22, జూన్ 2012, శుక్రవారం

ఇదెవరైనా కాస్త గుక్క తిప్పుకొకుండా చెప్పగలరా? :)

ఇట్లు దానవేంద్రుండు పరిగ్రుహ్యమాణ వైరుండును, వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును,రోషానల జంఘన్యమాన విజ్ఞాన వినయుండును,వినయ గాంభీర్య ధైర్య జేగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును ,తామస గుణ చంక్రమ్యమాణ స్థైర్యుండును నయి విస్రంభంబున హుంకరించి, బాలుని ధిక్కరించి హరి నిందు జూపుమని కనత్కనక మణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా దిగ్ధంతి దంత భేదన పాటవ ప్రసస్తం బగు హస్తంబున సభామండప స్థంభంబు వ్రేసిన వ్రేటు తోడన దశ దిశలును మిణుగురులు సెదర జిటిలి పెటిలి పడి బంభాజ్యమానం బగు న మ్మహాస్తంభంబు వలన ప్రళయ వేళా సంభూత సప్త స్కంద బంధుర సమీరణ సంఘటిత జోఘుష్యమాణ మహా బలాహక వర్గ నిర్గత నిబిడ నిష్టుర దుస్సహ నిర్ఘాత సంఘ నిర్ఘోష నికాసంబులైన చట చ్చట స్ఫట స్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావపుంజంబులు జంజన్యమానంబులై ఎగసి యాకాస కుహరాన్తరాళమ్బు నిరవకాసంబు సేసి నిండినం బట్టు చాలక దోదూయమాన హృదయంబులై పరవసంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయు శిఖి ప్రముఖ చరాచర జంతు జాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగా బ్రఫుల్ల పద్మ యుగళ సంకాశ భాసుర చక్ర చాప హల కులిశాన్కుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును చరణ చంక్రమణ ఘన వినిమిత విశ్వ విశ్వంభరాభర దౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినిధర కూర్మ కులశేఖరుండును దుగ్ద జలధి జాత శుండాల సుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగళున్డును ఘన ఘణాయమాన మణికిన్కినీగణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర శోభిత కటి ప్రదేసుండును , నిర్జర నిమ్నగా వర్త వర్తుల కమలాకర గంభీర నాభి వివరుండును ముష్టి పరిమేయ వినుత తనుతర స్నిగ్ధ మధ్యుండును , కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును , దుర్జన దనుజభట ధైర్యలతికా లవిత్రయామాస , రక్షో రాజ వక్షో భాగ విసంకటక్షేత్ర విలేఖన చుంచులాంగాలాయమాన ,ప్రతాప జ్వలన జ్వాలాయమాన శరణాగత నయన చకోర చంద్ర రేఖాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖ నఖరుండును , శంఖ చక్ర గదా కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగా మహీధర శృంగ సన్నిభ వీరసాగర వేలాయమాన , మాలికా విరాజమాన నిరర్గళానేక శత భుజార్గళున్డును , మంజు మంజీర మణిపుంజ రంజిత మంజుల హారకేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భుషితుండును , త్రివళియుత శిఖరి శిఖరాభ పరిణద్ధ బంధుర కన్ధరుండును ,ప్రకంపన కంపిత పారిజాత పాద పల్లవ ప్రతీకాశ కోపావేశా సంచలితాధరుండును . శరత్కాల మేఘజాల మధ్యమ ధగద్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును , కల్పాంతకాల సకల భువన గ్రసన విలసన విజ్రుమ్భమాణ సప్తజిహ్వ జిహ్వా తులిత తరళ తరాయమాన విబ్రాజమాన జిహ్వుండును , మేరు మందర మహా గుహాన్తరాళ విస్తార విపుల వక్త్ర నాసికా వివరుండును , నాసికా వివర నిస్సర న్నిబిడ నిస్స్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్తసాగరుండును , పూర్వ పర్వత విద్యోతమాన ఖద్యోత మండల సద్రుక్ష సమంచిత లోచనుండును , లోచనాంచల సముత్కీర్యమాణ విలోల కీలాభీల విస్ఫులింగా వితాన రోరుధ్యమాన తారకా గ్రహ మండలుండును శక్ర చాప సురుచిరోదగ్ర మహా భ్రూలతాబంధ బంధుర భయంకర వదనుండును , ఘనతర గండ శైల తుల్య కమనీయ గండ భాగుండును , సంధ్యారాగ రక్త దారధరమాలికా ప్రతిమ మహా బ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును ,సటాజాల సంచాలన సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుండును , నిష్కంపిత శంఖ పర్ణా మహోర్ద్వకర్ణుండును , మన్ధదండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాశి కల్లోల శికరాకార భాసుర కేసరుండును , పర్వాఖర్వ శిశిర కిరణమయూఖ గౌర తనూరుహున్డును , నిజ గర్జన నినాద నిర్దళిత కుముద సుప్రతీక వామనైరావత సార్వభౌమ ప్రముఖ ధిగిభరాజ కర్ణ కోటరుండును , ధవళ ధరాధర దీర్ఘదురవలోకనియ దేహుండును , దేహ ప్రభాపటల నిర్మధ్యమాన పరిపన్ధి యాతుదాన నికురుంబ గర్వాంధకారుండును , బ్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును , మహా ప్రభావుండును నైన శ్రీ నృసింహదేవుం డావిర్భవిన్చినమ్ గనుంగొని...

21, జూన్ 2012, గురువారం

The concept of Gravity and భారతీయులు!






నా ముందుపోస్టులో ఒక అజ్ఞాత (Caption: అందరికీ తెలుసు) ఒక challenge విసిరాడు. న్యూటన్ కన్నా ముందే భారతీయులకు Gravity గురించి తెలుసన్నదానికి సాక్షాలు చూపించమని. ఆ ప్రయత్నంలో భాగమే ఈ టపా

This was his challenge:


అజ్ఞాత20 జూన్ 2012 5:37 సా
don't run away Malak!!! Show an evidence that the Indians discovered the concept of gravity before Newton!!!!!! i will agree i am a fool!!!!! otherwise you should agree you are fool!

ప్రత్యుత్తరంతొలగించు


and here is my response:



ముందుగా Tata Institute of Fundamental Research వారి సైట్లో ఉన్న ఈ లంకె చూద్దాం

http://www.tifr.res.in/~iseg/presentations/Kuriakose-GW.pdf

ఇందులో 4 నుండి 9 దాకా ఉన్న స్లైడ్లలో భారతీయులు గురుత్వాకర్షణ మీద చేసిన ప్రతిపాదనల గురించి పేర్కొన్నారు. వీరందరూ న్యూటన్ కన్నా ముందువారే.


అలాగే ఈ లంకె http://astrobix.com/astroblog/post/varahamihira-history-of-astrology-varahamihira-scriptures-varahamihira-books-name).aspx లో వరాహమిహిరుడికీ గురుత్వాకర్షణకూ ఉన్న సంబంధం గురించి వ్రాశారు.


ఈ వికీ పేజ్లో కూడా http://en.wikipedia.org/wiki/History_of_gravitational_theory ఆ ప్రస్తావన ఉంది.

అజ్ఞాతా - నీకు ఈ మూడు ఉదాహరణలూ చాలనుకుంటున్నా. అర్థం కాకపోతే చెప్పు ఇంకా విపులంగా చెప్తా.

Now, would you do what you said you would? :))

16, జూన్ 2012, శనివారం

ప్రజాస్వామ్యానికి పెనుసవాళ్ళు - గాడిదగుడ్డేంకాదూ?





చీకట్లోనే పుట్టి చీకటిబ్రతుకులు బ్రతుకుతూ చీకటిపనులుచేసేవారికి అన్నీ పెనుసవాళ్ళే. అవును మరి లక్షల/కోట్ల కొద్దీ అమాయకులను ఊచకోచ కోసిన Stalinలూ మావోలు ఈ ఎఱ్ఱ బ్లాగర్లకు దేవుళ్ళు. టెఱ్ఱరిష్టులని బాహాటంగా సమర్ధించే వీళ్ళనుండి ఇంతకన్నా ఎక్కువ ఆశించలేము నిజమే.

మోదీ హయాంలో జరిగినవి 2 వేల హత్యలయితే వీళ్ళ దేవుడు స్టేలిన్ హయాంలో జరిగినవి అక్షరాలా 2 కోట్ల హత్యలు - అంటే 10,000 రెట్లు. దానికి వీళ్ళిచ్చేది కరువు కవరప్. అదే విధంగా మోదీ అభిమానులు "అబ్బే మోదీకేమీ తెలియదు. ఆ హత్యలు చేసింది కమ్యూనిష్టులే" అంటే. నాకెక్కడున్నాయ్ సాక్షాలంటారా, ఆ హత్యలు మోదీనే చేయించాడనటానికి వీళ్ళేం సాక్షాలు చూపిస్తునార్టా? అవేవో కోర్టుకు చూపిస్తే మోదీకి శిక్ష పడుతుంది కదా. ఊహూ! టివి వార్తలు తప్ప వేరే ఆధారాలేమీ లేవు.

అయితేనేం? Double Standards అన్నీ పక్కవాళ్లకే. మనం కమ్యూనిష్టులయినంతకాలం నిజాయితీ నటిస్తూ ఎన్ని నాలుకలతోనైనా మాట్లాడవచ్చు :))