6, నవంబర్ 2011, ఆదివారం

మరోమారు బహిర్గతమైన కమ్యూనిష్టుల రెండోనాలుక!







తాము తప్ప ప్రపంచంలోని మిగాతావారందరివీ ద్వంద్వప్రమాణాలనే కమ్యూనిష్టులు వాళ్ళ ప్రమాణాలని వాళ్ళే నిరూపించుకుంటున్నారు.

అబ్బెబ్బే, ఇది తెర గారి గురించి కాదులెండి. ఆయన సంగతి తెలియనిదెవరికీ? కామెంట్లు తీసెయ్యటానికి కారణం దొరక్కపోతే భాష పేరు చెప్పి తప్పించుకోవటం ఇప్పుడు పాతబడిపోయింది. అసలు సంగతేమిటంటే ఆయన అనూనయులు వాడే భాష ఆయన కంటికి ఇంపుగా ఉంటుంది.

నేను మాట్లాడుతోంది వారి పత్రిక గురించి. రోమిలా థాపర్ లాంటి పనికిమాలిన శాల్తీలు వగే పిచ్చివాగుడు ప్రసా(చా)రం చేసే వ్యూహంలో భాగంగా ఒక కమ్యూనిష్టుడి (కమ్యూనికృష్టుడి అంటారా? సరే సరే మీ ఇష్టం) పత్రిక మన మేడంగారి ఇంటర్వ్యూ ఏదో పేచురించింది. మన తెలుగు కమ్యూనిష్టువీరులేమో దానిని కాస్త దండేసి ఫోటో కట్టించారు.

అన్నట్టు ఇంతకీ విషయమేమిటంటే, ఎవడో మేతావి వ్రాసిన వ్రాతల్ని ఢిల్లీ యూనివర్సిటీ సిలబస్ లోంచి తొలగించింది. "ఏమిటీ సంగతీ?" అంటే "రోమిలా ఏడ్చింది" అన్న చందాన ఎఱ్ఱబాబులు కాకిగోల మొదలుపెట్టారు. సిలబస్ లోంచి హిందూవ్యతిరేక వ్యాసాలని తొలగించకూడదని వీళ్ళ డిమేండ్. అంతవరకూ బాగానే ఉంది.

కానీ ఆ తొక్కలో వ్యాసాన్ని చూసి వళ్ళు మండిన ఒక బ్లాగర్ గట్టిగానే ఇచ్చుకున్నారు. హిందువులంటే అందరికీ అలుసే అని ఘాటుగానే స్పందించారు. అయితే ఔరంగజేబులో దైవత్వాన్ని చూసే రోమిలా, ఆవిడగారి శిష్యగణాల రూటే వేరు. తమకి వ్యతిరేకంగా ఒక వ్యాఖ్య వచ్చేసరికీ దాన్ని పీకిపారేశారు ఈ కమ్యూనిష్టులు. అలాంటింది హిందూవ్యతిరేక వ్యాఖ్యలని, కాదు .. కాదు ఏకంగా వ్యాసాలని ప్రచురించాలిట. పోనీ చరిత్రకి సంబంధించిన ఆధారాలేమన్నా ఉన్నాయా అంటే అవీ లేవు. ఆర్యుల దురాక్రమణ సిధ్ధాంతం పేరుతో భారతీయుల్ని విడదీసే ప్రయత్నం చేశి, సఫలీకృతురాలినయ్యానని ఆనందపడేలోగానే మిగాతావారి పరిశోధనల వల్ల భంగపడిన మేడంగారా మనకి చరిత్రగురించి పాఠాలు చెప్పేది?

ఆ బ్లాగర్ వ్యాఖ్యలివిగో:

_______________________________________________

RADHAKRISHNA చెప్పారు...

ఎవరికి తోచినట్లు వారు ఏదోకటి అనేయట బాగా పరిపాటైయ్యింది. వీరందరూ ఇతర మతాల కధల జోలికి ఎందుకు వెళ్ళరు? అవన్నీ హేతుబద్ధంగా వుండి ప్రజల మనస్సును చక్కగా తీర్చి దిద్దాయా? అలా అయితే వాటిలోని లోపాలను బహిరంగంగా చెప్పటానికి ఎందుకు లౌకికతత్వం అనే ముసుగు వెసుకుని భయం లేనట్లు నటిస్తారు? మరి రామాయణ, భారతాలను విమర్శించే వారికి ఇంత ధైర్యాన్ని ఇచ్చిందెవరు?

అదే భారతీయ సన్స్కృతి; ఈ ఇతిహాసాలను మరియు చక్కటి అనుబంధ పురాణాలను మనకు తెలియకుండా వంట బట్టించుకోబట్టే అందరూ ధైర్యంగా, స్వేచగా మాట్లాడగలుగుతున్నారు, వ్యాఖ్యలు చెయ్యగలుగుతున్నరు. మన వ్యక్తిత్వంలో ఇంతటి స్వేచ్చనిచ్చిన హిందూ మాతం లాంటిది మరొకటి చూపించి, తరవాత మనమీద మనం విమర్శ చేసుకొవడం మొదలు పెడితే బావుంటుంది. మన స్వేచ్చను బయట సాన్స్కృతిక దాడికి లోనైన కొందరు అతిగా తీసుకుని కూర్చున్న చెట్టునే నరకాలని చూస్తున్నారు. మరి ఇంట్లో వాళ్ళనే తిట్టి, అడ్డదారిన పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుందామని అనుకుంటున్న ఈ విభీషుణులకి వినపడుందో లేదో!!!

_______________________________________________________

RADHAKRISHNA చెప్పారు...
నా కామెంటు తొలగించారు కాబట్టి నెను చెప్పిందే నిజమైది. ప్రజాశక్తి లో "శక్తి" కేవలం నేతిబీరకాయేనన్నమాట. ఈ నిరంకుశత్వానికే నేను వ్యతిరేకం. నచ్చకపోతే నా కామెంటుకి కామెంటు వ్రాసే స్వేచ్చ ప్రజలకివ్వచ్చుగా... "ప్రజల శక్తి" మీద మీకే నమ్మకం లేదా?

8 కామెంట్‌లు:

  1. The article is an excerpt from Romilla Thapar's interview in Hindu . So, it is quite obvious that the article/interview would be all crap. అంచనా తప్పలేదు.

    కాలం గడుస్తున్న కొద్దీ ఇతిహాసాలు మారుతూ ఉంటాయట. సో, ఈ లెక్కన మహమ్మద్ ప్రవక్త జీవిత గాధ, బైబిల్, టెన్ కమాండ్మెంట్స్ కూడా మారినవే కదా. మరి ఎవరికీ నోరు పెగలదే? హిందువుల ఇతిహాసాలే మారుతూ ఉంటాయి. ఈ థాపర్ లాంటి క్రీపర్స్ కదా వాటిని ఎడాపెడా మార్చేది.

    రిప్లయితొలగించండి
  2. వందేమాతరం అంటూ దేశమాతకి వందనం చెయ్యమంటే ఠాఠ్ చెయ్యం అంటే నోరుమూసుకుని పరమతసహనం పాటిస్తూ, ఒక చెంప మీద కొడితే రెండో చెంప కేవలం హిందువులే చూపించమనే సిధ్ధాంతాన్ని తు.చ. తప్పకుండా పాటించే మెజారిటీ దేశభక్తులు ఉన్న దేశంలో, కాలంలో ఈ ఆర్టికల్ పెద్ద విషయం కాదేమో. I am actually surprised. Delhi university ఆ రాతల్ని సిలబస్ నించి తొలగించిందంటే.

    రిప్లయితొలగించండి
  3. నాకో అతి తెలివి వ్యాఖ్యాత తగిలాడు లెండి. కాకపోతే పైన చెప్పిన ప్రజాశక్తి పత్రికలో కాదు. వేరే చోట. సింపులుగా చెప్పుకుంటే మ్యాటరు.. "నయతార మత మార్పిడి". ఆవిడ హిందూ మతములోకి ఎందుకు వచ్చింది, అది ఎంతో దారుణమైన మతం కదా అంటూ .. హిందూ మతములోని ఉన్న వాటిని ఏకరువు పెట్టేశారు . నేనేమో, ఆమాటకొస్తే, అన్నీ ఆతానులో ముక్కలే కదా .. స్త్రీలపై వివక్ష అనేది చూపించని మతమేముంది, అలాటప్పుడు హిందూ మతములోకి వచ్చిన విషయం మీద ఇంత వ్యతిరేకత ఎందుకు అని అడిగా.

    అంతే పాపం ఇంకో కాయన (ఈయనకు, అధికార మతానికీ, మెజారిటీ మతానికి తేడా తెలీదు), హిందూ మతములోని లోపాలు చెబుతున్నాము అంటే మిగిలిన మతాలను సపోర్టు చేసినట్టు కాదు, దీన్ని అర్థం చేసుకోవడానికి కాస్త ఎదగాలి అంటూ మేధావిలా మాధావిలా మాట్లాడాడు.

    సంధర్భము అన్ని మతాలలో స్త్రీలపై గురించి వివక్ష. హీనపక్షం రెండు మతాలకు సంబందించినటువంటి విషయం. (ఒకటి ఇదివరకటి మతం, మరోటి ప్రస్తుతం తీసుకున్న మతం). అయినా కూడా ఘనత వహించిన ఆదర్శవాదులూ, మతానికి విలువివ్వమని చెప్పుకుని తిరిగేవారు .. కేవలం ఒక మతాన్ని మాత్రమే తూలనాడతారు. ఆమతమునుండి ఈ మతానికి ఎందుకు వచ్చావు అని నిలదీస్తారు? (వ్యక్తి స్వేచ్చ అనే పదం ఈ సంధర్భములో వీరికి చచ్చినా గుర్తుకు రాదు. అయినా ఆపదానికి విలువిచ్చే వారైతే కదా, గుర్తుకు రావడానికి), అదేమిటి అని అడిగితే.. మీరు ఎదగాలి అంటారు? ఎదగాల్సింది ఎవరో కనీసం విడమరిచి చెప్పిన తరువాతైనా తెలుసుకోరు.. :-(

    రిప్లయితొలగించండి
  4. కమ్యూనిస్టుల గురించీ, విదేశీ మానసపుత్రుల గురించీ., ఈ మధ్యనే ఆంధ్రప్రభలో వచ్చిన వ్యాసంలోని చిన్న భాగాలు..!
    http://www.prabhanews.com/tradition/article-253775

    //కమ్యూనిజం ఎక్కడైనా వ్యాపించాలంటే ముందుగా స్థానిక సంస్కృతిని నిర్మూలించాలని వారి సిద్ధాంతం //

    //''నూరు పూలు వికసింపనివ్వండి నూరు భావాలు వ్యాపింపనివ్వండి'' ఈ నినాదం ఎంతో బాగుంది -ఇది మావోసేటుంగ్‌ గారిది -ఒక సోషలిస్ట్‌ రాజ్యం మరొక సోషలిస్ట్‌ రాజ్యంపై దండయాత్ర చేయదు ఈ నినాదం కూడా వారిదే మరి చైనా రష్యాపై ఎందుకు దండయాత్ర చేసింది. అమాయకులను లక్షలాది టిబెటన్లను ఎందుకు పొట్టన పెట్టుకున్నది. ఆరు లక్షల బౌద్ధవిహారాలలో ఎం దుకు నేలమట్టం చేసింది. కారణం ఒకటే ఇది సంస్కృతుల మధ్య సంగ్రామం -చైనా సామ్రాజ్యవాదానికి నిలువెత్తు దర్పణం!
    ఎవడైనా కాస్త పచ్చగా ఉంటే వాడికి బూర్జువా అనే టాగ్‌ తగిలించి హతం ఖతం అంటూ వచ్చిన సామ్యవాదం ఎలాంటి భయంకర సంస్కృతిని ప్రపంచ వ్యాప్తం చేసిందో గమనించారా?//

    రిప్లయితొలగించండి
  5. >>ఎవడైనా కాస్త పచ్చగా ఉంటే వాడికి బూర్జువా అనే టాగ్‌ తగిలించి హతం ఖతం అంటూ వచ్చిన సామ్యవాదం ఎలాంటి భయంకర సంస్కృతిని ప్రపంచ వ్యాప్తం చేసిందో గమనించారా?

    Claps

    రిప్లయితొలగించండి
  6. The discussion was not allowed to be made in the blog of a dubiously named Communist Daily "Praja Shakti" and you can see the original article and the comments thereon with the help of following link

    http://prajaasakti.blogspot.com/2011/11/blog-post_7973.html

    Bharadwaj garu, you have kept a very apt picture for the article. Well Done.

    రిప్లయితొలగించండి
  7. >>వడైనా కాస్త పచ్చగా ఉంటే వాడికి బూర్జువా అనే టాగ్‌ తగిలించి హతం ఖతం అంటూ వచ్చిన సామ్యవాదం ఎలాంటి భయంకర సంస్కృతిని ప్రపంచ వ్యాప్తం చేసిందో గమనించారా
    cant agree more bro!!
    this blood mongering nature is implicit in communism..

    రిప్లయితొలగించండి