11, ఫిబ్రవరి 2009, బుధవారం

సమస్యాపూరణము - 2

పాతది క్రొత్తది కలిపి ఇస్తున్నా -

౧. హరుడు నియంతయు హరిని యంతము సేయుట పాడియే కదా
౨. వాణి వార వనితలందు వాసికెక్కె

13 కామెంట్‌లు:

  1. ’మలక్ పేట రౌడీ’ గారూ!
    "హరుడు ’నియంతయు’..." అంటే గణ భంగమౌతుంది. ’నియంతయై’ అని మార్చండి.
    - డా.ఆచార్య ఫణీంద్ర

    రిప్లయితొలగించండి
  2. OOPS sorry .. that was a typo ..

    it was supposed to be "niyamtayau"

    Thanks for the correction

    రిప్లయితొలగించండి
  3. సమస్య: వాణి వార వనితలందు వాసికెక్కె!

    నా పూరణ:
    వార వనిత నొక్క ప్రధాన పాత్ర జేసి,
    అల్లినాడు "కన్యా శుల్క"మనెడి గొప్ప
    నాటకమ్మును "గురజాడ" నాడు! - "మధుర
    వాణి" వార వనితలందు వాసికెక్కె!

    - డా.ఆచార్య ఫణీంద్ర

    రిప్లయితొలగించండి
  4. Too Good!

    మా అమ్మగారిది:

    పారిజాత ప్రసూనమై పరిమళించి
    పలుగు తేనెల నందించు ప్రజ్ఞ కలిగి
    రసతరంగిణి వలపుల రాణి మధుర
    వాణి వార వనితలందు వాసికెక్కె

    ఇక మిగిలినది:

    అరయగ వాలి నీటి విడనాడి రుమన్ చెరబట్టి త్రోలెసో
    దరుని దురాత్ముడై పరమ దైన్యము నందెను సూర్య పుత్రుడున్
    వెరవున రాజధర్మమగు వెట నెపమ్మున జానకీ మనో
    హరుడూ నియంతయౌ హరిని యంతము సేయుట పాడియే కదా

    రిప్లయితొలగించండి
  5. మలక్ పేట్ "సాహితీ ప్రియుడు"గారూ!
    మీ అమ్మగారు ఇప్పుడేం చేస్తున్నారు? ఆమె కావ్యాలేమైనా వ్రాసారా?
    రెండో పద్యం నేను పూర్తి చేసి పోస్ట్ చేసేలోపే మీరు మీ అమ్మగారి పద్యాన్ని ప్రచురించారు. అయితే మేమిరువురమూ "జానకీ మనోహరుడు" అని పూరించడం ఆనందంగా ఉంది.
    నా పూరణ:

    కరము నధర్మమార్గమున, కామముతోడ నియంతవోలె సో
    దరుని కళత్రమౌ "రుమ"ను దారగ చేకొనె "వాలి" ధూర్తుడై!
    ఎరిగియునద్ది స్నేహితుని కేర్పడ న్యాయము, జానకీ మనో
    హరుడు నియంతయౌ హరిని యంతము సేయుట పాడియే గదా!

    మళ్ళీ రెండు పద్యాల్లో టైపోగ్రాఫిక్ ఎర్రర్స్! మిమ్మల్ని తప్పు పడదామని కాదు. సాహిత్యాభిమానులు అవి చూసి తప్పుగా వ్రాసుకొంటారేమోనని- అంతే!
    - డా.ఆచార్య ఫణీంద్ర

    రిప్లయితొలగించండి
  6. ముందుగా - నా తప్పులని క్షమించాలి. లేఖిని, బరహా ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాను .

    ఇక మా అమ్మగారి విషయం:

    ఆవిడ రిటైర్డ్ తెలుగు రీడర్ అండీ. ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం గారి దగ్గర మొట్టమొదటి పి హెచ్ డి - భోజరాజీయం మీద ( అనంతామాత్యుడి మీద) దోణప్ప గోల్డ్ మెడల్ కూడా ఇచ్చారు దానికి. 1981 లొ అనుకుంటా ! కావ్యాలయితే ఇంకా ఏమీ వ్రాయలేదు. థీసిస్ ముద్రించడానికే ఇప్పటిదాకా అవ్వలేదు. ఈ ఏడాది ఎలా అయినా చేద్దామనుకుంటున్నాం.

    రిప్లయితొలగించండి
  7. ’మలక్ పేట రౌడీ’ గారూ!
    మీ అమ్మగారి పేరు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ఇష్టంలేకపోతే వద్దులెండి.

    రిప్లయితొలగించండి
  8. మీ అమ్మగారు అపార ప్రతిభా సంపన్నురాలు. ఆమెకు నా అభివందనాలు. ఆమెను ఎవరూ స్పృశించని ఒక పురాణ ఘట్టాన్ని ఎన్నుకొని, రెండు లేక మూడు అధ్యాయాలతో ఒక చిన్న కావ్యాన్ని వ్రాయమనండి. ఆమెకు శాశ్వత కీర్తి లభిస్తుంది.
    - డా.ఆచార్య ఫణీంద్ర

    రిప్లయితొలగించండి
  9. శిశుపాల రుక్ములతో జరాసంధుడు పలికిన పలుకులు:

    చంపక మాల:
    వరునిగ చేది భూవరుని వాసిగ నెన్నిక జేసి యుండగా
    పిరికితనంబు జూపి తను పిల్లను దొంగిలి వెళ్లె గొల్లడున్
    గరికకు తూగునే ఖలుడు? కాంచగ కట్టడి లేక రుక్మిణీ
    హరుడు నియంతయౌ,హరిని యంతము సేయుట పాడియే కదా!!

    రిప్లయితొలగించండి
  10. ’మలక్ పేట రౌడీ’ గారూ!
    ధన్యవాదాలు.

    ఆచార్య ఫణీంద్ర గారు,
    ధన్యవాదాలు. ఇది నేను వ్రాసిన మొదటి చంపక మాల. మీరు మెచ్చుకోవటము తో నాకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లయినది.

    రిప్లయితొలగించండి