1, మే 2013, బుధవారం

మాలిక పత్రిక ఛైత్రమాస సంచిక విడుదల
మాలిక పత్రిక చైత్రమాస సంచిక విడుదలైంది. అన్నివర్గాల పాఠకులకు నచ్చే అంశాలతో సరికొత్తగా రూపొందింది ఈ సంచిక.  ఈసారినుండి మాలికపత్రిక నుండి ప్రత్యేకమైన అంశాలతో మూడు సీరియళ్లు ప్రారంభమవుతున్నాయి. అడగగానే తమ రచనలను మాలికకు అందించిన యండమూరి వీరేంద్రనాధ్ గారికి, సూర్యదేవర రామ్మోహన్ గారికి, అడగకుండానే పారశీక ఛందస్సు గురించి సిరీస్ ఇస్తున్న J.K.Mohan Raoగారికి  , ఆలస్యమైనా మరచిపోకుండా తన రచనను పంపిన బ్నిం మూర్తిగారికి, మిగతా రచయితలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
ఈ సంచికనుండి ప్రఖ్యాత టెక్నాలజీ ఔత్సాహికులు, కంప్యూటర్ ఎరా పత్రిక ఎడిటర్ అయిన నల్లమోతు శ్రీధర్ గారి వీడియో చానెల్ ఒకటి మొదలు పెడుతున్నాం. ఈ శీర్షిక క్రింద ఆయన అందించే ఉపయోగకరమైన వీడియోలు మీరు వీక్షించవచ్చు.

http://magazine.maalika.org

మీ రచనలు పంపవలసిన చిరునామా: editor@gmail.com


మరో ముఖ్య విషయం.  ప్రముఖ రచయిత్రి శ్రీమతి సువర్చల చింతలచెరువుగారు మాలిక టీమ్ లో చేరుతున్నారు. ఆవిడకు సాదర ఆహ్వానం పలుకుతూ ఈ సంచికలోని రచనలు:0. సంపాదకీయం : మారుతున్న ఆప్యాయతలు, విలువలు..ఉమాభారతి

1.  కవి మానాపురం రాజా చంద్రశేఖర్ తో ముఖాముఖీ - బులుసు సరోజినిదేవి

2.  సంస్కృత సాహిత్యంలో ప్రముఖ కవయిత్రులు - విశ్వనాధశర్మ కొరిడె

3. నిత్యజీవితంలో హస్యం - డా.అనిల్ మాడుగుల

4. పారశీక ఛందస్సు - 1 - జె.కె.మోహన్ రావు

5. అతడే ఆమె సైన్యం - యండమూరి

6. సంభవం - సూర్యదేవర

7. బుల్లి ' తెర  ' పెన్నుతో బ్నిం - బ్నిం  మూర్తి

8. ఏమి హాయిలే హలా! - నండూరి సుందరి నాగమణి

9. పద్మప్ప - మంధా భానుమతి

10. ప్రకృతి ఒడిలో బ్రతుకు పాఠం - మధురవాణి

11.  మాలిక పదచంద్రిక - 9  - సత్యసాయి కొవ్వలి

12. ' కవిసంగమం ' సమీక్ష - శైలజ మిత్రా

13. 'రాముడుండాడు. రాజ్జిముండాది' సమీక్ష - చక్రధర్ రావు

14. నల్లమోతు శ్రీధర్ చానెల్: ఆన్లైన్ డిస్కౌంట్లని ఉపయోగించుకోవటం ఎలా?