అపార జ్ఞానానికి ప్రధానమైన మూలాలు వేదాలు. ఈ వేదాల గమ్యాలు వేదాంతాలు, లేక ఉపనిషత్తులు. నాలుగు వేదాల్లో మొత్తం పదకొండు ఉపనిషత్తులున్నాయి. ఈ ఉపనిషత్తులలో అతి చిన్నదైన, అయినా అతి క్లిష్టమయిన ఉపనిషత్తు ఈశోపనిషత్తు. ఇది చాలా ముఖ్యమయినది కూడా. అతిపెద్ద ఉపనిషత్తయిన బృహదారణ్యకోపనిషత్తు ఈశోపనిషత్తుపై ఒక వ్యాఖ్యానమని పండిత్ సతల్వేకర్ లాంటి ప్రముఖుల ఉద్దేశ్యం. ఇందులో మొత్తం 18 మంత్రాలుంటాయి. ఈశోపనిషత్తు, దాని అనువాదం చదివే ప్రయత్నంలో నాకు అర్ధమయిన దానిని పంచుకోవడమే ఈ టపా ముఖ్యోద్దేశం. వేద పండితులారా, ఇది నాకు అర్ధమయిన రీతిలో వ్రాస్తున్నా. తప్పులుగానీ ఉంటే క్షమించేసి, దయచేసి సరిదిద్దండి.
ఆవాహన / నాందీ శ్లోకం:
ఓం పూర్ణమద: పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావిశిష్యతే
భావము: మానావాతీత శక్తి సంపూర్ణమైనది. తనని తాను నడిపించుకోగలిగినది. దానినుండీ పుట్టినవి కూడా తమని తాము నడిపించుకునే శక్తులే. తన నుండి ఇన్ని సంపూర్ణ రాశులు పుట్టినా, వీటన్నిట్కీ మూలమైనా ఆ శక్తి సంపూర్ణంగానే ఉంటుంది.
నా వ్యాఖ్య: అంటే మాతృక నిర్మూలింపబడకుండా దానినుండి పునరోత్పత్తి జరుగుతుందని ఇది తెలియజేస్తోంది. ఒక విధంగా ఇది శిశు జననాన్నికూడా తెలియజేస్తోంది.
ఇక ఉపనిషత్తులోకొస్తే,
మొదటి మంత్రం:
ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్
తేన త్యక్తేన భుంజితా మా గృధ: కస్య స్విద్ ధనం
భావము: ఈ విశ్వంలోని ప్రతి ఒక్కటీ మానవాతీత శక్తి లేక భగవంతునిచే నియంత్రింపబడుతుంది. అది భగవంతునికే చెందుతుంది. అందులో మనకి అవసరమైనవే మనం గ్రహించి తక్కినవాటిని వదిలివేయవలెను
నా వ్యాఖ్య: అంటే, మనకి కావసినదానినే మనము గ్రహించి, మనకి ఉద్దేశింపబడినదానినే మనము తీసుకొని తక్కినవాటిని ఇతరులకి వదిలివెయ్యాలని, మరో విధంగా చెప్పాలంటే ఈ విశ్వం అనే ఆస్థిని విశ్వంలో ఉన్న రాశులన్నీ పంచుకోవాలని దీనర్ధం. వేదాలని వెక్కిరించే కమ్యూనిష్టులు చెప్పేది కూడా ఇదే కదా!
రెండవ మంత్రం:
కుర్వన్నేవేహ కర్మాణి జిజీవి షేచ్చతంసమా:
ఏవం త్వయి నాన్యథేతోస్థి న కర్మ లిప్యతేనరే
భావము: నిర్దేశించిన విధంగా కర్మనాచరించేవారు నూరేళ్ళపాటు బ్రతకాలనుకోవచ్చు. ఆ తరవాత శరీరాన్ని మార్చి పని కొనసాగించవచ్చు. మానవ జన్మలో ఉన్న గొప్పతనం జనన మరణ చక్రాన్ని తప్పించుకోవడం. సత్కర్మనాచరించేవారు మోక్షం పొందితే ఆచరించనివారు జనన మరణ చట్రాల్లో చిక్కుకుని ఉంటారు.
నా వ్యాఖ్య: ఇది వినడానికేదో పునర్జన్మ సిధ్ధాంతంలా ఉన్నా, లోతుగా ఆలోచిస్తే దీనర్ధం - పని (కాల చక్రం) అనేది ఆగదు. జరుగుతూనే ఉంటుంది / ఉండాలి. కానీ అందులో పాత్రధారులే మారతారు. తనకప్పగించిన పనిని సమర్ధవంతంగా చేసినవారు వేరే పనిలోకి వెడితే, చెయ్యనివారూ దానినే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. అంటే దీనర్ధం - ఒక పనిలో పరిపూర్ణత సాధించేవరకూ దానిని అభ్యసిస్తూనే ఉండాలి అని.
మూడవ మంత్రం:
అసుర్యా నామతేలోకా అంధేన తమసావృతా
తాంస్తే ప్రెత్యాభిగత్యంతి ఏ కే చాత్మహనో జనా:
భావము: తన బాధ్యతలని నెరవేర్చలేని వారు, ఆత్మను చంపుకునే వారు, బాధ్యతలేని అసురలోకములకు పోవుదురు.
నా వ్యాఖ్య: చెడ్డ పనులు చేస్తే నరకానికిపోతారు అని. అయితే ఇక్కడ గమనించాల్సినది, జంతువులకన్నా మనుషులకి అదనపు బాధ్యతలుంటాయని, వాటిని పాటించినవాడే నిజమైన మనిషి, లేనివాడు మృగములతో సమానమని.
నాలుగవ మంత్రం:
అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్
తధ్ధావతోన్యానత్యేతి తిష్ఠాత్తస్మినపో మాతరిశ్వ దధాతి
భావము: భగవంతుడు, సర్వోన్నత శక్తి మిగతా శక్తులకన్నా శక్తివంతమయినది. అగ్ని, గాలి, వర్షము లాంటి శక్తులు ఈ సర్వోత్తమ శక్తి కన్నా బలహీనమయినవే
నా వ్యాఖ్య: మనకి కనిపించే, మనం దైవ స్వరూపాలుగా భావించే గాలి, నీరు, అగ్ని కన్నా శక్తివంతమైనది వీటిని నిగ్రహించే సర్వాంతర్యామి. అంటే, మంట, వాన, గాలి లాంటి దృగ్విషయాలు వేరే వ్యవస్థ ఫలితంగా ఉద్భవిస్తాయని దీనర్ధం (ఉదా: మెక్సికోలో తన రెక్కలు రెపరెపలాడించే ఓ సీతాకోకచిలుక, ఫ్లోరిడాలో ఒక పెను తుఫాను సృష్టించవచ్చు - తూనిగ న్యాయం అనే పోహ - "అపోహ" కాదు - కోసం శాస్త్ర విజ్ఞానం బ్లాగు చదవండి)
అయిదవ మంత్రం:
తదెజతి తన్నైజతి తద్దూరె తద్ద్వంతికె
తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత:
భావము: మానవాతీత శక్తి కదిలేది, కదలనిది కూడ - దగ్గర ఉండేది, దూరంగా ఉండేది కూడా, అనంటిలోపలా, బయట కూడా ఉంటుంది
నా వ్యాఖ్య: వినడానికిదేదో సీతారామయ్యగారి మనవరాలు సినీమాలో పొడుపుకధలా ఉంది కదా? కానీ దీ నర్ధం, మనం దేవుడిగా కొలిచే ఆ శక్తి సర్వాంతర్యామి. స్థిరమైనది - స్టేటిక్, చలనముకలది - డైనమిక్. దగ్గరైనా, దూరమైనా, మొత్తం వ్యాపించి ఉంది. లోపల ఉంటుంది - ఇంటర్నల్, బయట ఉంటుంది ఎక్స్ టర్నల్. ఈవ్వ్నీ భౌతికశాస్త్రంలో వర్ణింపబడే శక్తిస్వరూపాలే.
ఆరవ మంత్రం:
యస్తు సర్వణి భూతాన్యాత్మన్యేవానుపశ్యతి
సర్వ భూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే
భావము: ఈ విశ్వంలో ప్రతీదానినీ దైవస్వరూపంగా చూశేవారు దేనినీ ద్వేషించరు
నా వ్యాఖ్య: ద్వేషానికి తావివ్వకుండా ప్రతీదానిలో ఆ సర్వోన్నత శక్తిని చూడమని అర్ధం.
ఏడవ మంత్రం:
యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మైవాభూద్ విజానత:
తత్ర కో మోహ: క: శొకా ఏకత్వమనుపశ్చత:
భావము: ప్రతీ జీవినీ ఆధ్యాత్మిక దృష్టితో, దైవ స్వరూపంగా చూసేవారికి నిజమైన జ్ఞానం లభిస్తుంది. ఇక అపోహలకి తావేదీ?
నా వ్యాఖ్య: ప్రతీ జీవినీ గౌరవించే వారి జ్ఞానము దినదినాభివృధ్ధి చెందుతుంది. ఏలా అంటారా? జ్ఞానానికి అంతులేదు. ఎంత నేర్చుకున్నా ఎడొ ఒకటి మిగిలే ఉంటుంది. ఒక జీవి ఎక్కువగా నేర్చుకోగలిగినది మరొకజీవి నుండే. అలా నేర్చుకోవాలంటే వేరే జీవి పట్ల గౌరవభావముండాలి కదా?
ఎనిమిదవ మంత్రము:
స పర్యగాచ్చుక్రమతాయమవ్రణమస్నావిరం శుధ్ధమపాపవిధ్ధం
కవిర్మనిషీ పరిభూ: స్వయంభూర్యాథాతథ్యతోర్ధాన్ వ్యదధాచ్చాస్వతిభ్య: సమాభ్య:
భావము: శక్తి/దేవుడి రూపానికి దేహం, కాయం లాంటివి ఉండవు. అది నిర్గుణ బ్రహ్మ. జ్ఞానము పొందినవారు దేవుడి ఇటువంటి రూపాన్ని తెలుసుకొనగలరు.
నా వ్యాఖ్య: సర్వోన్నతుడైన భగవంతుడు అంటే నాలుగు తలలు, ఎనిమిది చేతులు, చేతిలో ఆయుధం ఉన్నవాడు కాదు, అది మన విశ్వాన్ని నియంత్రించే శక్తి అని ఎంత చక్కగో చెప్తోందో ఈ మంత్రం.
తొమ్మిదవ మంత్రం:
అంధ: తమ: ప్రవిశ్వంతి యే విద్యం ఉపాసతే
తతో భూయ ఇవతే తమో య ఉ విద్యాయాం రతా:
భావము: అవిద్యలో చిక్కుకున్నవారు అజ్ఞానాంధకారములో చిక్కుకుంటారు. అంతకన్నా హేయమైన పరిస్థ్తితిలో చిక్కుకునేవారు విద్యను తప్పుగా అర్ధం చేసుకునేవారు.
నా వ్యాఖ్య: నేర్చుకున్న విద్యను తప్పుడు కార్యాలకి ప్రయోగించరాదని సూటిగా చెప్తోందీ మంత్రం. తప్పుడూ దోవలో నడిచే విద్యావంతులకనా అజ్ఞాలులే కాస్త నయమని కూడా చెప్తోంది.
పదవ అమంత్రం:
అన్యదేవాహుర్విద్యయాన్యాదాహురవిద్యయా
ఇతి సుష్రుమధీరాణాం యె నస్తద్ విచచక్షిరే
భావము: జ్ఞానములోంచి పుట్టుఇన ఫలితాలు, అజ్ఞానములోంచి పుట్టిన ఫలితాలు వేర్వేరుగా ఉంటాయి
నా వ్యాఖ్య: జ్ఞానులు సాధించే ఫలితాలని అజ్ఞానులు సాధింపలేరు. కావున ఫలితాలు సాధించాలంటే జ్ఞానం ముఖ్యం. కనుక ప్రతి ఒక్కరు జ్ఞాన సముపార్జనపై దృష్టి కేంద్రీకరించాలి
పదకొండవ మంత్రము:
విద్యం చావిద్యం చ యస్తద్ వేదోభ్యం సహ
అవిద్యా మృత్యుం తీర్త్వా విద్యయామృతమశ్నుతే
భావము: జ్ఞానాన్నీ, అజ్ఞానాన్నీ నేర్చుకునేవారు మోక్షం పొందగలరు
నా వ్యాఖ్య: ఇదేదో గందరగోళంగా ఉందనుకుంటున్నారు కదూ? ఆగండాగండి. ఇక్కడ అజ్ఞానం నేర్చుకోవడమంటే, అజ్ఞామేదో తెలుసుకోవడం - ఏమి చెయ్యకూడదో తెలుసుకోవడమన్నమాట. దీని వల్ల ఏ దారిలో ఏ ఇబ్బందులు ఉంటాయో తెలుస్తుంది. ఏది తప్పో తెలియని వారికి ఆ తప్పు చెయ్యకూడదు అని కూడ తెలియదు కదా. (హేమద్పంత్ తను వ్రాసిన శ్రీ సాయి సత్చరిత అనే పుస్తకంలో - సాయిబాబా, నానా సాహెబ్ చదోర్కర్ల మధ్య భగవద్గీత కి సంబంధించిన ఒక శ్లోకం మీద జరిగిన వాగ్వివాదాన్ని చెప్తూ, ఈ విషయాన్ని అద్భుతంగా వివరిస్తారు)
పన్నెండవ మంత్రము:
అంధం తమ: ప్రవిశంతి యె సంభూతిముపాసతే
తతో భూజ ఇవ తే తమో య ఉ సంభూత్యాం రతా:
భావము: చిన్న చిన్న దేవతలకి, అలాగే నిస్తరమైన విశ్వానికి దాసులయ్యేవారు అజ్ఞానమునుండి బయటకు రాలేరు.
నా వ్యాఖ్య: ఇప్పటిదాకా చెప్పిన దానికి ఇది వ్యతిరేకంగా ఉందనిపిస్తోంది కదూ? అయితే ఇక్కడ ఉద్దేశ్యం వేరు. అర్హత లేని వారిని దేవుళ్ళని చేసి దాసులయ్యి, ఏది ఏమిటొ తెలియకుండా నిస్తరాన్ని పూజ చేస్తే సరియయిన జ్ఞానం లభించదు. ఇందులో సూక్షం ఏమిటంటే "సంభ్యుక్తం" అనగా నిస్తరం అనగా "ఏబ్సల్యూట్" ని నమ్మేవాడూ జ్ఞాని కాలేడు, ప్రపంచంలో అన్ని స్తరాలే అంటే "రిలేటివ్" అని ఈ మంత్రం ఉట్టంకిస్తోంది. కానీ మనం ఇది ఐన్శ్తయిన్ చెప్తే కానీ నమ్మము కదా? :))
పదమూడవ మంత్రము:
అన్యదేవాహు: సంభవాన్యదాహురసంభవాత్
ఇతి సుష్రుం ధీరాణాం ఏ నస్తద్ వచ్చచక్షిరే
భావము: సర్వోన్నత శక్తి ఆరాధనలో వచ్చే ఫలితాలు, అటువంటి శక్తి కాని వాటిని ( జ్ఞానం లేని గురువుల దగ్గరనుండి నేర్చుకొన్న దానితో) ఆరాధించాగా వచ్చే ఫలితాలు వేర్వేరుగా ఉంటాయి.
వ్యాఖ్య: మీరేమనుకుంటున్నారో నాకు తెలిసిపోయిందోచ్. భగవంతుడు / ఏసు / అల్లాహ్ ఒక్కడే భగవంతుడు, మిగిలినవారు కారు అని ఈ మంత్రం చెప్తోందనుకుంటున్నారు కదూ? నేననుకుంటొంది ఇదీ:
సద్గురువులుకాని వారు నిజమైన జ్ఞానాన్ని ప్రసాదించలేరు. సర్వోన్నత శక్తి ద్వారా జ్ఞానాన్ని ప్రసాదించడం ఒక్క సద్గురువుకే సాధ్యం. తక్కిన గురువులు ప్రసాదించేది మిడిమిడి జ్ఞానమే. అలాగే అంతర్లీనంగా కనిపిస్తున్న భావం: వేర్వేరు వ్యక్తులు వేర్వేరు దారులలో బ్రహ్మ జ్ఞానం పొందగలరని. అందులో కొందరు భగవంతుని ఆరాధించేవారయితే మరికొందరు ఆరాధించని నాస్తికులు.
పధ్నాలుగవ మంత్రము:
సంభూతి చ వినాశం చ యస్తద్ వేదోభ్యం సహ
వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతమశ్నుతే
భావము: భగవంతుడి / శక్తి నిజ స్వరూపం తెలిసిన వాడు, తాత్కాలికమైన, ఐహికమైన వస్తువుల, దేవతలకతీతుడై జ్ఞానము సంపాదించును
నా వ్యాఖ్య: తాత్కాలిక, స్వల్పకాలిక విషయాల మీద దృష్టిపెట్టేవారికన్నా దీర్ఘకాలిక ప్రణాళికల మీద, సర్వోన్నత శక్తి ఆధారంగా దక్కిన జ్ఞానమునుపయోగించి దృష్టిని పెట్టేవారికి మోక్షము తప్పక దక్కుతుంది. ( ఇక్కడ మోక్షమంటే అజ్ఞానము నుండి విముక్తి అని గ్రహించాలి)
పదిహేనవ మంత్రము:
హిరణ్మయేవ పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం
తత్ త్వాం పూషన్నపావౄణు సత్య ధర్మాయ దృష్టయే
భావము: ఓ దేవా! నీ ముఖమును కప్పుతున్న ఆ దివ్యకాంతిని తొలగించి నీ భక్తునికి ఆ ముఖమును దర్శించు భాగ్యం కల్పించుము.
నా వ్యాఖ్య: ఇక్కడ ప్రార్ధన మొదలవుతుంది. ఈ స్లోకానికి సంబంధించి నేననుకుంటోంది మాత్రం, భగవంతుని చుట్టూ, లేక ఒక జ్ఞాని చుట్టూ ఒక దివ్యమైన వర్చస్సు ఉంటుందని.
పదహారవ మంత్రము:
పూసన్నేకర్షే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహ రస్మీణ్ సమూహ
తేజో యత్ తే రూపం కల్యాణతం తత్ తే పరిష్యామి యో సావసౌ పురుష: సోహమస్మి
భావము: ఓ సర్వోత్తమా, నీ బలమైన కాంతి పుంజాలని తొలగించి నీ ద్రశన భాగ్యం ప్రసాదించు. సూర్యునికి కిరణము వలే నన్ను నీలో భాగం చేసుకో
వ్యాఖ్య: భగవంతునికీ భక్తునికీం, లేక శక్తికీ, ఆ శక్తి నియంత్రించే జీవికీ గల అవినాభావ సంబంధాన్ని తెలియజేస్తుందీ మంత్రము.
పదిహేడవ మంత్రము:
వాయురనిలమమృతంథేదం భస్మాంతం శరీరం
ఓం కృతో స్మర కృతం స్మర కృతో స్మర కృతం స్మర
భావము: నా శరీరము బూడిదవ్వనీ, నా ప్రాణములు గాలిలో కలిసిపోనీ, కానీ నేను చేసిన పనులను గుర్తించుము
వ్యాఖ్య: మన పూర్వీకులు ఇప్పుడు మన కళ్ళెదుట లేకపోయినా వారు మనకు చేసిన మేలు ఎప్పటికీ మరువకూడదని ఈ మంత్రం అంత్రర్లీనంగా చ్పెతోందని నా ఉద్దేశ్యం
పధ్ధెనిమిదవ మంత్రము:
అగ్నే నయ సుపథా రాయె అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్
యుయోధ్యస్మజ్జుహురణమెనో భూయిష్టం తేనమౌక్తిం విధేమ
భావము: ఓ భగవంతుడా, నీకు నా నమస్సులు. నా తరువాతి ప్రయాణానికి సరియైన దారి చూపుము. నేను చేసిన కర్మలు నీకు విదితమేగాన, నా తప్పులను క్షమించి వాటి ద్వారా వచ్చు అవాంతరములను తొలగించి నీవు చూపిన దారిలో నేణు నడిచేలా చేయుము
నా వ్యాఖ్య: దేవుడిని/శక్తిని, లేక గురువుని దారి చూపమనే అభ్యర్ధన ఈ శ్లోకపు తాత్పర్యం. చేసిన తప్పులు దిద్దుకునే అవకాశం కల్పించమనే అభ్యర్ధన కూడా అంతర్లీనంగా కనిపిస్తోంది.
...... The End ........
Wow... ఈ టపా రాసింది రౌడీ గారేనా? :-)
రిప్లయితొలగించండిమీలో నాకు ఇప్పటి దాకా తెలియని మరో కోణాన్ని చూపించారు. Hats to your effort. Expect these kind of posts from you occasionally.
అయ్య బాబోయ్ ..............టర్కీ రాజ్యం hack అయి పోనాద ఏటి??????
రిప్లయితొలగించండిమీ "ఈశోపనిషద్ - My interpretation" పోస్ట్‌పై రవిచంద్ర క్రొత్త వ్యాఖ్యను ఉంచారు:
రిప్లయితొలగించండిWow... ఈ టపా రాసింది రౌడీ గారేనా? :-)
మీలో నాకు ఇప్పటి దాకా తెలియని మరో కోణాన్ని చూపించారు. Hats to your effort. Expect these kind of posts from you occasionally.
____________________________________
మీ "ఈశోపనిషద్ - My interpretation" పోస్ట్‌పై KAMAL క్రొత్త వ్యాఖ్యను ఉంచారు:
అయ్య బాబోయ్ ..............టర్కీ రాజ్యం hack అయి పోనాద ఏటి??????
Thx Ravichandra garu. For the first time in life I got a chance to read Vedam at a temple here (Not alone - I cant - but in the company of two scholars) and this is the result of that excitement too!
రిప్లయితొలగించండిHehe Kamal .. its not hacked .. YET :))
రిప్లయితొలగించండిvedalanu kooda vadala ra ani doubt tho vachaa ... good bagaa chepparu.
రిప్లయితొలగించండిpl share more
Nice post Bro! Very informative :)
రిప్లయితొలగించండిThanks for sharing the post. Its very nice to see this philosophical angle of yours...wondering what will be your book title if at all you write a book on Philosophy...
జల్లెడ లో కొత్త టపాల కోసం చూస్తోంటే మీ టపా కనపడింది.హెడ్డింగ్ ఇంట్రెస్టింగా అనిపించి రచయైత ఎవరా అని చూసా."రౌడీ" గారేనా అంటూ మళ్ళీ నిర్ధారణ చేసుకుని :) టపా చదవటం మొదలెట్టా.బాగుందండీ.సాయి సచ్చరిత్ర లో ఈ ఉపనిషత్ ప్రస్తావన ఉంటుంది.అది చదివినప్పుడల్లా అనిపించేది,ఈ వేదాలు,ఉపనిషత్ లు దొరకవేమో నెట్ లో అని.మొత్తానికి ఇక్కడ దొరికింది మొదటిది.
రిప్లయితొలగించండిఅనువాదానికి ధన్యవాదాలండీ
జల్లెడ లో కొత్త టపాల కోసం చూస్తోంటే మీ టపా కనపడింది.హెడ్డింగ్ ఇంట్రెస్టింగా అనిపించి రచయైత ఎవరా అని చూసా."రౌడీ" గారేనా అంటూ మళ్ళీ నిర్ధారణ చేసుకుని :) టపా చదవటం మొదలెట్టా.బాగుందండీ.సాయి సచ్చరిత్ర లో ఈ ఉపనిషత్ ప్రస్తావన ఉంటుంది.అది చదివినప్పుడల్లా అనిపించేది,ఈ వేదాలు,ఉపనిషత్ లు దొరకవేమో నెట్ లో అని.మొత్తానికి ఇక్కడ దొరికింది మొదటిది.
రిప్లయితొలగించండిఅనువాదానికి ధన్యవాదాలండీ
hey malak,
రిప్లయితొలగించండిMy respect for you took another leap northwards.
Really awesome... after seeing this i'm planning to write about some profound knowledge which i happen to study few months ago..
once agains, thanks for sharing this..
-Karthik
సంభవామి యుగే యుగే
రిప్లయితొలగించండిnaa comment enduku kanipinchatam ledu??
రిప్లయితొలగించండిధన్యవాదాలు!! చక్కగా విశదీకరించారు అనుకుంటున్నాను.
రిప్లయితొలగించండిదయ్యాలు వేదాలు వల్లిస్తాయేమో , కానీ రౌడీలు కూడానా?
రిప్లయితొలగించండి'నహీ భాంజయ్ యే తుమే కదాపి శోభా నహీ దేతా .. ' :))
వీర భక్త బ్లాగర్ల ఇంప్రెషన్ ప్రాప్తి రస్థుః |
గత పది రోజులుగా ఏ బ్లాగులోను అజ్ఞాత కామెంట్లు, వంకర గొడవలు లేవు నిన్న సాయంత్రం నుండి మళ్లీ మొదలయ్యాయి . వెకేషన్ కి వెళ్ళిన ఏ దరిద్రమో తిరిగి వచ్చినట్టు ఉంది.
రిప్లయితొలగించండిమొదటి అజ్ఞాత గారూ..
రిప్లయితొలగించండిమలక్ ఎప్పుడు టపా రాస్తాడా నువ్వేప్పుడొస్తావా అని నేను తెగ వెయిటింగ్..రానే వచ్చేశావ్.. గుడ్.
నీ తరఫున నేనే ఒక కామెంట్ రాస్తున్నా చదివి తరించు:
ఓయ్ మలక్, మీ కెలుకుడోళ్ళున్నారే ఎప్పుడు ఎప్పుడూ మా తిక్కోళ్ళని అర్థం చేసుకోలేరు.. కానీ ఒకటి మాత్రం నిజం.. నువ్వూ నీ వేదాలు.. నీ ఉపనిషత్తులు ..నీ ప్రామాదవనం, ఈ మాలిక .. మీరందరూ కలిసినా కూడా మేము బ్లాగు రాయకుండా ఆపలేరు..
అసలు నువ్వు ప్రమాదవనం లో వెక్కిరించినప్పుడే రాయి పెట్టి కొడదామనుకున్నా(కంప్యూటర్ లో నీ ప్రొఫైల్ ను) కానీ నా ఫైర్ వాల్స్ అడ్డం వచ్చాయి.. ఇప్పుడు కొడదామంటే నా ఇంటర్నెట్ అడ్డం వచ్చింది(బిల్ కట్టలేదు మరి)..
ఆర్యా! భరద్వాజా! అభినందనలు.
రిప్లయితొలగించండివేదమెఱుంగనుంట; నిరు పేదల సేవలు చేయనుంట; యా
వేదన మీకె యుంట సబువే.ధనధాన్యములిచ్చుటౌను యీ
వేద మెఱుంగ చెప్పుటది. విజ్ఞతఁ జూపినవేద మూర్తివా?
నాదు శుభాభినందనలు.నాయెడ సత్కృపతోడఁ జూడుమా!
Thank you all!
రిప్లయితొలగించండిఅద్భుతం
రిప్లయితొలగించండిజీవిత సత్యాలని తెలిపినందుకు నెనర్లు
నా వ్యాఖ్య: అంటే, మనకి కావసినదానినే మనము గ్రహించి, మనకి ఉద్దేశింపబడినదానినే మనము తీసుకొని తక్కినవాటిని ఇతరులకి వదిలివెయ్యాలని, మరో విధంగా చెప్పాలంటే ఈ విశ్వం అనే ఆస్థిని విశ్వంలో ఉన్న రాశులన్నీ పంచుకోవాలని దీనర్ధం. వేదాలని వెక్కిరించే కమ్యూనిష్టులు చెప్పేది కూడా ఇదే కదా!
రిప్లయితొలగించండిభరధ్వాజ్ గారూ చెప్పినవేవీ జరగకపోబట్టే కదా వానికి మరల వ్యాఖ్యానాల పేరుతోనో, సంగ్రహాల పేరుతోనో ప్రజలకు బోధించడానికి నాటి జ్నానులు ప్రయత్నించారు. ఎవరైనా కోరుకునేది సర్వమానవాళి సుభిక్షంగా వుండాలనే. కానీ అది జరగకపోవడంతోనే మరల మానవుడు తనదైన బాటలో ప్రయత్నిస్తాడు. వేదాలని వెక్కిరించారనుకోవడంలేదు. దానిని సాకుగా చూపి, వాటికి విపరీతార్థాలతో జనాన్ని మూఢనమ్మకాలలో వుంచి పబ్బం గడుపుకుంటున్న దోపిడీదారులకు వ్యతిరేకంగానే మాటాడుతారు. వేదాలను అనుసరిస్తూన్నామని చెప్పుతూ విపరీత యాగాలతో ఆనాటి పశుసంపదను, ధనాన్ని వెచ్చిస్తున్న దానికి వ్యతిరేకంగానే సిద్దార్థుడు ఉద్యమించిన విషయం దాచలేరు. జ్నానం ఎవరి సొంతం కాదు, అది అందరిదీ అని ప్రకటించినది బౌద్ధం. దానిపై తీవ్రస్తాయిలో నాటి నుండి మతవాదులు దాడి చేస్తూనే వున్నారు.
మీ వ్యాఖ్యానాలన్ని బానే వున్నాయి. విగ్రహారాధన ఖండన కూడా మీ 8, 12 వ్యాఖ్యాలలో వున్నాయి. మరి అది ప్రచారం కాబడలేదు కదా? రాజుకు అనుకూలంగా పూజారులు ప్రవర్తించి జనాన్ని అజ్నానంలో వుంచడానికి మతాన్ని వాడుకున్నారు. కాదంటారా?
Excellent Post !!!
రిప్లయితొలగించండిమాలాంటి వాళ్ళకొసం అప్పుడప్పుడు ఇలాంటి పొస్ట్లు రాస్తు వుండు మలక్..
కార్తీక్ మరియు ఆపైనున్న ఏడ్పు-అజ్ఞాత (బ్లాగుల్లో 'పొగడా పూవు లాంటి వారు) గార్లు మీ వ్యాఖ్యలకు భయపడ్డామండి. మీకు అంత సమర్థర వున్నా అలా సాఫ్ట్వేర్ కూలిగా బెంచులమీద వుండటం కన్నా ఓ బిల్ గేట్స్ అయిపోవచ్చు కదూ. అజ్ఞాతలను రమ్మంటారు , వాళ్ళొస్తే ఇలా ఏడుస్తారు. ప్రతి ఒక్కదానికీ, ఎప్పుడూ ' జయహో , జయహో ' అండానికి కుదరదండి. అజ్ఞాతలన్నాక కాస్త బరువుభాద్యతలుంటాయి. అలా జై కొడుతూ పోతే మీకు మాకు తేడా ఏముంటుంది, చెప్పండి? నేనెక్కడా బూతులు రాయలేదు, రాయడానికి మేము సిద్ధాంత రీత్యావ్యతిరేకులము, కూడా.
రిప్లయితొలగించండిఅజ్ఞాతల ఆప్షన్ బంద్ చేసి కంబళి కవచంలా చుట్టుకుని రాసుకోండి, ఇక్కడ చాలా మంది అలానే చేస్తున్నారుగా. ఆ కామెంట్ సరదాగా చేసినదని మీలా తెలుసుకోలేనంత దద్దమ్మ కాదు ఈ భరద్వాజ అని విశ్వసితున్నాను. భరద్వాజ గారు నన్ను తన బ్లాగ్ లో కామెంట్ చేయొద్దంటే ఇదో ఇదే నా ఆకరి కామెంట్. ఇదో ' మహిష ' బ్లాగు అనుకుని అసలు రాను, కాని మీరు , ఆ పొగడపూవు గారు ఇకేప్పుడూ ఏడవనని మాటివ్వాలి. మీ కామెంట్లు నాకు కాస్త ఎంజాయ్ చేశాను సుమా ..
ఆధ్యాత్మిక శిఖరాల్ని చూపించారు. నెనరులు.
రిప్లయితొలగించండిఇంతింతై వటుడింతై ఎంతెంతో అయి ఇంకెంతో అయి..."తమ్ముడూ భరద్వాజా అదీ సంగతి"
రిప్లయితొలగించండిఇకపోతే "పదవ అమంత్రం" ఇది కొంచం సరిచేస్తే బాగుంటుందేమో మరి ఏమంటావు.
భరద్వాజ గారు: చాలా చక్కని వ్యాఖ్యలతో ఎంతో అందమైన ఈశావాస్యాన్ని అందంగా చెప్పారు. చాలా బాగుంది.
రిప్లయితొలగించండి>>బెంచులమీద వుండటం కన్నా ఓ బిల్ గేట్స్ అయిపోవచ్చు కదూ.
రిప్లయితొలగించండిముందుగా నేనసలు బెంచి మీద లేను.. మా ఆఫీసులో కావలసిన్నని కుర్చీలు ఉన్నాయి.. పాపం నువ్వేదో మా మీద జాలిపడుతున్నావ్ కదా.. నీక్కావాలంటే ఒక ముక్కాలిపీట పంపగలను..
ఇక బిల్ గేట్స్ గా మేమెలాగూ అవుతాం, అప్పుడు మా ఆఫీసులో కప్పులు కడిగే బాధ్యత నీకే ఇస్తాం.. త్వరగా అప్లికేషన్ పెట్టుకో.. అజ్ఞాతవు కదా ముసుగేసుకుని కప్పులు కడిగినా మేము పెద్ద పట్టించుకోం..
>>అజ్ఞాతలన్నాక కాస్త బరువుభాద్యతలుంటాయి
పాపం బరువుబాధ్యతలు మోసి మోసి అలసిపొయినట్టునావ్.. కొంచెం ఫినాయిల్ తాగి విశ్రాంతి తీసుకో...
>>అజ్ఞాతలను రమ్మంటారు , వాళ్ళొస్తే ఇలా ఏడుస్తారు
మేమిడిస్తే అన్నా మీ parasites హ్యాపిగా ఉంటారని అంతే..
>>నేనెక్కడా బూతులు రాయలేదు, రాయడానికి మేము సిద్ధాంత రీత్యావ్యతిరేకులము, కూడా..
పేరు చెప్పుకోను దిక్కులేదు.. నీకింత స్టేట్ మెంట్లు అవసరమా??
>>ఆ కామెంట్ సరదాగా చేసినదని మీలా తెలుసుకోలేనంత దద్దమ్మ కాదు ఈ భరద్వాజ అని విశ్వసితున్నాను.
ఈ కామెంటే కాదు నువ్వు చేసే అన్ని కామెంట్లు చాలా సరదాగా మాకెంతో ఉల్లాసాన్ని కలిగిస్తాయి..నీ మీద ఒట్టు..
>>ఇదో ' మహిష ' బ్లాగు అనుకుని అసలు రాను.
అంతపని చెయ్యొద్దు.. ఇక్కడ కాకపోతే నా బ్లాగుకు వచ్చెయ్.. నీలాంటి సూకరాలు బ్లాగుల్లో లేక పోతే కామెడీ చేసేదెవరు??
>>మీ కామెంట్లు నాకు కాస్త ఎంజాయ్ చేశాను సుమా ..
మా కామెంట్లు విని కాస్తే ఎంజాయ్ చేశావ్.. మేమైతే నీ అన్ని కామెంట్లు చూస్తూ పిచ్చ పిచ్చ గా ఎంజాయ్ చేస్తున్నాము.. నువ్వు అసలు తగ్గద్దు..
-కార్తీక్
అన్నట్టు అజ్ఞాత, ప్రతీ చోటా 'మేము ' 'మేము ' అంటున్నావ్.. అఖిలభారత అజ్ఞానుల సారీ అజ్ఞాతల సంఘం మొదలుపెట్టావా??
రిప్లయితొలగించండిఈ టపా లో కూడా లొల్లి స్టార్ట్ ఐందా ??
రిప్లయితొలగించండిThanks everyone and guys, cool down. Dont get too personal at eachother.
రిప్లయితొలగించండిఉపనిషత్తు పరిచయం బాగుంది. కాకపోతె రాసిన వారి ఉద్దేశ్యం కంటె, ఒక్కోసారి గూడార్ధాలు వెతికే పనిలో ఇంకా గొప్ప అర్ధాలు మనం ఆపాదించేస్తూ వుంటాము. నోస్ట్రడామస్ కాల జ్ఞానం లా!అతను రాద్దామనుకున్నది వేరు, ఇప్పుడు జనాలు అర్ధం చేసుకున్నది వేరు. ఇంత మంచి చెప్పిన వేదాలు ఉపనిషత్తులని, జనాలు ఇన్నాళ్లుగా అపార్ధమే చేసుకున్నారా?అందుకనే అన్ని పనులు సమానం కాదు అని, ఆ పనులు చేసెవారు సమానం కాదు అని, సమానం కంటె తక్కువ స్థాయి వారు వీటిని చదవకూడదని ఆ వేదాలు ఉపనిషత్తులు చదివిన వారు ఆంక్షలు విధించి సమాజాన్ని విడగొట్టారా?పోనిలెండి ఇప్పటికి అన్నా తప్పులు సరిదిద్దుకంటున్నందుకు నాకు హిందు సంప్రదాయం పై మిగిలిన మతాల కన్నా మంచి అభిప్రాయమే వుంది.
రిప్లయితొలగించండిఒక వినతి: వాదన వేడిగా వున్నప్పుడు పదాల ఎంపిక చాలా ఆలోచించి చెయ్యాలి.
OOPS my earlier comment disappeared
రిప్లయితొలగించండిఇది వ్రాసిన వారి ఉద్దేశ్యం నిరూపించడం కష్టమే, కానీ అన్నిటినీ కలిపి చదివితే అంతా మంచికే అని అర్ధం చేసుకోడానికి ఎక్కువకాలం పట్టదు.
ఇప్పటి పరిస్థితులని అప్పటికి అన్వయిస్తే మిగిలేది గందరగోళమే. మను స్మృతికి చాలాకాలం ముందునుండే వేదాలున్నాయి. కులాల గీతలని దాట(లే)ని వారు దాన్ని గుర్తించలేరు కదా.
ఎందుకంటే చాలాకాలం పాటు ఇవి వ్రాయబడలేదు. శృతికి కొన్ని వేల ఏళ్ళ తరవాత ఇవి వ్రాయబడ్డాయి.
ఉపనిషత్తులు చదివినవారు ఏవో తప్పులు చేస్తే అది ఉపనిషత్తుల తప్పా? ఈ వాదన ఎలా ఉందంటే రాజ్యాంగం చదివిన వారు నేరాలు చేశారు కాబట్టీ రాజ్యాంగాన్ని నిషేధించాలని.
+2 చదివిన వారు తప్ప మిగిలినవారు మేదిసిన్ / ఇంజనీరింగ్ చదవకూడని ఇప్పుడు కూడా నియమాలున్నాయి - ఎందుకంటే ఆ స్థాయి జ్ఞానం ఉంటే తప్పా ఆ పై స్థాయి వాటిని అర్ధం చేసుకోలేరని. అలాగే సరైన జ్ఞానం అలవరచుకోనివారు
రిప్లయితొలగించండిఒకరిద్దరు తప్పుగా అర్ధం చేసుకున్నా, సరిగా అర్ధం చేసుకుని పాటించక పోయినా పరవాలేదండీ.కాని వీటిని చదివి అర్ధం చేసుకున్నామనుకుని సరిగా పాటించని ఒక సమూహం వలన వాటి గొప్పదనానికే చేటు కలిగింది.ఇలాగే మిగిలిన మతాల విషయంలో కూడా జరిగిందనుకుంటాను.అన్ని మతాలు కూడా మంచినే చెప్పాయి.మనుషులని కలుపుదామనే సమూహాలు కట్టాయి.కాని తమది అనుకున్న సమూహం, ఆ బిలాంగింగ్ నెస్ వలన మరో సమూహం కన్నా గొప్పది అన్న ఫీలింగ్ రావడం సహజం.మతమే కాదు, మా దేశం గొప్ప, మా భాష గొప్ప, మా ప్రాంతం గొప్ప ఇలా మనుషులని కలపవలిసిన విషయాలు, వారిని విడగొడతున్నాయి.వీటికి అతీతంగా అందరు కలసి ఏర్పరిచవలసిన సమూహం "మానవత్వం".అది లేనపుడూ మనిషి మృగం కన్నా గొప్ప కాదు.
రిప్లయితొలగించండివీటికి అతీతంగా అందరు కలసి ఏర్పరిచవలసిన సమూహం "మానవత్వం".అది లేనపుడూ మనిషి మృగం కన్నా గొప్ప కాదు.
రిప్లయితొలగించండి__________________________________
EXACTLY, I agree 100%, rather 200% with you.
thanks for agreeing with me.
రిప్లయితొలగించండిఆ శరత్ గారు ఈ టపా మొహం అయినా చూసుండడు... ఇలాంటి టపాలని పుస్తకం లలా అచ్చు వేయించండి వంద డాలర్ లైనా పెట్టి కొంటాం.... పని పాట లేని వాళ్ళు పిల్లి బొచ్చు గీకటం ఎలా అనేవాటిపై పుస్తకాలు వ్రాస్తే ఎవరు కొంటారు.... మీ లాంటి వేదపారాయణులు తప్ప (అంటే మిమ్మల్ని ఆ పుస్తకం ఏమీ చేయలేదు కదా... అంటే చేయలేకపోవచ్చు కదా )
రిప్లయితొలగించండి@ gush kgnugaaa
రిప్లయితొలగించండిమీ వల్ల ఈ టపా చూసాను. ఇవన్నీ మనకెక్కవులే బ్రదర్. అరవైలో ఆలోచిస్తా వేదాల గురించి - పదహారేళ్ళ కుర్రాడిని - ఇవన్నీ నాకెందుకు ఇప్పుడు చెప్పండి :)
ఒక పక్క బాలయ్యా, ఇంకొ పక్క పిలాసపీ!!
రిప్లయితొలగించండిమాంచి తెలుగు సినెమాలో ట్విస్ట్ లా వున్నాయి మీ టపాలు ;)
Here are couple of quick pedantic thoughts for our learning.
(Disclaimer: ఏకం సత్! విప్రా బహుదా వదంతి = Truth is unique. People may interpret it differently)
1. మొత్తం 200 కంటే ఎక్కువ ఉపనిషత్తులు వున్నాయి (including the 'alla upanishad' written during Akbar's time. వీటిలో, 108 ఉపనిషత్తుల పేర్లు ముక్తికోపనిషత్తు లో వున్నయి
2. ఈ 108 లో, శంకరాచార్యుల వారు భష్యం రాసిన 10 (not 11) ముఖ్యమైనవి గా వాడుకలో వున్నాయి
3. ఉపనిషత్తులు వేదం కాదు. ఇవి వేదంలో చెప్పిన అంశాలను ప్రశ్నిస్తాయి (ఎందుకు + ఎమిటి + ఎలా). కాలక్రమేణా ఇవి వేదానికి చివరలో (వేద + అంతం) చేర్చబడ్డాయి
4. ఈశోపనిత్తు is the epitome of Hindu way of life.
It indeed is the essence of All the Upanishads.
In turn, Its first stanza is the essence of this upanishad itself
ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ = Everything that we see is a manifestation of God. There is nothing around us, which is not a manifestation of god.
తేన త్యక్తేన భుంజితా = Enjoy your life by not getting attached to it
మా గృధ: కస్య స్విద్ ధనం = Dont snatch others' money/joy/life...dont attach to yourself in the first place, then what the point in snatching someone else'
5. వేదాంతం అంటే వైరాగ్యం కాదు. (Sarat Kaalam, pl. see). The second stanza says that:
జిజీవి షేచ్చతంసమా = Do your work and live life to the fullest! all the 100 years!
more later.
ఓం పూర్ణమద: పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావిశిష్యతే!
ఉపనిషత్తులు వేదం కాదు.
రిప్లయితొలగించండి______________________
Thats what I meant -
ఈ వేదాల గమ్యాలు వేదాంతాలు, లేక ఉపనిషత్తులు.
10 (not 11)
___________
1. Aitareya (ṚV)
2. Brihadaranyaka
3. Taittiriya
4. Chandogya
5. Kena
6. Prasna
7. Isa
8. swetaswaatara
9. Kathaa
10. Mundaka
11. Mandukya
Disclaimer: ఈ విషయాలలో నేను కూడా విద్యార్థినే. అందువల్ల నా వ్యాఖ్యని ప్రామాణికం గా తీసుకొనక్కరలేదు.
రిప్లయితొలగించండిsome more thoughts:
i think, Shankaracharya has not written explanation to "swetaswaatara" . And thus 10.
Next, In your interpretation, you used
అవిద్య = అజ్ఞానం
విద్య = జ్ఞానం
next time when you read, try the other school of interpretation as follows:
అవిద్య = knowledge of earthly things, (tasks, activities as preached by Vedas - యజ్ఞ యాగాలు etc.)
విద్య = knowing purpose of life, knowledge of "beyond life" (పర బ్రహ్మం, బ్రహ్మ పదార్థం ) etc..
Now the verses will convey:
a. అవిద్య (Doing Karma) takes you into darkness. You dont know why/what you are doing etc..
b. leaving Karma & just thinking about Jnana (విద్య) is even more worse. You are just not doing your duties and above that just thinking & preaching about the invisible. You are worse than the Doer.
(its like, నేను నా బ్లాగు రాసుకోకుండా, ఇక్కడ కామెంట్లు రాయడం లాంటి పనులన్నమాట ;) )
Then the conclusion is, "Do Karma + Get to know the purpose of doing that karma(Jnana)"
That leads a person towards a refined lifestyle
చివరగా, నాందీ శ్లోకం గురించి:
ఓం పూర్ణమద: పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చ్యతే
This sets the tone of all that we discussed. Earlier in 1st verse we said, the whole universe is the manifestation of God.
పూర్ణమద: = That (God) is complete
పూర్ణమిదం = This (universe & each entity in universe - which are manifestation of god) is also complete
పూర్ణాత్ పూర్ణముదచ్చ్యతే = This Universe has come out of that God
But, when universe is taken out of god, then wont the god component come down (simple arithmetic)
We say No! పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావిశిష్యతే
It is the concept of Microcosm & Macrocosm
అద్బుతంగా రాసారు సర్ ......మనస్పూర్తిగా వందనాలు
రిప్లయితొలగించండి