25, జూన్ 2010, శుక్రవారం

ఆర్యులా? ద్రవిడులా?? గాడిదగుడ్డా? - రెండవభాగం: కుళ్ళు రాజకీయాలు

Pulling these old posts back (originally posted in March/April 2009)


సరే గొడవ మొదలయ్యింది ... (మన బ్లాగుల్లో కూడా)

ఒకవైపు లెఫ్టిస్టులు .. మరొకవైపు రైటిస్టులు ... అసలు ఈ విషయం ఇంత పెద్దది అవ్వడానికి కారణం ఒకటే - కుళ్ళు రాజకీయాలు ..

19 వ శతాబ్దంలో పాశ్చాత్యులకు మన సంస్కృతి మీద ఆసక్తి ఎక్కువయ్యింది. (అదే సమయంలో మన దేశం బ్రిటిష్ వారి అధీనంలో ఉంది). ఒక అభివృధ్ధి చెందిన నాగరికత ఐరోపా ఖండం బయట ఉండడం సహజంగానే వారికి మింగుడుపడలేదు. [ బీ వీ గిరి - ఆర్యన్ ఇన్వేజన్ వ్యాసంలో ] అప్పూడు ఉన్న చరిత్రకారుల్లో చాలామంది మతపరమైన దృష్టికోణం కలవారే. ప్రపంచం క్రీ పూ 4000 లో, నోవా క్రీ పూ 2500 లో సంభవించిందని నమ్మినవారే. కనుక ఆ కాలం కన్నా ముందు మనిషి భూమి మీద ఉన్నాడని నమ్మలేకపోయారు. వాళ్ళ లెక్కలు వేసుకుని క్రీ పూ 1500 లో ఐరోపానుండి ఆర్యులు భారతదేశానికి వచ్చారని తేల్చేశారన్నమాట. అదీకాక అప్పట్లో సంస్కృతానికి, ఇరానియన్, యూరోపియన్ భాషలకి సంబంధం ఉండేది అని భాషాప్రవీణులు అభిప్రాయపడ్డారు. అంటే వీటన్నికి మాతృభాష ఎడో ఉండాలని దానితో ఆ భాషకూడా యూరోపియనే అని నిర్ణయించేశారు.

ఇది బ్రిటిషువారికి కలిసొచ్చింది. ఆర్యుల ద్రవిడుల పేర్ చెప్పి జనాలని విడగొట్టారు. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. "మన భూమి ననాజాతి సంగమం" అని ఋగ్వేదంలోనే చెప్పబడింది - కానీ ఈ బ్రిటిష్వారు వాటిని రెండు జాతులని చేసి శత్రుత్వం ఎక్కువయ్యేలా చూసుకున్నారు. పది జాతుల మధ్య ఉన్న శత్రుత్వం కన్నా రెండు పెద్ద జాతుల మధ్యది తీవ్రంగానే ఉంటుంది కదా? అదీ వారి రాజకీయం .. అదీ కాక పాఠ్యాంశాలలో కూడా ఈ సిధ్ధాంతాన్ని చొప్పించేశారు ...

ఇక మన కాలానికి వస్తే బుర్ర తక్కువ నోరు ఎక్కువ ఉన్న నియో లిబరల్ కమ్యూనిష్టు మూక ఉండనే ఉన్నారు కదా మన దేశానికి వ్యతిరేకంగా ఉన్న ఏ సిధ్ధాంతాన్నయుఇనా నెత్తికెక్కించుకోడానికి. చైనా ఇరాన్ దేశాల అణ్వస్త్ర వ్యాప్తికి చప్పట్లు కొట్టి మన దేశం విషయంలో మాత్రం సన్నాయినొక్కులు నొక్కే ఈ ద్రోహులకి ఇలాంటి సిధ్ధాంతాలని తలకెక్కించుకోవడం ఎంతసేపు? విచిత్రమేమిటంటె ప్రతీదానికీ శాస్త్రీయమైన ఆధారం, సైంటిఫిక్ ప్రూఫు అని సుత్తి కబుర్లు చెప్పే ఈ పిచ్చి మూక ఈ సిధ్ధాంతాన్ని మాత్రం నమ్మేసింది - ఎలాంటి సైంటిఫిక్ నిరూపణా లేకపోయినా లింగ్విస్టిక్ (భాషాపరమయిన) నిరూపణ ఉంటే చాలు అనుకుంటూ. దీనిలో వీళ్ళకేమిటి లాభం అంటారా ...

"భారతదేశం 1947 కన్నా ముందు రాజకీయంగా ఒక్కటి కాకపోయినా, ప్రజలు నానాజాతి సమ్మేళనమయినా, సాంస్కృతికంగా ఇది ఒకే దేశం" అనే భావం కనక ప్రజల్లో వస్తే వారికి ఓట్లు వేసేదెవరు? (అలాగే ఆర్యులు అనేది జాతే కాదని, వారికి ద్రవిడులకి మధ్య యుధ్ధమేమి జరగలేదని తేలితే మన తమిళ పార్టీల గతేంకాను?).

అన్నట్టు బృహస్పతి ఆగమంలో (ఇది 1947 కన్నా ముందే) ఒక శ్లోకం ఉంది ..

"హిమాలయం సమారభ్య యావదిందు సరోవరం
తందేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్ష్యతే" అని ... (అక్షరదోషాలుంటే మన్నించగలరు - ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న శ్లోకం ఇది)

"హిందుస్థానం అనగా హిమాలయాలకు, ఇందూ సరోవరానికి (హిందూమహా సముద్రం) మధ్య దేవుడు నిర్మించిన దేశం" అని ...

(అలాగే హిమాలయాలలో ' హి ', ఇందూసరోవరంలో "ఇందు" కలిపి "హిందు" అయిందనికూడ కొందరు అంటారు .. నిజానిజాలయితే మనకి తెలియదు)

సరే మళ్ళీ రాజకీయాలలోకి వస్తే - అందరికన్నా ఈ విషయం జనన-మరణ సమస్య అయ్యింది హిందుత్వ వాదులకు .. ముఖ్యంగా జన సంఘ్ - బీజేపీ లకు. ఎందుకంటే "భారత ప్రజ ఒకటి కాదు" అనే భావన కలిగితే పార్టీ పునాదులే లేచిపొయే పరిస్థితి. వారి రాజకీయాలకి ఆయువుపట్టు ఆర్యులు భారతీయులనే భావన .

ఈ విధంగా చాలామందికి ముఖ్యమయిన ఈ విషయం పతాకశీర్షికలకెక్కింది. కాని విచిత్రంగా తన సిధ్ధాంతానికి వచ్చిన వ్యతిరేకత చూసి మాక్స్ ముల్లర్ ప్లేటు ఫిరాయించాడు. 1888 లో "Biographies of Words and the Home of the Aryas" లో ఆయన అన్న మాటలు

"I have declared again and again that if I say Aryas, I mean neither blood nor bones, nor hair, nor skull; I mean simply those who speak an Aryan language...to me an ethnologist who speaks of Aryan race, Aryan blood, Aryan eyes and hair, is as great a sinner as a linguist who speaks of a dolichocephalic dictionary or a brachycephalic grammar."


ఇది జరిగిన 100 సంవత్సరాల తరవాత, అంటే 1990 లలో కూడా ఈ గొడవ కొనసాగింది - ఒకవైపు రోమిలా థాపర్ లాంటి మార్క్సిష్టులు, మరోకవైపు ఆర్.యస్.యస్ మద్దతుదారులతో ...

( ఆ గొడవ గురించి వివరంగా వచ్చే పోస్టులో )

60 కామెంట్‌లు:

  1. కాలానుగుణంగా లభ్యతలోఉన్న ఆధారాలూ,ఆలోచనల ప్రాతిపదికన సిద్ధాంతాలు ప్రతిపాదించబడతాయి, తుంగలోతొక్కివేయబడతాయి.అంగీకరించబడతాయి, వ్యతిరేకించబడతాయి.

    అదే విధంగా అనుకూల సిద్ధాంతాలను నెత్తికెక్కించుకోవడం,ప్రతికూలంగా అనిపించినదాన్ని పట్టించుకోకపోవడం సమాజాలూ,interest groups చేసే పని. వాటిని context of time లో చూసి అర్థం చేసుకోవాలేతప్ప వాటి ఆధారంగా వర్తమానాన్ని నిర్ణయిస్తామంటే కొంచెం ఆలోచించాల్సిందే!

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగుంది మలక్.
    ===
    అదే విధంగా అనుకూల సిద్ధాంతాలను నెత్తికెక్కించుకోవడం,ప్రతికూలంగా అనిపించినదాన్ని పట్టించుకోకపోవడం సమాజాలూ,interest groups చేసే పని. వాటిని context of time లో చూసి అర్థం చేసుకోవాలేతప్ప వాటి ఆధారంగా వర్తమానాన్ని నిర్ణయిస్తామంటే కొంచెం ఆలోచించాల్సిందే!
    ===
    మహేష్ గారు సోదాహరణంగా వివరిస్తే బాగుంటుంది. ఈరకమైన నీతులు చెబుతూ మీరు చేస్తున్నది ఇదే అన్న అభిప్రాయం కలుగుతున్నది.

    రిప్లయితొలగించండి
  3. హిందు అన్న పదం హింద్ అన్న పర్షియన్ పదం నుండి వచ్చింది అంటారు. మరి సంస్కృతానికి ఇతర భాషలకూ గల సంబంధాల మీద లైటు వెయ్యగలరు.

    రిప్లయితొలగించండి
  4. @కొండముది సాయికిరణ్ కుమార్: నేను చెప్పింది "నీతులు" కావు. చరిత్రను individual discretion ఉపయోగించి అర్థం చేసుకునే విధానం. Its a methodology of interpretation.

    ఉదాహరణకు ఆర్య-ద్రవిడ అనుకూల సిద్దాంతాన్ని సాంస్కృతిక-రాజకీయ లబ్ధికోసం తమిళులు ఎలా ఉపయోగించుకున్నారో, దాని ప్రతికూల సిద్ధాంతాల్ని బీజేపీ తన హిందుత్వ అజెండాకోసం ఉపయోగించుకుంటోంది. కానీ ఈ సిద్ధాంతాలను గుడ్డిగా నమ్మి మనం మనవర్తమానాన్ని సమస్యాత్మకం చేసుకోవడం అర్థరహితం. మన బాధ్యత వాటి నేపధ్యం ఆధారంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి "రాజకీయాలకు" దూరంగా ఉండటానికి ప్రయత్నించడం ఒక్కటే.

    రిప్లయితొలగించండి
  5. మహేష్ గారు - మీరు చెబుతున్నదానిలో, సమస్యను సమస్యగా తీసుకొని చర్చించటం కన్నా, పలాయనవాదమే కనిపిస్తున్నది. వర్తమానం సమస్యాత్మకం ఔతుందేమో అని భయపడుతూ అసలు విషయాన్నే చర్చించకూడదంటే ఎలా? బ్లాగుల్లో మీరు ఇంతకాలం చేసిన వాదనల సారాంశం ఇదే అయితే, అసలు మీరు కామెంటు కూడా పెట్టి ఉండకూడదు కదా.

    అసలు విషయాన్ని పక్కదోవ పట్టించే విధంగా కూడా మీ కామెంటు ఉంది. ఎలానంటే, ఆర్య-ద్రావిడుల విషయం తమిళపార్టీల సిద్ధాంతం కాదు, భా.జ.పా.ది అంతకన్నా కాదు. దానికి అనుకూలంగా మాట్లాడితే, తమిళపార్టీలను బలపర్చినట్లు, విరుద్ధంగా మాట్లాడితే భా.జ.పా.ను సమర్ధించినట్లు ఎలా ఔతుంది?

    రిప్లయితొలగించండి
  6. @కొండముది సాయికిరణ్ కుమార్ : ఇతరుల లాభానికి మనం తెలిసీతెలియకుండా పావులవకుండా ఉండటం మరియూ విషయాన్ని కూలంకషంగా తెలుసుకుని, విజ్ఞత ఉపయోగించి విచక్షణతో వ్యవహరించడాన్ని ఫలాయనమని నేను అనుకోను.

    ఆ discretion మనకొచ్చే చర్చలు లాభదాయకమేతప్ప, playing in to those politics to jeopardizes our present is always useless. అందుకే, dispassionate గా విషయం తెలుసుకోవడానికి చర్చలు కావాలిగానీ, ఏదో ఒక తరఫున emotional rhetoric లో భాగమవ్వడానికి కాదు.

    ఇక నేను ఉదాహరణగా చూపించిన దాన్ని మీరు అర్థం చేసుకున్న తీరు చూస్తుంటే,తప్పుదోవ పట్టించింది నేనుకాదు పట్టింది మీరని తేటతెల్లమవుతోంది. మరొక్కసారి మీ క్రితం వ్యాఖ్యతోపాటూ దానికి సమాధానంగా నేను రాసిన వ్యాఖ్యని చదువుకోండి.

    రిప్లయితొలగించండి
  7. అందుకే, dispassionate గా విషయం తెలుసుకోవడానికి చర్చలు కావాలిగానీ, ఏదో ఒక తరఫున emotional rhetoric లో భాగమవ్వడానికి కాదు.
    ===
    What is your reason for concluding this as 'Emotional Rhetoric'? Why you are feeling pinched with the article?

    రిప్లయితొలగించండి
  8. @కొండముది సాయికిరణ్ కుమార్:What makes you think this article is pinching? ఈ టపా శీర్షిక చూస్తే నేనన్న 'Emotional Rhetoric'అర్థమవుతుంది.

    రిప్లయితొలగించండి
  9. After reading కత్తి posts in his blog and various comments that he littered on various blogs, one thing is clear that he practices rabbid anti-India and anti-Hindu ideology.

    Most of the times, he write supporting Pakistan and Communism and Marxism.

    If he tells us, why he hates Hindus, then we can understand his view point. With out that explenation from him, it will be meaningless to discuss with him.

    Hi responses are always wrapped around twisted ideology, but no useful meaning in them.

    రిప్లయితొలగించండి
  10. @అజ్ఞాత: I am liberal India and anti "hindutva".I have never supported Pakistan's policies against India. I have no idea what communism and marxism are.

    I am a borne Hindu and doesn't practice any religious in real life.So,its meaningless to argue that I hate Hindus.

    If I don't make sense,I am sure you wouldn't have taken pains to write about me here.

    There is healthy discussion happening here, so you keep your "valuable opinions" to yourself.If not take out your mask and participate in the discussions.

    రిప్లయితొలగించండి
  11. కాలానుగుణంగా లభ్యతలోఉన్న ఆధారాలూ,ఆలోచనల ప్రాతిపదికన సిద్ధాంతాలు ప్రతిపాదించబడతాయి, తుంగలోతొక్కివేయబడతాయి.అంగీకరించబడతాయి, వ్యతిరేకించబడతాయి.

    అదే విధంగా అనుకూల సిద్ధాంతాలను నెత్తికెక్కించుకోవడం,ప్రతికూలంగా అనిపించినదాన్ని పట్టించుకోకపోవడం సమాజాలూ,interest groups చేసే పని. వాటిని context of time లో చూసి అర్థం చేసుకోవాలేతప్ప వాటి ఆధారంగా వర్తమానాన్ని నిర్ణయిస్తామంటే కొంచెం ఆలోచించాల్సిందే!
    ===
    @ Mahesh - This is your first comment. Nowhere in the article, I did see the author 'deciding on the present' ignoring the so called idealistic views presented by you. In fact, he is even critical about the politicians right from the title of this write-up. So your argument of 'Emotional Rhetoric' is meaningless.

    రిప్లయితొలగించండి
  12. అబ్బాబ్బాఆ, ఇక్కడ కూడా బీజేపీనా మహేష్ గారు!! మీ మతపిచ్చి వదలరుగా. ఎక్కడ చూసినా మీ హిందూమత విద్వేషాన్ని కక్కుతూనే ఉన్నారు. మీ మతగజ్జికి సుత్తి నరేష్ కుమారే సరి అయిన సమాధానం ఇవ్వగలడు :)

    రిప్లయితొలగించండి
  13. @కొండముది సాయికిరణ్ కుమార్: ఇది వ్యాసం యొక్క రెండో భాగం. మొదటి భాగంలో జరిగిన చర్చలు మీరు చూస్తే నా వ్యాఖ్యకున్న నేపధ్యం తెలుస్తుంది. Its a continuation of my earlier argument.

    @జీడిపప్పు: ఆర్య-ద్రవిడ సిద్ధాంతానికి ప్రతిగా ప్రతిపాదనలు గత రెందు దశాబ్ధాలుగా మళ్ళీ ఊపందుకోవడానికి గల నేపధ్యం తెలుసుకోంది. కనీస ఇంగితజ్ఞానం ప్రాపంచిక పరిజ్ఞానం లేకుండా నావాదనని మీరు మతగజ్జి అన్నా మీ మాటకు నేను నవ్వుకును ఊరుకోవడంతప్ప మరేమీ చెయ్యలేను.

    వ్యాసరచయితకు ఈ విషయపరిజ్ఞానం ఉందికాబట్టే మా సంవాదం మర్యాదపూర్వకంగా ఉంది. మీ తెలియని తనాన్ని హిందూపరిరక్షణ ముసుగులో కప్పుకుని అవాకులు వాగొద్దని మనవి.

    రిప్లయితొలగించండి
  14. మహేష్ గారు, ఎప్పుడు ఎలాంటి చర్చ జరిగినా మతకోణంలో చూసే మతోన్మాది ఎవరో అందరికీ తెలుసు. నేనేమీ హిందూ పరిరక్షకుడిని కాదు, మీలాంటి మతోన్మాదులను చూస్తే అలా చెప్పాలనిపిస్తుంది. మతోన్మాది అని ఎందుకంటున్నాను అంటారా? మొన్న "హిందూత్వ" బీజేపీని విమర్శించారు. బాగుంది, నేను తప్పుపట్టడం లేదు. అప్పటికీ మీలోఉన్న మతోన్మాదం తగ్గక "రాముడు" అంటూ ఒక పిట్టకథ చెప్పి మీ మతగజ్జిని బయటపెట్టుకున్నారు. అందుకే అలా కామెంటాల్సివచ్చింది.

    రిప్లయితొలగించండి
  15. సరైన మార్గం లో లేని తెలివి ఎంత ప్రమాదకరమో కత్తి గారి ని చూస్తె తెలుస్తది, కత్తి గారి బ్లాగ్ చదివిన బుడ్డోడు కూడా చెప్పగలడు హిందూ మతం మీద ఎంత విషం కక్కుతూ వుంటాడో .. అతని రేసెంట్ పోస్ట్ "రాముడు వున్నాడేమో రామాయణం కూడా వుందేమో?" ఎంత వెటకరమో రాముడు అంటే.. ఇప్పుడు ఇతని అభిప్రాయం ఎవరు అడిగారో? జనాల ఎమోషన్స్ ని కేలకటం లో కత్తి గారిని మించిన వాళ్ళు లేరు..

    రిప్లయితొలగించండి
  16. సరిగ్గా చెప్పారు అశోక్ గారు. మహేష్‌గారి కొన్ని పోస్టులు బాగుంటాయి. మిగిలినవి కూడా అలాగే రాయవచ్చు కానీ విపరీతమయిన మతోన్మాదం వల్ల ఇలా రాస్తున్నాడు. ఈ ఉన్మాదం నుండి బయటికి రానంతవరకు మహేష్ గారికి, బీజేపీ లోని మతోన్మాదులకు తేడా లేదు.

    ఇక "ఎమోషన్స్ కెలకడం" - తనలోని మతగజ్జి వల్ల పుడుతున్న దురద తీర్చుకోవడానికి ఇదొక మార్గం. సగటు మనిషి ఇలాంటివి చూసి ఊరుకోక ఏదో ఒకటి అన్నపుడు తన ఉన్మాద భావనలను చూపించి సంత్రుప్తి పొందడం మతోన్మాదులకు అలవాటే!

    రిప్లయితొలగించండి
  17. @జీడిపప్పు: నా బ్లాగులోని టపాలతో మీకు సమస్య ఉంటే అక్కడ చర్చించుకుందాం. నా బ్లాగుకి నేనే రాజు, నేనే మహరాజు,నేనే చక్రవర్తిని. కాబట్టి,అక్కడ ఏంరాయాలో,ఏంరాయకూడదో మీరు నిర్ణయించక్కరలేదు.

    @అశోక్: కనీసం నేను రాసిన టపా కూడా చదవకుండా, కనీసం శీర్షిక కూడా సరిగ్గా రాయకుండా ఎంత విలువైన అభిప్రాయం ఏర్పరుచుకున్నారో! మంచిది.

    రిప్లయితొలగించండి
  18. మహేష్ గారు, మీ బ్లాగులో మీరు ఏమయినా రాసుకోవచ్చు. రాయవద్దని చెప్పే హక్కు నాకు లేదు. కాకపోతే వాటి పైన అభిప్రాయాలను చెప్పే అవకాశం మాకు ఉంది. "మతగజ్జి" అని అన్నాను, అదేదో అభూతకల్పన కాదు. కొద్ది కాలం క్రితం మీ పోస్టులు ఎలా ఉండేవో తెలిసిందే. ఆ తర్వాత మీరు కూడలిని నుండి విరామం తీసుకున్నారు. కొద్ది రోజులకు ఏమనిపించిందో ఏమో మళ్ళీ కూడలిలో దర్శనమిచ్చారు. (బహుశా మీ మతగజ్జి దురద తీరకపోవడం వల్లనేమో!!) వచ్చిన వెంటనే రాముడు పైన జోకులు, ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ఇదంతా కేవలం మీలో ఉన్న మతోన్మాదం వల్లనే అని చెప్తున్నాను తప్పించి మీరంటే వ్యతిరేకత వల్ల కాదు.

    రిప్లయితొలగించండి
  19. @ Mahesh : మొదటి వ్యాసంలో మీ కామెంట్లు చదివే మాట్లాడుతున్నాను.
    ========
    "ప్రస్తుతం ద్రవిడ-ఆర్య సిద్ధాంతాలను కుట్రలంటున్నవాళ్ళ discourses లో "అనుకుంటున్న" భారతీయత సాంస్కృతికపరమై
    భారతీయత(cultural nationalism)కానీ, స్వాతంత్ర్యోద్యమ సమయంలో వచ్చిన చైతన్యం రాజకీయ భారతీయత(political nationalism)కు చెందిన సృహ. కేవలం rhetoric కోసం ఈ రెంటినీ కలగాపులగం చేసి వాడుకుని, ఒక emotional issue చేస్తున్నారుగానీ అవి రెండూ వేరు" అన్నారు మీరు.
    ======
    స్వాతంత్ర్యోద్యమ సమయమంటె, 1857 నుండి 1947 వరకు అనా? ఆ లెక్కన చూసినా, దాదాపు వంద సంవత్సరాల దేశ చరిత్రలో మీకు సాంస్కృతిక స్పృహ కనిపించకపోవటం ఎవరి దోషం?
    BTW, సాంస్కృతిక, రాజకీయ భారతీయతలతోపాటు, ఇంకా ఎన్నెన్ని రకాల భారతీయతలు ఉన్నాయో వివరిస్తే తెలుసుకుంటాం.
    అసలు సిపాయిల తిరుగుబాటుకు కారణమే, సాంస్కృతికపరమైనదన్న విషయం మరిచి మాట్లాడితే ఎలా?

    రిప్లయితొలగించండి
  20. మీ బ్లాగ్ కి మీరే చక్రవర్తి, అది ఇంకొకరి ఎమోషన్స్ ని కేలకనంత వరకే, వాక్స్వాతంత్రం వుంది కదా అని నోటి కి వచ్చిన చెత్త మొత్తం వాగి ఇతర మతాల మీద బురద జల్లటం ఎంత వరకు న్యాయం? ఒక్కసారి పైన వున్నా కామెంట్స్ అన్ని చదవండి , ఎంత మంది మిమ్మల్ని ఒప్పోసే చేస్తూ వున్నారో? అయితే జనం మొత్తం వెర్రి వాళ్ళు అయి మీరు ఒక్కరే తెలివి కల వాళ్ళు అయి వుంటారు.. లేకుంటే ఏంటో మీ విజ్ఞత కే వదిలి వేస్తున్నాను.. మీరు ఎంత వాదించిన అబద్దం నిజం అయి పోదు.. మీరు హిందూ మత ద్వేషి అనేది నూటికి నూరు పళ్ళు నిజం.. ఇక పొతే నేను చెప్పింది మీ శీర్షిక టైటిల్ గురించే, నేను కంటెంట్ ని గురించి ఏమి మాట్లాడటం లేదు.. చర్చ దరి తప్పుతున్నట్లు వుంది.. ! మీ గొప్పదనం అదే మహేష్ గారు.. :-)

    రిప్లయితొలగించండి
  21. mata gajji okate kaadu, mahesh ki unnadi kula gajji kudaa. kula gajje mata gajjiki daari tisindi.

    రిప్లయితొలగించండి
  22. 1857-1947 వరకూ జరిగిన స్వాతంత్రోద్యమ కాలంలో ఏకీకృతమైన "భారతీయ భావన" కల్పించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ఉమ్మడి శతృవు బ్రిటిష్ వాళ్ళు గనక, ఆ దమనపాలనకు వ్యతిరేకంగా ఒకటిగా పోరాడే ప్రయత్నం జరిగిందేతప్ప స్వాభావికంగా ఒకరమన్న స్పృహ అప్పటికీ ఇప్పటికీ లేదు. అంతేకాకుండా,విస్తీర్ణంలో మిక్కిలైనవీ, జనాభా రీత్యాకూడా బాహుళ్యమైనవీ అయిన లెక్కకు మించి రాజ్యాలూ, సంస్థానాలూ వారి పనుల్లో వారున్నారేతప్ప స్వాంతంత్ర్యోద్యమ స్పూర్తికూడా వీరిని అంటలేదు.
    ======
    @Mahesh - అన్నిటికీ ప్రామాణికత కావలంటారుగా! మరి 'స్వాభావికంగా ఒకరమన్న స్పృహ అప్పటికి, ఇప్పటికి లేదు' అని ఎలా భావించారో ప్రామాణికంగా వివరించండి.

    రిప్లయితొలగించండి
  23. నా లాంటి సిన్న పిల్లకాయలకి అర్ధం కాని చర్చ పెట్టి నందుకు మలక్ వచ్చి సంజాయిషీ ఇవ్వాలి. అప్పటి దాక కూడలి బంద్ కి పిలుపునిస్తున్నా

    మూడు వందల మంది బ్లాగరులు మూడువందల యాభై బ్లాగులు రోజుకి యాభై పోస్టులు వాటికీ రెండువందల కామెంట్లు దాడులు ప్రతి దాడులు జరిగే కూడలి లో నాకు తెలీకుండా ఏది జరగడానికి జరగదు జరగడానికి వీల్లేదు అలాంటిది పోస్టుకు సంబంధం లేని కమెంట్లా అసలేం జరుగుతుందిక్కడ నాకు తెలియాలి తెలియాలి తెలియాలి .....

    రిప్లయితొలగించండి
  24. @కొండముది సాయికిరణ్ కుమార్ :దయచేసి ఈ క్రింది పుస్తకాల్ని చదవండి
    A struggle for Independence - Bipin Chandra
    India after Gandhi-Ramacahndra guha
    Imagining India- Nandan Nilekani

    రిప్లయితొలగించండి
  25. ఏంటి మీరు చెప్పిన ఈ పుస్తకాలు ప్రామాణికమనుకోమంటున్నారా? ఇంకా నయం 'భారతీయుడు' సినిమానో, 'హేరాం' సినిమానో ప్రామాణికమనుకోమనలేదు.
    వీలైతే, 'కాళరాత్రి' అనే పుస్తకం ఆరెస్సెస్ శాఖల్లో దొరకవచ్చు. చదవండి. కొంతకాలం వరకూ ఆ పుస్తకాన్ని భారతప్రభుత్వం నిషేధించింది.

    రిప్లయితొలగించండి
  26. @కొండముది సాయికిరణ్ కుమార్: సివిల్ సర్విస్ పరీక్షకోసం చదివే రెఫెరెన్స్ పుస్తకం ఒకటైతే, రెండోది సమకాలీన భారతీయ చరిత్రకారుల్లో గౌరవం పొందిన రచయితది. మూడొది కార్పొరేట్ గవర్నెన్స్ కు భారతదేశంలో కొత్త భాష్యం చెప్పిన మేధావి భారతదేశానికి కావలసిన "కొత్త ఆలొచన" గురించి రాసిన పుస్తకం.

    వీటిని "తూచ్" అంటూ తీసేసిన మీ తెలియనితనం మీద జాలివేస్తోంది. Enjoy your ignorance.

    రిప్లయితొలగించండి
  27. శోధన,సాధన చేసిన అజ్ఞానం మాత్రమే శాశ్వతమని నమ్ముతాను. నిరంతరం ఇతరుల నమ్మకాలను ప్రశ్నిస్తూ నిజాలను తెలియన్నట్టు నటిస్తు రహస్య అజెండాను అమలు చెయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను.
    --M

    రిప్లయితొలగించండి
  28. చిన్న సవరణ. హిందూత్వ పరిరక్షకులపై నా విసుర్లున్నది అభి-మతంలో. 'భారతీయం'లో నేను ప్రస్తావించింది కుహనా దేశభక్తుల గురించి.

    రిప్లయితొలగించండి
  29. మహేష్, దయచేసి ఈ క్రింది పుస్తకాల్ని చదవండి -
    వివేకానంద సాహిత్య సర్వస్వం,
    Harvesting our Souls - Arun Shourie (all books by the author are recommended)
    Any works of Anwar Shaikh.

    Till you read these, enjoy your IGNORANCE.

    రిప్లయితొలగించండి
  30. @అజ్ఞాత: ఎవరికి ఎవరి మీద అక్కసుందో నీ వ్యాఖ్య చూస్తుంటే తెలుస్తోంది. పేరు చెప్పుకుని ఈ వ్యాఖ్యరాసుంటే భారత రాజ్యాంగ్యం,చట్టం ప్రకారం నువ్వొక నేరస్తుడివి. కనీసం నీదంటూ ఒక identity కూడా లేకండా ఈ పని చేస్తున్న నువ్వు కనీసం మనిషివికూడా కాదు. కాబట్టి నేరస్తునికిచ్చే గౌరవం కూడా ఇవ్వలేను.

    రిప్లయితొలగించండి
  31. @Mahesh - How stupid and insipid way is your argument going!! Honestly, I am not surprised going by your previous comments. If you find those books as the yardstick to support your argument , then I might as well take Ramayana and Mahabharata written by Valmiki and Vyasaas counter argument.
    ===
    తూచ్ లేదు వంకాయ తొక్కా లేదు. మీ ప్రామాణిక గ్రంధాలేవో తెల్సినాయి కాబట్టి, మీ స్థాయి అంచనా వేయటం కష్టమేమీ కాదు. నిజానికి అందరికన్నా అజ్ణానంలో పొర్లాడుతున్నది మీరే అని గ్రహించండి.

    రిప్లయితొలగించండి
  32. Hi Malak - I follow your blog almost regularly yaar. This is the first time I am putting my argument. I couldn't resist after seeing some 'Asswholesome' comments. So, how is every thing?

    రిప్లయితొలగించండి
  33. @కొండముది సాయికిరణ్ కుమార్ :నా పరిధిలో తెలుసుకున్నవాటితో నా అభిప్రాయాలు ఏర్పడుతాయి.అవి ఎంతబలమైనవి అనేది నేను తెలుసుకున్న source నుంచో లేక నేను convince అయిన తీరునుంచో జరుగుతాయి.నా అత్మవిశ్వాసానికి కారణం నేను తెలుసుకున్న జ్ఞానంపై నేను ఏర్పరుచుకున్న నమ్మకం.మళ్ళీ ఎవరైనా నా నమ్మకాన్ని సవాలుచేసి, నా కళ్ళు తెరిపించేంతవరకూ అదే నాకు "సత్యం".

    రిప్లయితొలగించండి
  34. మహేష్, నీ పరిధి దాటి చూడలేనని ఒప్పుకుంటున్నావు కాబట్టి మూర్ఖుణ్ణని ఒప్పుకుంటున్నావు. ఇంక మూసుకుంటే మంచిది. నీ బ్లాగులో చేసుకో నీ మత ప్రచారాలు.

    రిప్లయితొలగించండి
  35. మీ ఆలోచనా పరిధికి మీరే 'కితాబు' లిచ్చుకుంటున్నారు కాబట్టి, ఇక చర్చలు అనవసరం. కాకపోతే, ఏ పుస్తకాలనైతే ఈరోజు మీరు ప్రామాణికమని చెబుతున్నారో, ఓ యాభై లేదా అరవై సంవత్సరాల తర్వాత మరో నత్తి నరేష్ వచ్చి ఇవన్ని తుంగలో తొక్కి, కత్తి మహేష్ వ్రాసిన బ్లాగులే ప్రామాణికమంటాడేమో అని బెంగగ మాత్రం ఉంది.
    Any ways, keep enthralling the monumental morons of your like.

    రిప్లయితొలగించండి
  36. @కొండముది సాయికిరణ్ కుమార్ : భారతప్రభుత్వ అంగీకారం పొందిన (బిపిన్ చంద్ర),చరిత్రకారుల ఆమోదం లభించిన (రామచంద్ర గుహా),మేధావుల ప్రశంసలందుకొన్న(నందన్ నీల్కనేని)నా ప్రమాణాలకంటే మీ ప్రమాణాలు మిన్న అని మీరు అనుకుంటే నా అభినందనలు. If you don't believe in what you believe in, how can you be a man of your own.

    But,calling me stupid,insipid and moron only proves the shaky ground your are standing in. Keeping your insecurities in the garb of abuse, when you can't have a legible DISCUSSION suits best for you guys.

    రిప్లయితొలగించండి
  37. You were on a shaky ground. That's why you started preaching the author not to get influenced by the political parties and hinted him to stop it. When confronted, you started talking about the opinons of Nandan Nilkeni, Ramchandra Guha etc. etc. I have never seen such an opinionated person like you. మీ అజ్ణానంలో మీరు పొర్లుతూనే ఉండండి.

    రిప్లయితొలగించండి
  38. @కొండముది సాయికిరణ్ కుమార్ :Now I am sure you are not even reading this post.Just look at the title and the response given by the author to me in the first part. Me and the author or clear about the basis of our conversation. Its you who is jumping your gun with presumptions and perceived notions. I am afraid to say they are ill conceived to say the least.

    రిప్లయితొలగించండి
  39. @అజ్ఞాత : I honor you to be Anonymous, but at the same time it is your responsibility to be dignified. Though I support few of your comments, I am strongly condemning the language you used against Katti.

    @కత్తి : The so called standard should not be the standard for this discussion. You read one side the of the (hi)story which is proving wrong. You should also read the other side too. The goal should be find out the Truth.

    రిప్లయితొలగించండి
  40. మలక్పేట్ రౌడీ గారు,
    మీరు రాసిన పోస్టేమిటి? పోస్టు కింద జరుగుతున్నదేమిటి?

    రిప్లయితొలగించండి
  41. మహేష్ గారు మీరు ఎప్పుడూ అంతేనండి బాబు! మీకు మంచి విషయ పరిజ్ఞానం వుంటుంది కానీ చివరకు నేనింతే నా knowledge ఇంతే అనేసి ముగించేస్తారు. అలా అయితే దేన్నీ conclude చెయ్యలేము! ఇలా అయితే వాదన / discussion / argument అనవసరం. మీకు ప్రశ్నించుకోవడం అంత అవసరమయితే అంతర్మదనం చేసుకోండి- పైకి వ్యక్తపరచాల్సిన అవసరం లేదేమో ఆలోచించండి!

    రిప్లయితొలగించండి
  42. @Naresh M: ప్రపంచంలో ఉన్న పరిజ్ఞానం అంతా తెలిసిన తరువాతే,వాదన / discussion / argument చేయ్యాలీ అంటే ఇక మాట్లాడటానికి ఎవరికీ ఏమీ మిగలదు.

    నాకు తెలిసింది నేను చెబుతాను. అదే ultimate truth అని ఎక్కడా చెప్పలేదు. అయినా, people have problem with it. వారు తమ వాదన వినిపించరుగానీ, నా వాదనలో రంధ్రాన్వేషణలో కాలం గడిపేస్తారు. లేదా ధూషణలు మామూలే. Abusing is the easiest form of engaging in a dialogue.

    ఒకసారి వ్యాఖ్యల్ని మళ్ళీ చదువుకోండి. ఎవరు చర్చించాలనుకున్నారో, ఎవరు తమ తలతిక్కని చెప్పుకుని తిరిగారో అర్థమవుతుంది.

    రిప్లయితొలగించండి
  43. @మహేష్: వితండవాదం అంటే ఇదే. నీకు అంతా తెలియదని ఒప్పుకుంటున్నావు. అటువంటప్పుడు అవతలి వాళ్ళు ఏం చెప్పదలచుకున్నారో చెప్పనివ్వకుండా, వాళ్ళు చెప్పదలచుకున్న భావానికి విరుద్ధంగా చెప్పేవాళ్ళకి దురుద్దేశాలు ఆపాదిస్తూ ఎందుకు వాదిస్తారు? అది తలతిక్క కాదా? కనీసం అవతలి వాళ్ళ వాదనల్ని సానుభూతితో అర్థం చేసుకొడానికి కూడా ప్రయత్నించవు కదా నువ్వు. నీ విద్వేష ప్రచారమే రైటు, మిగతా అంతా తప్పంటావు. అంటే అవతలి వాళ్లకి బుర్రలేదనా నీ ఉద్దేశ్యం? ముందు నీ తలతిక్క తగ్గించుకుని ఆలోచించడానికి ప్రయత్నించు.

    రిప్లయితొలగించండి
  44. మహేష్ బహుశా భారత దేశానికి, హిందూ మతానికీ వ్యతిరేకంగా ప్రచారం చెయ్యడానికి డబ్బులు తీసుకుంటున్న విదేశీ ఏజెంటు అయ్యి ఉంటాడు.

    రిప్లయితొలగించండి
  45. అల్లో బ్రెదర్స్ అండ్ సిస్తర్స్ మగేశ్ బాబాయ్ ఇగిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డి.
    ఐనా మగేశ్ బాబాయ్ ఆల్లు బొక్కలెదుక్కుంటే ఎదుక్కోని. నువ్ మాత్రం సిగ్గులేకుండ్నా ఇసయం సెప్పేయ్ ఓ పనైపోయిద్ది.

    రిప్లయితొలగించండి
  46. ఐనా తెలీక అడుగుతుండా ఏమనుకోబాక. బుద్ధి సెప్తా నన్జెప్పి గడ్డెడితే మగేశ్ బాబాయ్కి కోపం రాదు మరి.

    రిప్లయితొలగించండి
  47. "Be careful while fighting with demons, because while doing so, one runs the risk of becoming a demon oneself."

    It's agreed that there is a blogger who loves controversies, agreed that it is impossible to have a rational dialogue with him, agreed that he insinuates eternally, agreed that his comments are very very rude in a subtle and provoking manner.

    How does one go about countering him? Someone wrote a comment here pointing out his surname, cast etc., This comment is aimed at that anonymous guy.

    Dude, you're missing a point here. Just because some controversial blogger belongs to a particular sect/group doesn't automatically make the whole group irrational. You are no better than that blogger, in fact you are worse than him. If you go around making cast fanatic generalizations like this, in your haste to counter a guy, there is something seriously wrong with you. You are exactly becoming the same you are fighting against.

    Calm down fellas, an inconsequential and vain glorious chicken brain can not make even a lick of difference in the bigger scheme of events in this world. breathe easy, let him continue with his line of thought and let him get what he deserves... counter, if you will. Argue, if you will. But do not make retarded comments like Dalits are so and so... some cast is so and so etc., The land which produced men who believed and lived the idea "eesha vasya midam sarvam" will be ashemed to have given birth to cast zealots like you!

    రిప్లయితొలగించండి
  48. Annonymous - Do not mistake me to be supporting Mahesh here. I am his fiercest critic. But, if I see some retard making comments like 'dalits are this and that' 'some cast people are this and that..' I feel like slap across their face.

    How does one deal with prejudice? How does one deal with attention seekers? Attention seekers must be denied what they seek. Attention. Watch this video below, and try to get your mind straight before making generalizations.

    http://www.youtube.com/watch?v=gTDhgR3p12w

    రిప్లయితొలగించండి
  49. First of all I apologize for stepping in late. I was not online for much of the time yesterday and I was reading the posted comments through my email on the phone. As the iPhone does not support Unicode fonts, I was able to read only the comments posted in English.

    Just now finished reading all the comments and honestly I feel bad about the caste and religion oriented attacks. This is what we call "EKATWAM LO BHINNATWAM" ...

    Sorry to say this, but I have decided to moderate the comments posted, so that I will not be be bound by the moral responsibility for any libelous and irrelevant comments posted on this blog. I will leave the comment secition open once the discussion onthis topic is complete.

    One sincere request: PLEASE DO NOT USE THIS SPACE TO SETTLE PERSONAL SCORES.

    IF YOU HAVE ANYTHING ABOUT WHAT HAS BEEN SAID, PLEASE GO AHEAD - I AM ON YOUR SIDE - BUT IF YOU HAVE TO SAY SOMETHING PERSONAL ABOUT PEOPLE, THEN I'M SORRY BUT I CANT BE ON YOUR SIDE.

    రిప్లయితొలగించండి
  50. EDITED COMMENT: Originally posted by Anonymous

    **** EDITED **** అక్కసు , వాళ్ళని డబ్బు వల గా వేసి అక్కున చేర్చుకున్న christiyan missionaries అంటే వల్ల మాలిన అభిమానం . అదే హిందూ మతం మీద ద్వేషం యెంత గా ప్రకటిస్తే వాళ్ళకి **** EDITED **** తాత్కాలికంగా . మహేష్ దానికి భిన్నం ఏమి కాదు .అదే బుద్ది తో మాయావతి varungandhi మీద నాసా ప్రయోగించి అరెస్టు చేయించి ఒక బాపనోడి పిచమ్ అనగ గొట్టా అని కుతి తిర్చుకున్తోన్డి .అదే ఒక ఒవైసీ నో, శాబుద్దిన్ నో హిందువులని రెచ్చ గొట్టేలా మాట్లాడారని మాయావతి అరెస్టు చేయించ గలదా? **** EDITED ****

    రిప్లయితొలగించండి
  51. Edited Comments (All clubbed together) - Originally posted by Anonymous bloggers
    ___________________________________

    మహేష్ **** EDITED **** అతని కులతత్త్వమే అతని వితండ వాదాలకి కారణం. భారత దేశాన్నీ, హిందువుల్నీ అతను ద్వేషించడానికి, వాళ్ళకి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడానికీ కూడా అసలు కారణం అదే. కానీ ఇతని గొప్పదనం ఏమిటంటే తన అసలు ఉద్దేశ్యాల్ని దాచిపెట్టి పైకి స్నేహం నటిస్తూ మాట్లాడడం. **** EDITED ****. ఇతనికి వాళ్లకున్నంత దమ్ము లేకపోవడంవల్ల బయటపడడు. లేదా కావాలని తనను కూడా హిందువే అని భ్రమపడేవాళ్ళ మధ్యలో గుంభనగా దూరి ప్రచారం చేస్తాడు.

    **** EDITED **** మతద్వేషాన్ని, అగ్రవర్ణాలపైన ద్వేషాన్ని సానుభూతితో అర్థం చేసుకోవాలి. ప్రాచీన భారతీయ వారసత్వంపైన ఇతను చేసే దుష్ప్రచారం కూడా **** EDITED **** అది సహజమే అని భావించి వదిలెయ్యాలి. **** EDITED **** నాకు ప్రాచీన భారతీయ వారసత్వం పైన కోపం లేదు అని ఇతను బహిరంగంగా చెప్తే తప్ప ఇతనితో వాదించడం అనవసరం.


    _______________________________


    ఇతని ద్వేషం హిందూమతంపైనే తప్ప ఇతరమతాలపైన కాదు అన్న విషయం అందరూ గ్రహించండి. **** EDITED ****. ఆ సంగతి అతను ధైర్యంగా చెప్పుకుంటే నిజంగా అతన్ని చాలామంది గౌరవించి ఉండేవారు. కానీ అసలు కారణాన్ని దాచిపెట్టి ద్వేషాన్ని మాత్రమే వెళ్ళగక్కి ఇంతకాలం అందరికీ కన్ఫ్యూజన్ కలిగించాడు.

    __________________________________

    మరొక గొప్ప బ్లాగరు అబ్రకదబ్రా *********** EDITED ********** . అందుకే అతనూ హిందూమతానికి వ్యతిరేకంగా రాస్తాడు.

    రిప్లయితొలగించండి
  52. Edited Comment - Originally Posted by Abracadabra

    ___________________________________


    @అజ్ఞాత:

    >> "మరొక గొప్ప బ్లాగరు అబ్రకదబ్రా ****** EDITED ***** అందుకే అతనూ హిందూమతానికి వ్యతిరేకంగా రాస్తాడు"

    పొరబడ్డారు. నిజానికి ఈ మధ్యనే నేను నా బ్లాగులో హిందువులూ, క్రైస్తవులూ గుళ్లలో మైకులు పెట్టి చుట్టు పక్కలోళ్లని ఎలా చంపేస్తుంటారో వివరంగా రాశాను (చదువుకోండి: పరీక్ష కాలం). అది రాసినప్పుడు నేను ముస్లిముని.

    అంతకు ముందెప్పుడో ముసల్మాన్లకి ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించటం, మంద పెళ్లిళ్లు చెయ్యటం గురించి కూడా ఏకి పారేశాను (చదువుకోండి: మంద పెళ్లిళ్లు). అప్పట్లో నేను బౌద్ధ మతంలో ఉండే వాడ్ని లెండి.

    ఇప్పటి దాకా నే రాసిన టపాలు తొంభై తొమ్మిది. వీటిలో ప్రత్యక్షంగా ఏదో ఓ మతం ప్రస్తావన ఉన్నవి ముచ్చటగా మూడు. వాటిలో పై రెండూ పోగా మిగిలినది దశావతారాలు. అందులో ఉన్నది దశావతారాల పైన చర్చే కానీ హిందూత్వమ్మీద బురద చల్లుడు కాదన్నది అది చదివిన వారికర్ధమౌతుంది.

    పై మూడూ కాక పరోక్షంగా మత ప్రస్తావన ఉన్న టపాలు మరో రెండు. నేనాస్తికుడినిలో ఉన్నదల్లా హేతువాదం పేరుతో హిందూ సంప్రదాయాలని తప్పుబట్టే వితండవాదులపై ఎత్తిపొడుపు. భారతీయంలో ఉన్నది హిందూత్వ పరిరక్షణ గురించి శ్రీరంగనీతులు చెప్పే హిపోక్రైట్లపై విసుర్లు. మీరు తప్పకుండా చదవాల్సిన టపా అది.

    వివరంగా చెప్పా కదా. అవన్నీ చదివి నేను హిందూ మతానికి వ్యతిరేకంగా ఏమి రాశానో సెలవిస్తే తెలుసుకుంటాను. కొన్ని విషయాల్లో మహేష్ అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తాను కాబట్టి నన్నీ రొచ్చులోకి లాగారని నా అనుమానం. ఒకప్పుడు పబ్బుల్లో తాగి తందనాలాడే విషయంలోనూ, తాజాగా చలం సాహిత్యం విషయంలోనూ నేను అదే మహేష్‌తో తీవ్ర స్థాయి వాగ్వివాదాల్లోకి దిగిన విషయం మాత్రం మీకు గుర్తుకు రాకపోవటం వింతే. బ్లాగ్లోకంలో మహేష్‌తోనైనా, మరెవరితోనైనా నాది అంశాలవారీ ఏకీభావం మాత్రమే. నాకు నచ్చినవీ, నచ్చనివీ నేను నిర్మొహమాటంగా చెబుతాను. మీరెవరోగానీ, మీ విషయంలోనూ అంతే. అనవసరంగా నన్నిందులోకి లాగకండి.

    April 2, 2009 2:03 PM

    రిప్లయితొలగించండి
  53. నేను రెగ్యులర్ గా ఒకే పోష్టు ఫాలో అవను. కూడలిలో కనిపించింది చదివి రాయాలనిపిస్తే ఒక కామెంటు రాసేసి కామ్ గా ఉంటాను.

    ఈరోజు కూడలిలో వచ్చిన పోస్ట్ చూస్తే పాత పోస్ట్ మీద చాలా గొడవ అయినట్లు తెలిసి మళ్లీ దాన్ని చూసాను.

    మొత్తానికి ఇంగ్లీషులో తిట్టుకుంటేనే కాని అవలేదు.

    వెంకటేశం ! మనవాళ్లకు తెల్లవాళ్లు చెప్పేవరకు మనగొప్ప, మనవేదాల్లో ఏముందో తెలవదోయ్! మళ్లీ ఎవరేనా తెల్ల వాడు వచ్చి పిచ్చినాకొడకుల్లారా మీలో మీరు కొట్టుకు చావడానికే మా తాతముత్తాతలు ఇలాంటివి కల్పిచార్రా అంటే అప్పుడు మనం నమ్ముతాం.

    జై తెల్లతోలు జైజై తెల్లతోలు

    రిప్లయితొలగించండి
  54. అశ్వ పురాణం
    ప్రపంచంలోని గుర్రాల జాతులన్నింటికీ మూలాశ్వం ఒకటే!
    అది 1,60,000 నుంచి 1,30,000 ఏళ్లనాటిది
    9000 ఏళ్ల క్రితమే ఆసియాలో గుర్రాలు?
    ఆర్యుల దండయాత్ర అబద్ధమేనా?

    హైదరాబాద్, ఫిబ్రవరి 11 : భూమ్మీద ఇప్పుడు తిరిగే ప్రతి గుర్రానికీ...మూలాశ్వం ఒకటి ఉంది! అది 1,60,000 క్రితం సంవత్సరాల నుంచి 1,30,000 క్రితం సంవత్సరాల వరకు చరించింది! 26,500 ఏళ్ల నుంచి 20,000 ఏళ్ల నడుమ.. యూరోపియన్ ప్రాంతాన్ని మంచుయుగం కమ్ముకున్నప్పుడు వెచ్చదనం కోసం గుర్రాలు ఇతర దేశాలకు వెళ్లిపోయాయి! అలా వెళ్లిన గుర్రాలను.. ప్రపంచంలోని వివిధప్రాంతాల్లో మనుషులు దాదాపు ఒకే సమయంలో మచ్చిక చేసుకోవడం మొదలుపెట్టారు! క్రమేపీ మానవుడి నాగరకతకు గుర్రం ప్రతిరూపంగా మారింది! విస్త'రణ' కాంక్షకు ప్రధాన సాధనంగా ఉపయోగపడింది!!

    మానవుడి విస్తరణ కాంక్షకు ప్రతిరూపం... గుర్రం! ఒకప్పుడు.. మానవ నాగరికతకు చిహ్నం గుర్రం. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లాలన్నా.. యుద్ధాలు చేసి ఇతర సమూహాలను జయించాలన్నా మానవుడికి గుర్రాలే శరణ్యం. కొండొకచో వ్యవసాయానికీ ఉపయోగపడేవి. దాదాపు 19వ శతాబ్దం దాకా అదే పరిస్థితి. ఈ గుర్రాలకు మన దేశ చరిత్రలో కూడా ఒక విశిష్ట స్థానముంది. ఇంతటి కీలకమైన అశ్వజాతి.. దాదాపు లక్షా అరవై వేల ఏళ్ల క్రితం పుట్టిందని.. ఆ తర్వాత కొన్ని వేల ఏళ్లు గడిచేటప్పటికి వివిధ జాతులుగా పరివర్తనం చెందిందని.. వాటిని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న మానవులు దాదాపు అదే సమయంలో మచ్చిక చేసుకోవటం మొదలుపెట్టారని..అదే మానవ నాగరికతకు పునాదిగా నిలిచిందని శాస్త్రవేత్తల తాజా జన్యు పరిశోధనల్లో తేలింది.

    ఇదే నిజమైతే మానవ వలస చరిత్రను మనం భిన్నమైన కోణం నుంచి చూడాల్సి ఉంటుంది. మానవడి జ్ఞానం పెరిగిన కొద్దీ.. తనచుట్టూ ఉండే జంతువుల్లో కొన్నింటి ఉపయోగాన్ని కనుగొని, వాటిని మచ్చిక చేసుకుని పెంచుకోవడం మొదలుపెట్టాడు. వేటాడ్డానికి కుక్కలు, మాంసం కోసం గొర్రెలు, పందులు మొదలైన వాటిని పెంచేవాడు.

    వీటి వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నా.. రవాణాకు కాని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లటానికి ఇవి ఉపయోగపడవు. అలాంటి సమయంలో మానవుడు గుర్రాలను మచ్చిక చేసుకోవటం మొదలుపెట్టాడు. అయితే, ఈ గుర్రాలు ఎప్పటివి, ఎక్కడివి అనే ప్రశ్నలకు ఇప్పటి దాకా శాస్త్రవేత్తలకు ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. దీనిని తాజాగా ఇటలీలోని పెరుగువా విశ్వవిద్యాలయానికి చెందిన అలిసాండ్రో అఖిలీ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఛేదించగలిగింది. పరిశోధనలో భాగంగా ఈ బృందం.. యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలకు చెందిన మేలు జాతి గుర్రాల నుంచి సేకరించిన 83 రక్తపు నమూనాల్లోని మైటోకాండ్రియల్ డీఎన్ఏను విశ్లేషించింది.

    ఇందులో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఇందులో మానవుడికి మచ్చిక అయినవి 18 ప్రధాన జాతులని తేలింది. 26,500 ఏళ్ల నుంచి 20,000 ఏళ్ల నడుమ ఇవి యూరేసియాలో చలిని తట్టుకోలేక ఉష్ణప్రాంతాల కోసం అన్వేషిస్తూ ప్రపంచంలోని వివిధప్రాంతాలకు విస్తరించాయని తెలిపారు. ఆసియా ప్రాంతంలో ఈ 18 జాతుల గుర్రాలూ విస్తృతంగా చరించాయని, ఇప్పటికీ ఉన్నాయని తేలింది. ఆయా జాతుల గుర్రాలన్నిటి మూలం ఒకటేనని తెలిసింది.

    అన్ని అవసరాలకు..
    ఒకప్పుడు మానవులు గుర్రాలను కూడా తమ పౌష్టికాహారంగా ఉపయోగించుకొనేవారు. ముఖ్యంగా శీతల ప్రాంతాలవారు గుర్రపు మాంసాన్ని తినేవారు. ఈ ఆచారం చాలా కాలం కొనసాగుతూనే వచ్చినా గుర్రాలను రవాణా కోసం, వ్యవసాయం కోసం ఉపయోగించటమే లాభసాటి అని గ్రహించారు. దీనితో గుర్రాలను ఈ రెండింటి కోసమే వాడటం మొదలుపెట్టారు. దాదాపు ఐదారువేల సంవత్సరాల నుంచి గుర్రాలు మానవుడికి ఉపయోగపడుతూనే ఉన్నాయి. "మానవ చరిత్ర ప్రస్థానంలో గుర్రాలది ఒక ప్రముఖ పాత్ర. మానవుడికి వలస వెళ్లటానికి గుర్రం ఒక ముఖ్యమైన సాధనం. అదే అతని విస్తరణకాంక్షను పెంచింది. ఈ క్రమంలో మానవుడు కూడా గుర్రాలతో తన అనుబంధాన్ని పెంచుకున్నాడు. వాటిని తన అవసరాలకు తగినట్లుగా మలుచుకోవటానికి ప్రయత్నించాడు. కొత్త జాతులను పుట్టించటానికి ప్రయోగాలు చేశాడు..'' అని అఖిలీ వివరించారు.

    ఏం తెలుస్తుంది?
    ఆర్యులు భారతదేశానికి దండెత్తివచ్చారని.. వారికి గుర్రాలు ఉండటం వల్లనే సింధు నాగరితపై ఆధిపత్యం సాధించారనే వాదన చాలా కాలంగా ఉంది. అఖిలీ బృందం చేస్తున్న ప్రతిపాదనే నిజమైతే ఈ సిద్ధాంతాలన్నీ తప్పని తేలుతాయి. సౌదీ అరేబియాలోని అసిర్ రాష్ట్రంలో అల్ మఖురీ అనే ప్రాంతంలో ఈ మధ్యన జరిపిన కొన్ని తవ్వకాలలో కొన్ని గుర్రపు బొమ్మలు దొరికాయి. అదే విధంగా ఆ ప్రాంతంలో కొన్ని గుర్రపు ఎముకలు కూడా లభించాయి. వీటి ఆధారంగా చూస్తే అరబ్ దేశాలలో దాదాపు తొమ్మిది వేల ఏళ్ల క్రితమే గుర్రాలు ఉండేవని అర్థమవుతోంది. ఈ ప్రతిపాదనలు నిజమైతే భారత ఉపఖండంలోనూ ఆర్యుల రాకకు మునుపే గుర్రాలు ఉండి ఉండాలి. అయితే వీటిని మచ్చి క చేసుకొని ఉపయోగించుకున్నారా అనేది ప్రధాన ప్రశ్న. మరిన్ని పరిశోధనలు జరిగితే పూర్వ నాగరికతల అంశాలు అనేకం వెల్లడవుతాయి.

    రిప్లయితొలగించండి