27, జూన్ 2011, సోమవారం

రొమేన్స్ ... హీ హీ హీ!

ఎప్పుడూ కెలుకుడు బజ్లేనా కాస్త రొమేంటిక్వి పెట్టచ్చు కదా అని ఎవరో అడిగారు - మనకి రొమేంటిక్ మైండ్ ఉంటే కదా, ఏదో నేను నా మార్తాండా, మా కెలుకుడు ఇలా సాగిపోతే చాలు అనుకుని బ్రతికేస్తుంటే ...

కానీ ఇవాళ ఎందుకో కాసేపు థింకాను నా లైఫ్లో మోస్ట్ రోమేంటిక్ ఘట్టం ఏమిటా అని .. నాకు గుర్తున్నంత మటుకూ ఇదే ... అదే మొదటిసారి నా గర్ల్ ఫ్రెండ్ (ఇప్పుడు మా ఆవిడ) ని కలవటం ... మొదటి సారి అంటే మొదటిసారి కాదు .. కానీ చుట్టుపక్కల చుట్టపక్కాలు ఎవరూ లేకుండా మొదటిసారి కలవటం అని కవి హృదయం ...

నాది పెద్దలు కుదిర్చిన (కొంతమది శ్రేయోభిలాషుల అభిప్రాయం ప్రకారం పెద్దలు "నా తిక్క" కుదిర్చిన) వివాహం .. అయితే నిశ్చితార్థానికి వివాహానికి మధ్య 8 నెలల ఆంతర్యం, ఆ ఎనిమిది నెలలూ మేమిద్దరం ఒకే కేంపస్ లో అది కూడా
పచ్చ పచ్చని చెట్లతో నిండిన సెంట్రల్ యూనివర్సిటీలోనే గడపటం వల్ల ప్రేమ వివాహం కిందే లెక్క.

అయితే ఈ ఎనిమిదినెలల్లో మేమిద్దరం అస్సలు కలవకూడదని ముందు, కలిస్తే కలిశారుగానీ మరీ ఎక్కువగా కలిసి తిరగద్దని ఆ తరవాత పెద్దల ఆజ్ఞలు, అలాగే అని తలలూపి మా పనులు మేము చేస్కోవటం వేరే విషయం :))

అసలు విషయానికొస్తే,

ఒక రోజు నే లెక్చర్ హాల్ కాంప్లెక్స్ దగ్గర నడుస్తుండగా చినుకులు మొదలయ్యాయి. ఆగుదామా వద్దా అని ఒక క్షణం ఆలోచించి నడవటానికే నిర్ణయించేసుకున్నా, వానలో తడుస్తూ ... ఉన్నట్టుండి వాన ఆగిపోయింది, ఏమిటా అని తల పైకెత్తి చూస్తే నా నెత్తి మీద ఒక గొడుగు. పిడుగు పడాల్సిన చోట గొడుగేమిటా అని పక్కకి చూస్తే దాన్ని పట్టుకుని చిరునవ్వుతో నా అమ్మాయి స్నేహితురాలు - అదేనండీ గూగుల్ ట్రేన్స్లేటర్ పరిభాషలో గార్ల్ ఫ్రెండ్.

చిటపట చినుకులు, పక్కన ప్రేయసి, మొదటి కలయిక, ఒకే గొడుగు కింద సైన్స్ కాంప్లెక్స్ దాకా నడక ... జీవితంలో మొదటిసారి కాస్త రోమేంటిక్ గా ఫీల్ అయ్యింది అప్పుడేనేమో!

అన్నట్టు ఆమెకోసం నేను ప్లే చేసిన మొదటి పాట - ఇదిగో! (కానీ అప్పుడేం తెలుసు, ఆ తరవాత నా జీవితం ఏమవబోతొందో :P )


23, జూన్ 2011, గురువారం

గూగుల్ translator గొప్పతనం !!!!

GUYS N GALS..... I JUST TRIED THIS ......

GO TO GOOGLE TRANSLATOR http://translate.google.com

SET THE TRANSLATION FROM TELUGU TO ENGLISH

AND TYPE ..

టెండూల్కర్ ఒక దేవుడు కాదు

AND CHECK THE RESULT !!!!!!!

_______________________

NOW TRY

ధోనీ ఒక దేవుడు కాదు

AND CHECK THE RESULT !!!!!!


AND THATS NOT ALL ..


TRY THIS

చిరంజీవి ఎంటీఆర్ కన్నా మంచి నటుడు .... CHECK THE RESULT

NOW TRY THIS ..

ఎంటీఆర్ చిరంజీవి కన్నా మంచి నటుడు .... NOW CHECK THE RESULT!


FINALLY CHECK THIS:

చిరంజీవి బాలకృష్ణ కన్నా మంచి నటుడు

పాపం బాలయ్య! :( బాలయ్యంటే గూగుల్ కి కూడా భయమే!!!

16, జూన్ 2011, గురువారం

14, జూన్ 2011, మంగళవారం

భక్తి

1990ల సంగతి ...

మా అమ్మ బయటకేదో పనిమీద వెళ్ళి పనిలో పనిగా పుస్తకాల షాపుకి వెళ్ళారు. అవీ ఇవీ చూస్తూ ఆవిడ పని చేసిన కళాశాలలో ఇద్దరు కలీగ్స్ మాట్లాడుకుంటుండగా ప్రస్తావనకి వచ్చిన పుస్తకాన్ని కొన్నారు. ఆ షాప్ ఓనర్ కాస్త తటపటాయించాడు అమ్మడానికి - ముందు ఒకటే కాపీ ఉందనీ, తరవాత ఎవరో రిజర్వ్ చేసుకున్నారని. కానీ ఆవిడ మిగిలిన కాపీలని కూడా చూపించడంతో చేసేదేమిలేక అమ్మేశాడు.

ఆ మర్నాడు ఆవిడ పూజ చేసుకుంటూండగా మామూలుగా వినిపించే స్తోత్రాలకు బదులు నాకు తిట్లు వినిపించాయి. "అడ్డగాడిదలు, దరిద్రపుగొట్టు వెధవలు, అన్నం తినే మనుషులా గడ్డి తినే పశువులా?" నాకొక నిముషం అర్థం కాలేదు ఏం జరుగుతోందో. తిట్లతో పూజలు చెయ్యటం కొత్త పధ్ధతేమో అని సరిపెట్టుకున్నా. కానీ కాసేపయ్యాక మరీ దేవుడిని అలా తిడుతోందేమిటి అని అనుమానం వచ్చి పూజగదిలోకి తొంగి చూశా.

అమ్మ మొహం కోపంగా, భీకరంగా ఉంది. ఏమైందని అడిగా.

"చూడరా నా కలీగ్ దరిద్రులు, ఏదో భక్తి పుస్తకమంటే షాపు ఓనర్ ఇవ్వనంటున్నా మరీ కొని పట్టుకొచ్చా ఈ పుస్తకాన్ని. పూజ టైంలో చదువుకుందామని తెరిచి చూస్తే ఏముందీ? దరిద్రులు, దరిద్రులు" అని మళ్ళీ తిట్లు లంకించుకుంది.

భక్తి పుస్తకంలో అంత భయంకరమైనది ఏముంటుందా అనుకుంటూ ఆ పుస్తకాన్ని చూసాక నాకు నవ్వాగలేదు. అదంతా అ ఇద్దరు మగ కలీగ్స్ వాళ్ళలో వాళ్ళు వాడుకునే "భక్తి" అనే కోడ్ వర్డ్ అమ్మకి అర్థం కాకపోవటంవల్ల వచ్చిన గొడవని నాకర్థమైంది. లోపలి పేజీలు చూడకుండా పుస్తకాలని కొనద్దని అప్పటికీ ఆవిడకి చాలాసార్లు చెప్పాను. నా మాట వింటేగా?


ఇంతకీ ఆవిడని అంత ఆగ్రహానికి గురిచేసిన పుస్తకం ఏమిటో తెలుసా?

"కవి చౌడప్ప శతకం" :)))))))))))))))


PS: ఒరిజినల్ కవి చౌడప్ప శతకం వేరు. అవి చాటు పద్యాలు. కానీ ఇక్కడ ఈవిడ కొన్న పుస్తకం, చౌడప్ప పేరడీలది - ఘాటైన భాషతో :)

9, జూన్ 2011, గురువారం

అంతా గూగుల్ బజ్ మాయ!







మొన్న ఎవరి బజ్ లోనో కుమార్ పెట్టిన కామెంట్ చూసి ఇది రాయాలనిపించింది.

ఈ మధ్య గూగుల్ బజ్ కి పట్టుకున్న జబ్బు - చెప్పా పెట్టాకుండా కొందరి కామెంట్లు మాయం చేసి స్పేం లోకి తోసెయ్యటం. ఒక చర్చలో కొందరి కామెంట్లు ఎగిరిపోయి కొందరివి మిగిలితే ఎలా ఉంటుందనే ఊహాజనిత టపా ఇది.

ముందుగా బులుసు గారు పెట్టిన పోస్టు, దానికి మార్తాండ సమాధానం, బద్రీ ప్రత్యుత్తరం


***************************************************************************************


బులుసు - ఎం ఎఫ్ హుస్సైన్ మరణం

మార్తాండ -ఇండియా సెక్యులర్ దేశం కాదు.

బద్రీ - ఒరే బాబూ, కాస్త అర్థమయ్యేలా కామెంట్ ఎప్పుడు పెడతావురా తండ్రీ?

మార్తాండ - నేను కూడా ప్రశ్నలడగగలను. బులుసుగారి కామెంట్ అర్థమయ్యేలా ఉందా?

బులుసు - ఎక్కడ అర్థమయ్యేలా లేదో కాస్త చెప్తారా?

బద్రీ - నీ బొంద. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదురా పిచ్చికుంకా.

బులుసు - ఎక్కడ అర్థం అవ్వలేదో చెప్పండి మారుస్తా

మార్తాండ - అడిగినదానికి సమాధానం చెప్పు. బులుసు గారి కామెంట్ కూడా అర్థం కావట్లేదు. నా ప్రశ్న మార్చా. చివర "?" పెట్టా.

బద్రీ - ఆపెహే నీ గోల. నువ్వు మార్చినా మార్చకపోయినా ఎవడికీ వచ్చిన నష్టం లేదు.




**** కార్తీక్ & రాజ్ కుమార్ జాయిన్ అవుతారు ****




కార్తీక్: మార్తాండా నీకు పిచ్చి ముదిరింది

రాజ్ కుమార్: పిచ్చి బాగా ముదిరింది. సిగ్గుండాలి అలాంటి సంబంధంలేని మేసేజెస్ పెట్టడానికి

బులుసు: నేను అన్నది జస్ట్ హుసేన్ మరణం అని. ఇంత గొడవ జరుగుతుందనుకోలేదు

మార్తాండ: గొడవ చేసింది నేను కాదు. బద్రీ.

రాజ్ కుమార్: నోరు ముయ్యెహే! నువ్వు పెట్టిన ఒక్క కామెంట్ చాలు గొడవ లేవదియ్యడానికి. సిగ్గుండాలి.

మార్తాండ: సిగ్గులేనిదెవరికీ నాకా?

బులుసు: ఛస్! నాకే సిగ్గులేదు. నిజంగానే సిగ్గులేదు.

కార్తీక్: అయ్యో బులుసుగారూ, వీళ్ళు తిడుతోంది మార్తాండనండీ.

మార్తాండ: బులుసుగారూ, వీళ్ళు తిట్టింది నన్ను.

బద్రీ: ఆ మాత్రం అర్థమయ్యింది కదా ఇప్పటికి, ఇక ఇక్కడనుండి బయటకు తగలడు.

బులుసు: అవునండీ అర్థమయ్యింది. ఇక ఈ బజ్ కి కామెంట్లు క్లోస్ చేస్తున్నా!


X Bulusu has disabled comments on this post


****************************************************************************************************



జరిగిన గొడవ అదీ:

ఇప్పుడు బజ్ పుణ్యమా అని ఉన్నట్టుండి మార్తాండవి కార్తీకువీ కామెంట్లు మాయం అయిపోయాయనుకోండి. పర్తిస్థితి ఏమిటి? మీరే చూడండి :)






******************************************************************************************************






బులుసు - ఎం ఎఫ్ హుస్సైన్ మరణం



బద్రీ - ఒరే బాబూ, కాస్త అర్థమయ్యేలా కామెంట్ ఎప్పుడు పెడతావురా తండ్రీ?


బులుసు - ఎక్కడ అర్థమయ్యేలా లేదో కాస్త చెప్తారా?


బద్రీ - నీ బొంద. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదురా పిచ్చికుంకా.



బులుసు - ఎక్కడ అర్థం అవ్వలేదో చెప్పండి మారుస్తా


బద్రీ - ఆపెహే నీ గోల. నువ్వు మార్చినా మార్చకపోయినా ఎవడికీ వచ్చిన నష్టం లేదు.




**** కార్తీక్ & రాజ్ కుమార్ జాయిన్ అవుతారు ****






రాజ్ కుమార్: పిచ్చి బాగా ముదిరింది. సిగ్గుండాలి అలాంటి సంబంధంలేని మేసేజెస్ పెట్టడానికి


బులుసు: నేను అన్నది జస్ట్ హుసేన్ మరణం అని. ఇంత గొడవ జరుగుతుందనుకోలేదు



రాజ్ కుమార్: నోరు ముయ్యెహే! నువ్వు పెట్టిన ఒక్క కామెంట్ చాలు గొడవ లేవదియ్యడానికి. సిగ్గుండాలి.


బులుసు: ఛస్! నాకే సిగ్గులేదు. నిజంగానే సిగ్గులేదు.


బద్రీ: ఆ మాత్రం అర్థమయ్యింది కదా ఇప్పటికి, ఇక ఇక్కడనుండి బయటకు తగలడు.


బులుసు: అవునండీ అర్థమయ్యింది. ఇక ఈ బజ్ కి కామెంట్లు క్లోస్ చేస్తున్నా!




X Bulusu has disabled comments on this post


********************************************************************