22, నవంబర్ 2010, సోమవారం

కార్తీక మాసం - టోఫూ రీమిక్స్

లేడీ గుంపుని చూసి బ్రహ్మీలు వంటలు మొదలుపెట్టగానే మా అంకుళ్ళ పరిస్థితి పెనం మీదనించి పొయ్యిలో పడింది. లాభంలేదు ఏదో ఒక స్పెషల్ చెయ్యాలని అంకుళ్ళ సంఘం వారు తీర్మానించారు. సరే అని నేనో స్పెషల్ చేద్దామని డిసైడయిపోయా.

కానీ ఏమి చెయ్యాలి? రెగులర్ కూరలు సాంబార్లలో ఎపీల్ ఉండదు. మన ఓట్మీల్ స్పెషాలిటీస్ గత ఏడాదే చెప్పేశాను. ఇక మెక్సికనా ( మెహికన్?), ఇటాలియనా, మెడిటరేనియనా అని అలోచిస్తుంటే అసలు చైనీస్ ఎందుకు చెయ్యకూడదన ఐడియా వచ్చింది. ఇకేం? వెంటనే టొఫూ, సాయ్ సాస్, థాయ్ సాస్, స్పైస్ దినుసులు గట్ర పట్టుకొచ్చా. ( అసలు తెదామనుకున్నది కంగ్ పావ్ సాస్, కాని అది దొరకలేదు - వచ్చేవారం తెస్తా)

ఇక పీ ఎఫ్ చాంగ్ ప్రేరణతో దిగిపోయా :))

* ముందుగా ఒక మూకుళ్ళో కాస్తంత సన్ ఫ్లవర్ నూనే మరిగించా
* వేరు శనగ, ఏండు మిర్చి కలిపా
* దానిలో చక్కగా తరిగిన గట్టి టోఫూ వేయించేసా
* బాగా వేగాకా, సాయ్ సాస్ + వినేగర్ పోశా
* ఒక అయిదు నిమిషాలయ్యాక, థాయ్ స్వీట్ & పెపర్ సాస్ పోశా
* రెండు నిముషాలయ్యాక రుచి చూస్తే ఏడొ తక్కువనిపించింది
* సరే ఇక చిండీయన్ ( చైనీస్ + ఇండియన్ ) లోకి దిగిఫొయా
* ఆ వేగుతున్న మిశ్రమంలో కాస్తంత ఇంగువ వేశా
* ఒక నిముషం తరవాత కూర పొడి, ధనియా పొడి కలిపా
* ఇంకొంచం సాయ్ సాస్ పోశా
* పది నిముషాలు వేయించా

టోఫూ రీమిక్స్ రెడీ!!!





7 కామెంట్‌లు:

  1. తర్వాత దాన్నేం చేసారో చెప్పనే లేదే :)

    రిప్లయితొలగించండి
  2. అబ్బ మలకన్నా, నువ్వొక్కడివే మంచి అంకుల్ వి, మిగతా కుటుంబరావులందరూ అంకుల్ అంటే చాలు కస్సు మంటారు.. కొందరు బజ్జులో నేనెక్కడ దొరుకుతానా ఫుట్‌బాల్ ఆడటానికి అని వెయిట్ చేస్తుంటారు.. నువ్వొక్కడివే అంకుల్ అని ఒప్పేసుకున్నావ్.. :P

    రిప్లయితొలగించండి
  3. అన్నాయి ఈ కార్తీక మాసము స్పెషల్ గా నేను బ్రూ కాఫీ సేశాను మలకన్న.
    ఇందుకు కావలసినవి.
    1 పాలు 2 బ్రూ కాఫీ పౌడర్ 3 పంచదార
    కొన్ని పాలని ఒక కప్పులో తీసుకొని,దానిలో కొంచెము పంచదార కలిపి మైక్రోవేవ్ లో పెట్టాలి.
    రెండు నిముషాలు ఆగి ,తగినంత బ్రూ కాఫీ పొడుం కలపాలి.తరువాత రుచి కోసం మళ్ళీ వెచ్చ చెయ్యాలి.
    టట్ట డాయ్. అద్బుతమయిన వంటకం రెడీ.
    మలకన్నో సొంత బ్లాగు లేక నీ బ్లాగే నా బ్లాగు అని వాడుకుంటున్న.ఏమి అనుకోవద్దు.

    రిప్లయితొలగించండి
  4. Malak, Watch this video
    http://www.youtube.com/watch?v=56viHV3bwyo&feature=youtu.be
    ----------------------------------------http://blogs.wsj.com/indiarealtime/2010/11/22/does-the-buck-stop-with-barkha-dutt-and-niira-radia/

    రిప్లయితొలగించండి