - మీ కొంప మునగబోతోంది.

ఒబామా: ఏమయిందండీ?

అమర్: జగన్నాటక సూత్రధారితో పెట్టుకున్నాం - మీ మీదా, బైడెన్ గారి మీదా, హిల్లరీ ఇంపీచ్మెంట్ పెట్టబోతొంది ట. ఇప్పుడె ఫోన్.

ఒబామా: అయితే ఏంచెయ్యాలి?

అమర్: వెంటనే వెనక్కు వెళ్ళి దానిని ఆపాలి. లెఖపొటె భారతం సంగతి దేవుడెరుగు. మీ పదవి ఊడిపోతుంది.

ఒబామా: అమ్మో - అయితే అందరూ లేవండి. నేర్చుకోవాల్సినది నేర్చేసుకున్నాం! అక్బర్ గారు కూడ కుక్కని వదిలేశారు. ఇక ఆయనని ఆయన కాలంలో దింపేసి మనం వెళ్ళిపోదాం. పదండి.

(టైం మెషీన్లో వెళ్ళిపోతున్నవారిని చిద్విలాసంతో తిలకిస్తున్న శ్రీకృష్ణునితో తో తెర పడుతుంది)



*************** అయిపోయింది ***************

13 కామెంట్‌లు:

  1. ప్రస్తుతానికి అక్బర్ కాల౦ లో కెళ్ళే దాకా చదివాను. కొన్ని చాలా బాగొచ్చాయి, ఈ క్రి౦దివి చదవగానే పగలబడే నవ్వోచ్చి౦ది.

    "హిల్లరీ: లేమేన్ చేతో వామూ చేతో మనమే ఫండింగ్ చేయించాల్సింది.
    ఈపాటికి చచ్చూరుకునేవాళ్ళు."
    "ఫోనులో ఆడ గొంతు: హలో యా! హవ్ ఆర్ యూ యా! దిస్ ఇస్ హిల్లరీ యా!"
    "ఒబామా: ఓరినీ! నా టెక్ సపోర్ట్ కూడా అవుట్సోర్స్ అయ్యిందా? రామ రామ!
    తప్పు తప్పు .. జీసస్ జీసస్!!"

    ఫోన్ లో కంఠం: బండయ్యండి. అయ్యగారు టీ తాగడానికెళ్ళి నన్ను కూకోబెట్టారండి

    రిప్లయితొలగించండి
  2. ఒక వాక్యానికి దాని తరవాత దానికి సంబంధంలేకుండా ఉండే తెలుగు సినిమాపాటలా మాట్లాడుతున్నారు - కొంపదీసి మీ ముద్దు పేరు పక్షిరాజా?
    పక్షికాదు, గ్రాంధిక భాషలో మార్తాండం అని పిలవచ్చు


    నా తిండి తిని, నా పొరుగురాజ్యం వాడిపట్ల విశ్వాసం గా ఉంటుంది. నామీదే మొరుగుడు పైగా
    ఇలాంటివాళ్ళు మా కాలంలో కూడా ఉన్నారు - మేము వాళ్ళని కమ్యూనిష్టులని పిలుస్తాం
    :)) Some punches are too good.

    రిప్లయితొలగించండి
  3. అమర్ అక్బర్ ఆంటోనీ... ఎంచుకోవటం కూడా భలే కుదిఱింది. :)

    రిప్లయితొలగించండి
  4. బాగుంది భరద్వాజా

    రిప్లయితొలగించండి
  5. ఇది చూడండి

    http://telugulies.wordpress.com/2011/05/05/మాలిక-మీద-నా-అభిప్రాయం-ఏడ/

    రిప్లయితొలగించండి
  6. మాలిక మీద నా అభిప్రాయం (ఏడుపు)


    ఎవరండీ వీళ్ళు? నా బ్లాగ్‌లో కూడా అడ్డంగా రాస్తున్నారు. ఎంత ఓపిగ్గా రాసినా రెచ్చగొట్టడానికే ప్రయత్నిస్తున్నారు తప్ప మామూలుగా రాయడం లేదు. ఇదేం అలవాటు వీళ్ళకి?

    (అవును మరి. నేనెలాంటి కారు కూతలు కూసినా, అబధ్ధాలు చెప్పినా అది నా హక్కు. అవతలవళ్లకి మాత్రం నన్ను ఖండించే హక్కు లేదు)

    నేను రెండు సంవత్సరాలనుండి ఇంగ్లీసులో బ్లాగింగ్ చేస్తున్నా. అక్కడ ఇలాంటివి ఎప్పుడూ ఎదుర్కోలేదు.
    (నా మొహానికి నన్నెవడూ అక్కడ పట్టించుకోలేదు. అందుకే ఇక్కడికొచ్చా. అన్నట్టు ఇక్కడ ఎప్పటినించో ఉన్నాననుకోండి. ఏదో కొత్తగా వచ్చినట్టు నటిస్తున్నానంతే)

    ఈ రోజైతే Snkr అని ఒకరూ, srinivas అని ఇంకొకరూ చాలా అసభ్యంగా రాశారు. నా అభిప్రాయాలు రాసుకుందామని బ్లాగ్ పెట్టుకుని రాసుకుంటున్నా. మీ సోది వినాల్సిందేనా అని ఒకడు, చైనా మీద ఎందుకు రాయవు అని ఇంకొకడు, అదెవరో మార్తాండలాగా అని మరొకడు ఏవేవో రాస్తున్నారు. బ్లాగ్ లో మనకు నచ్చిన అభిప్రాయాలు రాసుకునే స్వేఛ్ఛ ఉంటుంది గదా. దాన్ని గుర్తించకుండా వాళ్ళకి నచ్చింది రాయాలంటారేంటి?
    (నా అభిప్రాయం నాకు రాసుకునే స్వేచ్చ ఉన్నట్టే వాళ్ళకి కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పే స్వేచ్చ ఉండకూడదు. అది నా నియమాలకి విరుద్ధం. అసలు ఆ Snkr, Srinivas కు మాలికతో ఏమీ సంబంధం లేకపోయినా మాలికని ఈ గొడవలోకి లాగడమే నా ఉద్దేశ్యం. నా అసలు ఏడుపు మాలిక మీదే కదా)

    వీళ్ళలో కొంతమంది (లేకపోతే అందరూనో) అమెరికాలో స్ధిరపడిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా కనిపిస్తున్నారు. అంత చదువు చదివి సభ్యతా, సంస్కారం లేకుండా వెకిలి రాతలు రాయడానికి సిగ్గు ఎలా లేదో అర్ధం కావడంలేదు.
    ( USA మీద అడ్డదిడ్డమైన అబద్ధాలు రాయటానికి నాకు సిగ్గు లజ్జా లేవు. అవి పుట్టుకతోనే రాలేదనుకోండి. కానీ మిగాతావాళ్లకి మాత్రం అవి ఉండాలి)

    ముఖ్యంగా అగ్రిగేటర్ అని చెబుతున్న ఓ సైట్ కి నా బ్లాగ్ ఇచ్చిన దగ్గర్నుండీ ఈ కామెంట్లు వస్తున్నాయి. అది గమనించి సైడ్ కాలంలో ఉంచిన వాళ్ళ బేనర్ని తీసేశాను. కాని వాళ్ళ లిస్టులోంచి తీయలేను కదా. తీయమని చెప్పినా వినేట్లు లేరు.
    (ఇది నా అసలు ఉద్దెశ్యం. మాలిక మీద ఏడుపే నా తక్షణ కర్తవ్యం)

    ఇలాంటి శాల్తీలు ఎదురుగా తగిలితే నాలుగు పీకుతాం.
    ( నేను నాలుగు పీకితే అవతల వాడు ఊరుకుంటాడేమిటి? నాలాంటి దరిద్రుడి ముప్పైరెండు పళ్ళూ రాలగొట్టడూ?)

    మానవ సమాజానికి సంబంధించిన కనీస నియమాలు పాటించట్లేదు వీళ్ళు.
    (నేకూడా పాటించట్లేదనుకోండి. అది వేరే విషయం. ఎంతయినా ప్రమోదవనం వారి కోవర్టుని కదా)

    అపాత్రదానం అన్నట్లు అర్హత లేని వారికి సాఫ్ట్ వేర్ విద్య అందిందే అనుకోండి. ఇలా దుర్వినియోగం చేయడమేనా?
    (నాది అపాత్రజీవనం అన్నట్ట్లు, అసలు మనిషిగా బ్రతకటానికే అర్హత లేని నాలాంటివాడి సంగతేమిటని అడగద్దు)

    ఇక్కడ ప్రజల డబ్బుతోనే చదువులన్నీ చదువుకుంటున్నాం. ప్రజల డబ్బు అని అంగీకరించకపోతే కనీసం తల్లిదండుల డబ్బుతోనైనా అని అంగీకరిస్తారు కదా? అలా చదువుకుని విజ్ఞానాన్ని ఇంత ఘోరంగా దుర్వినియోగం చేస్తున్నారే వీళ్ళు?
    (ప్రజల డబ్బుతో నేను పనీపాటా లేకుండా జల్సాలు చేసినా నన్నెవరూ ఏమనకూడదేం?)

    రిప్లయితొలగించండి
  7. on http://telugulies.wordpress.com


    మాలిక మీద నా అభిప్రాయం (ఏడుపు)


    ఎవరండీ వీళ్ళు? నా బ్లాగ్‌లో కూడా అడ్డంగా రాస్తున్నారు. ఎంత ఓపిగ్గా రాసినా రెచ్చగొట్టడానికే ప్రయత్నిస్తున్నారు తప్ప మామూలుగా రాయడం లేదు. ఇదేం అలవాటు వీళ్ళకి?

    (అవును మరి. నేనెలాంటి కారు కూతలు కూసినా, అబధ్ధాలు చెప్పినా అది నా హక్కు. అవతలవళ్లకి మాత్రం నన్ను ఖండించే హక్కు లేదు)

    నేను రెండు సంవత్సరాలనుండి ఇంగ్లీసులో బ్లాగింగ్ చేస్తున్నా. అక్కడ ఇలాంటివి ఎప్పుడూ ఎదుర్కోలేదు.
    (నా మొహానికి నన్నెవడూ అక్కడ పట్టించుకోలేదు. అందుకే ఇక్కడికొచ్చా. అన్నట్టు ఇక్కడ ఎప్పటినించో ఉన్నాననుకోండి. ఏదో కొత్తగా వచ్చినట్టు నటిస్తున్నానంతే)

    ఈ రోజైతే Snkr అని ఒకరూ, srinivas అని ఇంకొకరూ చాలా అసభ్యంగా రాశారు. నా అభిప్రాయాలు రాసుకుందామని బ్లాగ్ పెట్టుకుని రాసుకుంటున్నా. మీ సోది వినాల్సిందేనా అని ఒకడు, చైనా మీద ఎందుకు రాయవు అని ఇంకొకడు, అదెవరో మార్తాండలాగా అని మరొకడు ఏవేవో రాస్తున్నారు. బ్లాగ్ లో మనకు నచ్చిన అభిప్రాయాలు రాసుకునే స్వేఛ్ఛ ఉంటుంది గదా. దాన్ని గుర్తించకుండా వాళ్ళకి నచ్చింది రాయాలంటారేంటి?
    (నా అభిప్రాయం నాకు రాసుకునే స్వేచ్చ ఉన్నట్టే వాళ్ళకి కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పే స్వేచ్చ ఉండకూడదు. అది నా నియమాలకి విరుద్ధం. అసలు ఆ Snkr, Srinivas కు మాలికతో ఏమీ సంబంధం లేకపోయినా మాలికని ఈ గొడవలోకి లాగడమే నా ఉద్దేశ్యం. నా అసలు ఏడుపు మాలిక మీదే కదా)

    వీళ్ళలో కొంతమంది (లేకపోతే అందరూనో) అమెరికాలో స్ధిరపడిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా కనిపిస్తున్నారు. అంత చదువు చదివి సభ్యతా, సంస్కారం లేకుండా వెకిలి రాతలు రాయడానికి సిగ్గు ఎలా లేదో అర్ధం కావడంలేదు.
    ( USA మీద అడ్డదిడ్డమైన అబద్ధాలు రాయటానికి నాకు సిగ్గు లజ్జా లేవు. అవి పుట్టుకతోనే రాలేదనుకోండి. కానీ మిగాతావాళ్లకి మాత్రం అవి ఉండాలి)

    ముఖ్యంగా అగ్రిగేటర్ అని చెబుతున్న ఓ సైట్ కి నా బ్లాగ్ ఇచ్చిన దగ్గర్నుండీ ఈ కామెంట్లు వస్తున్నాయి. అది గమనించి సైడ్ కాలంలో ఉంచిన వాళ్ళ బేనర్ని తీసేశాను. కాని వాళ్ళ లిస్టులోంచి తీయలేను కదా. తీయమని చెప్పినా వినేట్లు లేరు.
    (ఇది నా అసలు ఉద్దెశ్యం. మాలిక మీద ఏడుపే నా తక్షణ కర్తవ్యం)

    ఇలాంటి శాల్తీలు ఎదురుగా తగిలితే నాలుగు పీకుతాం.
    ( నేను నాలుగు పీకితే అవతల వాడు ఊరుకుంటాడేమిటి? నాలాంటి దరిద్రుడి ముప్పైరెండు పళ్ళూ రాలగొట్టడూ?)

    మానవ సమాజానికి సంబంధించిన కనీస నియమాలు పాటించట్లేదు వీళ్ళు.
    (నేకూడా పాటించట్లేదనుకోండి. అది వేరే విషయం. ఎంతయినా ప్రమోదవనం వారి కోవర్టుని కదా)

    అపాత్రదానం అన్నట్లు అర్హత లేని వారికి సాఫ్ట్ వేర్ విద్య అందిందే అనుకోండి. ఇలా దుర్వినియోగం చేయడమేనా?
    (నాది అపాత్రజీవనం అన్నట్ట్లు, అసలు మనిషిగా బ్రతకటానికే అర్హత లేని నాలాంటివాడి సంగతేమిటని అడగద్దు)

    ఇక్కడ ప్రజల డబ్బుతోనే చదువులన్నీ చదువుకుంటున్నాం. ప్రజల డబ్బు అని అంగీకరించకపోతే కనీసం తల్లిదండుల డబ్బుతోనైనా అని అంగీకరిస్తారు కదా? అలా చదువుకుని విజ్ఞానాన్ని ఇంత ఘోరంగా దుర్వినియోగం చేస్తున్నారే వీళ్ళు?
    (ప్రజల డబ్బుతో నేను పనీపాటా లేకుండా జల్సాలు చేసినా నన్నెవరూ ఏమనకూడదేం?)

    రిప్లయితొలగించండి
  8. హ హ హ హ. ఆ విశేఖర్ గారా, ఆయన స౦గతి ఎవరికి తెలీదు…ప్రశ్నలడిగే కమ్యూనిస్టు మాస్టారిని, ప్రశ్నలడిగితే సహి౦చరు. ఒకే ఒక్కసారి, ఆయన ఒక బ్లాగుపోస్టు మీద నా కామె౦ట్స్, రె౦డో/మూడో రాసాను.
    ఆ పోస్టు లో ఉన్న సారా౦శ౦ ఇది.

    *గఢాఫీకి వ్యతిరేక౦గా పోరాడుతున్న తిరుగుబాటుల౦టే అక్కడి ప్రజలకి ఇష్టన్ లేదు, ప్రజలు గఢాఫీనే అధికార౦ లో ఉ౦డాలని కోరుకు౦టున్నారు, కాని వెస్ట్రన్ క౦ట్రీస్, మీడియా తిరుగుబాటుదారులకి మద్దతిచ్చి, ప్రజల్లో ఉన్న కోరికని బయటకి రానివ్వట్లేదు అని *

    నేను ఒకే ఒక లైన్ ప్రశ్న అడిగా..ఈ విషయమ్ మీకెలా తెలుసు, అని

    దానికాయన, అమెరికన్ న్యూస్ పేపర్స్ ఎల్ ఏ టైమ్స్ లా౦టి పత్రికల్లో చదివాను అని ఆయన రాసారు.

    సరే, సోర్సెస్ లి౦క్స్ ఉన్నాయా అని అడిగా.

    దానికాయన, ఆ పత్రికలు చదివినప్పుడు అ౦దులో రాసే విలేఖరులు చాలా ప్రత్యేక శిక్షణ పొ౦ది రాయాలనుకున విషయాన్ని సూటిగా రాయరు, మన౦ స౦వత్సరాల తరబడి చదువుతున్న అనుభవ౦తో, అర్ధమ్ చేసుకోవాలి విలేఖరి ఏ౦ చెప్పదల్చుకున్నాడూ అనేది.

    అ౦టే, నేను ఓహో, అది మీ అభిప్రాయమన్న మాట, మీ దగ్గర నిజ౦గా సోర్సేస్ లేవన్న మాట, సో ఇది ప్రాపగా౦డా అవుతు౦ది, అబద్దాన్ని నిజ౦ లాగా ప్రచార౦ చేయటానికి చేసే ప్రయత్న౦, ఇలా౦టి ప్రచారాలే చిన్నప్పుడు నేను వినేవాణ్ణి, సోవియట్ యూనియన్ భూతలస్వర్గ౦ అని, రాసా. ఇ౦తకీ మీర్రాసినదానికి సోర్సెస్ అడిగితే అవి ఇవ్వకు౦డా, ఈ inferences గురి౦చి మాట్లాడతారే౦టీ అని, అలాగే నాకు తెలిసిన లెఫ్ట్ వి౦గ్ పేపర్సూ, చానెల్సూ, రైట్ వి౦గ్ మీడియా అవుట్ లెట్స్ పేర్లు చెప్పా, ఏది ఫాలో అవుతే ఏ౦ చెబుతారో అని

    దానికాయన కి కోప౦ వచ్చి, అన్ని కామె౦ట్లు, ఆయన కామె౦ట్లతో సహా, డిలీట్ చేసి పడేసాడు. అస్సలు ఏమ్ నోటీస్ లేదు, ఎక్స్ప్లనేషన్ లేదు, కోప౦తో అరుపులు లేవు, ఏ౦లేదు.

    శాల్తీ మాయ౦ అయ్యి౦ది, అచ్చ౦ కమ్యూనిస్టు దేశాల్లో లాగా

    రిప్లయితొలగించండి
  9. అవునా విలేకర్ గారు, తమరి బొ౦ద.
    1. 9/11 తర్వాత అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో అడుగు పెట్టినప్పుడు, బిన్ లాడెన్, జహ్వారీ లు 9/11 సెలబ్రేషన్సూ, వాళ్ళు ఆ ప్లాన్ ఎలా చేసారు, ఎలా అటాక్ చేసారూ అన్న డిటేల్స్ , దొరికిన వీడియోలు జగత్ప్రసిద్ద౦.

    2. విచారణా–ఏ౦టి తమరి తలకాయ్.
    డొమెస్టిక్ క్రైమ్ అయినా, ఇన్టర్నేషనల్ క్రైమ్ అయినా, ముద్దాయి ని పట్టుకు౦దామని, అథారిటీస్ వెళ్ళినప్పుడు, అప్పుడా ముద్దాయి ప్రమాదకరమయిన రీతిలో మూవ్స్ చేసినప్పుడు, షూట్ చేయటమ్ చట్టరీత్యా ఆమోద౦. అ౦దులో తమరి ఆరాధ్య దైవ౦ అయిన బిన్ లాడెన్ గారు, ఇ౦టర్నేషనల్ టెర్రరిస్టు నె౦బర్ 1. ఇ౦కె౦త జాగ్రత్తగా ఉ౦డాలి, ఆయన మూవ్స్ విషయ౦ లో.
    ౩. హుమన్ రైట్స్ -
    సిగ్గేయ్యట్లేదా, చీ, తమరు కూడా హ్యుమన్ రైట్స్ గురి౦చి మాట్లాట్టమే!!!!!! Human rights దాకా ఎ౦దుకు గానీ, మీ చైనా కెళ్ళి, ఆ శ్రామిక హక్కు లు కాపాడుకో పో ము౦దు.
    ఆ sweat shops కెళ్ళి, అక్కడ యూనియన్స్ స్థాపి౦చి, minimum wage, minimum working standards, గాలి, వెలుతురు, reasonable working hours వాటి కోస౦ పోరాడ౦డి.

    ఆకలెక్కువ, తెలివితక్కువ దద్దమ్మలు తమ

    రిప్లయితొలగించండి