బొందలపాటిగారి బ్లాగులో చర్చ చూశాక దీన్ని బరకాలనిపించింది. ఓపికుంటే చదవండి :)
చర్చలో నన్నాకట్టుకున్న విషయం - గణాంకాలు. 65,000 కేసులున్నాయి కాబట్టి దానిలో అత్యధికశాతం సరి అయినవే అని రాజుగారు తేల్చేశారు, మిగిలిన వివరాలు చెప్పకుండానే.
సరే, దీన్ని మరో కోణంలోంచి చూద్దాం. 498 ఏ అందరికీ తెలిసిందే కదా. నెట్లో దొరికిన గణాంకాల ప్రకారం ప్రతీ వంద కేసుల్లో కేవలం 2 నుండి 4 శాతం దోషులవుతున్నారు. అంటే 95% శాతం దుర్వినియోగం అవుతున్నట్టేకదా? 498 ఏ మీద 2005 సంవత్సరం గణాంకాలు ఇలా ఉన్నాయి.
* లక్షా ముప్ఫై అయిదు వేలమందిని అరెస్టు చేశారు
* అయిదువేల ఏడువందలమందికి శిక్షలు పడ్డాయి
95% దుర్వినియోగం! ఈ చట్ట ప్రస్తుత బాధితులు అరవైలక్షలమందికి పైమాటే.
ఇది దుర్వినియోగమవుతోందని సాక్షాత్తూ సుప్రీంకోర్టే గగ్గోలుపెడుతోంది. మరి ఈ గణాంకాల గురించి ఏమంటారు?
(నువ్వు ఇచ్చిన గణాంకాలు మేము నమ్మం, కాని మేము ఇచ్చిన గణాంకాలు నువ్వు నమ్మాలి అనరనే ఆశిస్తున్నా!)
కనుక సోదరస్సోదరీమణులారా, అమ్మలారా, అయ్యలారా (మైక్ టెస్టింగ్)
నే సెప్పేదేటంటే,
ఈ విషయంలో ఆడలేడీస్ అందరూ సీతాదేవులూ కారూ, మగజెంట్స్ అందరూ శ్రీరామచంద్రులూ కారు.
దొందూ దొందే! వెధవ పనులు చేసేవాళ్ళు లింగభేదం లేకుండానే చేస్తున్నారు. కాని తప్పు అవతలవాళ్ల మీదకి నెట్టెయ్యటంలో అందరికన్నా ముందు మన ఫెమినిష్టులున్నారు. ముస్లిం టెఱ్ఱరిష్టులని చూపించి బీజేపీ, అదే బీజేపీని చూపించి మజ్లీస్, ధనికులని చూపించి, వాళ్లపై ద్వేషాన్ని రగిలించి కమ్యూనిష్టులు పొట్టగడుపుకుంటున్నట్టే, ఈ ఫెమినిష్టులు కూడా - సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉంటే వారి పబ్బం గడవదు గనక - స్త్రీ, పురుషుల మధ్య చీలిక తేవటమే వారికి బ్రతుకుతెరువు :)
ఇక మధ్యతరగతి విషయానికి వస్తే, అటు కోడల్ని హింసించే అత్తా బాగానే ఉంటుంది, ఇటు అత్తని వేధించే కోడలూ బాగానే ఉంటుంది. మధ్యలో బలయ్యేది మాత్రం ఆ ఇద్దరిమధ్యా నలిగే కొడుకు cum భర్త :(
>>>ఆడలేడీస్ అందరూ సీతాదేవులూ కారూ
రిప్లయితొలగించండిఇదేదో వివాదాస్పదం అయ్యేతట్లుంది
మాంసమే తినని పిల్ల ఉందా ? పురుషులలో రాముడు ఉన్నాడా ? అని ప్రభుదేవా సాంగ్ ( ప్రేమికుడు సినిమా లో )
మాంసం తినని పిల్ల అని అన్నారు కానీ పతివ్రతా కాని అమ్మాయి అని అనలేదు
ఆడవాల్లు అందరూ సీతా దేవిలా పతివ్రతలు కారు అంటే కష్టం కదా
నారాయణ నారాయణ
ఆడ లేడీస్ అందరూ స్పందించండి. మిమ్మల్ని మలకన్న ఏదో అంటున్నారు
నారాయణ నారాయణ
మీరిచ్చే సామ్రాజ్యవాద బూర్జువా గణాంకాలు మేము నమ్మాలంటే చెవిలో గోబీలున్నవారు నమ్ముతారేమో గాని, ఎర్రగన్నేరు పూలున్న మేము నమ్మాలా? ఇది హాస్యాస్పదం కాదా? మీది "అరిగిపోయిన రికార్డ్". చివరిగా మరొక్క నాకు తెలిసిన సామెత పనిలో పనిగా వాడేస్తున్నా: "పాడిందే పాడరా పా.ప.దా" అనే నా ఏకైక బ్లాగు సందర్శించండి. లింకులు ఏబ్లాగుల్లోని కామెంట్లలోనైనా మీకు ఉచితముగా లభ్యమవుతాయి. ఇది " చెప్పేది శ్రీరంగనీతులు, దూ.దొ.గు" లనడంలో "ఆశ్చర్యపడాల్సిన పనిలేదు". మావో 4గురిని అఫీషియల్‌గా, మరో నలుగురిని అన్అఫీషియల్గా స్త్రీజనోద్ధరణ గావించాడని ఎర్రబుక్కులో వుందని తెలిసినా తెలియనట్లే వుండటం సామ్రాజ్యవాద లక్షణం కాదా? అసలే రెబెల్ రోడ్డులో పోతున్నవాణ్ణి నాతో పరాచికాలా?
రిప్లయితొలగించండి"భరించేవాడు భర్త"..అని పెద్దవాళ్లు ఇందుకే అని ఉంటారు...!
రిప్లయితొలగించండిపెళ్లికి ముందూ, పెళ్ళికి తర్వాత మగవాళ్లు, సమాజం దృష్టిలో ఒకే దృక్కోణం నుండి చూడబడుతున్నారు.. ఇది బహుశా, మన భారతీయుల "స్త్రీలను గౌరవించే" సంస్కృతి వల్ల వచ్చిందని నా అభిప్రాయం..! అడది చిన్న ఇబ్బంది పడినా చుట్టూ ఉండే, చాలా మంది తట్టుకోలేరు..!
మీరందరూ, "గృహహింస"..గురించి చెపుతున్నట్టే, నేను.."ఆడవాళ్లమీద ఏసిడ్ దాడులు" గురించి కూడా చెప్పగలను. కానీ, నమ్మేవాళ్ళేరి..?
ఏమిటో..? అమ్మాయి అంటే భయంవేసే పరిస్థితి వచ్చేస్తోంది..! (ఫెమినిస్టులకి బహుశా ఇది కావాలనుకుంటా..!
క్లైమోర్ మైన్ మీద కాలు పెట్టినట్టు ఉన్నావ్ మలకన్నా.. కానీ పేలితే మాత్రం ఒక వారం రోజులు మాంచి కామెడీ ఉంటుంది.. :D
రిప్లయితొలగించండి"ధనికులని చూపించి, వాళ్లపై ద్వేషాన్ని రగిలించి కమ్యూనిష్టులు పొట్టగడుపుకుంటున్నట్టే, ఈ ఫెమినిష్టులు కూడా - సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉంటే వారి పబ్బం గడవదు గనక - స్త్రీ, పురుషుల మధ్య చీలిక తేవటమే వారికి బ్రతుకుతెరువు"
రిప్లయితొలగించండిప్రాంతీయ విద్వేషాలు సృష్టించి లాభపడే విభజన వాదుల సంగతి కూడా రాస్తే కంప్లీట్ గా ఉండేది.
మాంసమే తినని పిల్ల ఉందా ?
రిప్లయితొలగించండిహహ అప్పారావు గారు చంపేశారుగా అది పిల్ల కాదండీ బాబు.. పిల్లి అంటే CAT..
*ఆడలేడీస్ అందరూ సీతాదేవులూ కారూ, మగజెంట్స్ అందరూ శ్రీరామచంద్రులూ కారు. *
రిప్లయితొలగించండిమలక్,
ఇటువంటి పొలిటికల్ కరేక్ట్ స్టెమెంట్స్ ఇవ్వటం ఎమీ బాగ లేదు. మీకు మొదట నేను చెప్పినది అర్థం కాలేదు. నా పాయింట్ పెళ్లి మగవారికి భారం. అది లేకుండా మగవారు ఆనందంగా జీవించగలరు.
శ్రీరాం
Sriram,
రిప్లయితొలగించండిIt all depends on the kind of partner one gets. If one gets a great partner then what else does one need? All these problems arise due to incompatibility and lack of understanding.