తెలతెలవారకముందే
తన సుతిమెత్తని స్పర్శతో
నా గుండెలను
తడిమి తడిమి చూసింది
నిద్రాదేవి వడిలో
తీయతీయని కలలను
కంటున్న నాకు
కాస్తంత నిద్రాభంగం
నా హృదయం మీద
కదలాడుతూ
కలిగించింది తను
చాలా వింత అనుభూతులు
చేయివేసి పట్టుకోబోతే
వయ్యారంగా విడిపించుకుని
నా చుబుకంతో
స్నేహం చేసింది
తను వచ్చిందనడానికి
గుర్తుగానేమొ
నా బుగ్గపై
తన చిన్న పంటి గాటు
మెల్లిగా కళ్ళు తెరిచి ఛూసి అదిరి పడ్డాను
నా గుండెలమీదున్న పందికొక్కు
కిందకి దూకి
తన కలుగులోకి పారిపోయింది :))
Very nice :)
రిప్లయితొలగించండిఅదిరింది ....ట్విస్ట్
రిప్లయితొలగించండిమీ ప్రేయసేమో అనుకుంటే ఇలా ట్విష్టిచ్చినందుకు తప్పనిసరిగా ఇది చచ్చు కవితే
రిప్లయితొలగించండివచ్చింది పందికొక్కు కాదేమో నండీ కోతి అయి వుంటుంది నిద్రలో మీరు సరి గా గమనించి ఉండరు;}
రిప్లయితొలగించండిబాగుంది. రౌడీ కవితలు ఇలాగే ఉంటయేమో
రిప్లయితొలగించండిAdurs! pandikokku prEmOdvEgam mammalni baagaa kadilinchindi/AkaTTukundi.
రిప్లయితొలగించండిSankar :P