9, జూన్ 2011, గురువారం

అంతా గూగుల్ బజ్ మాయ!







మొన్న ఎవరి బజ్ లోనో కుమార్ పెట్టిన కామెంట్ చూసి ఇది రాయాలనిపించింది.

ఈ మధ్య గూగుల్ బజ్ కి పట్టుకున్న జబ్బు - చెప్పా పెట్టాకుండా కొందరి కామెంట్లు మాయం చేసి స్పేం లోకి తోసెయ్యటం. ఒక చర్చలో కొందరి కామెంట్లు ఎగిరిపోయి కొందరివి మిగిలితే ఎలా ఉంటుందనే ఊహాజనిత టపా ఇది.

ముందుగా బులుసు గారు పెట్టిన పోస్టు, దానికి మార్తాండ సమాధానం, బద్రీ ప్రత్యుత్తరం


***************************************************************************************


బులుసు - ఎం ఎఫ్ హుస్సైన్ మరణం

మార్తాండ -ఇండియా సెక్యులర్ దేశం కాదు.

బద్రీ - ఒరే బాబూ, కాస్త అర్థమయ్యేలా కామెంట్ ఎప్పుడు పెడతావురా తండ్రీ?

మార్తాండ - నేను కూడా ప్రశ్నలడగగలను. బులుసుగారి కామెంట్ అర్థమయ్యేలా ఉందా?

బులుసు - ఎక్కడ అర్థమయ్యేలా లేదో కాస్త చెప్తారా?

బద్రీ - నీ బొంద. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదురా పిచ్చికుంకా.

బులుసు - ఎక్కడ అర్థం అవ్వలేదో చెప్పండి మారుస్తా

మార్తాండ - అడిగినదానికి సమాధానం చెప్పు. బులుసు గారి కామెంట్ కూడా అర్థం కావట్లేదు. నా ప్రశ్న మార్చా. చివర "?" పెట్టా.

బద్రీ - ఆపెహే నీ గోల. నువ్వు మార్చినా మార్చకపోయినా ఎవడికీ వచ్చిన నష్టం లేదు.




**** కార్తీక్ & రాజ్ కుమార్ జాయిన్ అవుతారు ****




కార్తీక్: మార్తాండా నీకు పిచ్చి ముదిరింది

రాజ్ కుమార్: పిచ్చి బాగా ముదిరింది. సిగ్గుండాలి అలాంటి సంబంధంలేని మేసేజెస్ పెట్టడానికి

బులుసు: నేను అన్నది జస్ట్ హుసేన్ మరణం అని. ఇంత గొడవ జరుగుతుందనుకోలేదు

మార్తాండ: గొడవ చేసింది నేను కాదు. బద్రీ.

రాజ్ కుమార్: నోరు ముయ్యెహే! నువ్వు పెట్టిన ఒక్క కామెంట్ చాలు గొడవ లేవదియ్యడానికి. సిగ్గుండాలి.

మార్తాండ: సిగ్గులేనిదెవరికీ నాకా?

బులుసు: ఛస్! నాకే సిగ్గులేదు. నిజంగానే సిగ్గులేదు.

కార్తీక్: అయ్యో బులుసుగారూ, వీళ్ళు తిడుతోంది మార్తాండనండీ.

మార్తాండ: బులుసుగారూ, వీళ్ళు తిట్టింది నన్ను.

బద్రీ: ఆ మాత్రం అర్థమయ్యింది కదా ఇప్పటికి, ఇక ఇక్కడనుండి బయటకు తగలడు.

బులుసు: అవునండీ అర్థమయ్యింది. ఇక ఈ బజ్ కి కామెంట్లు క్లోస్ చేస్తున్నా!


X Bulusu has disabled comments on this post


****************************************************************************************************



జరిగిన గొడవ అదీ:

ఇప్పుడు బజ్ పుణ్యమా అని ఉన్నట్టుండి మార్తాండవి కార్తీకువీ కామెంట్లు మాయం అయిపోయాయనుకోండి. పర్తిస్థితి ఏమిటి? మీరే చూడండి :)






******************************************************************************************************






బులుసు - ఎం ఎఫ్ హుస్సైన్ మరణం



బద్రీ - ఒరే బాబూ, కాస్త అర్థమయ్యేలా కామెంట్ ఎప్పుడు పెడతావురా తండ్రీ?


బులుసు - ఎక్కడ అర్థమయ్యేలా లేదో కాస్త చెప్తారా?


బద్రీ - నీ బొంద. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదురా పిచ్చికుంకా.



బులుసు - ఎక్కడ అర్థం అవ్వలేదో చెప్పండి మారుస్తా


బద్రీ - ఆపెహే నీ గోల. నువ్వు మార్చినా మార్చకపోయినా ఎవడికీ వచ్చిన నష్టం లేదు.




**** కార్తీక్ & రాజ్ కుమార్ జాయిన్ అవుతారు ****






రాజ్ కుమార్: పిచ్చి బాగా ముదిరింది. సిగ్గుండాలి అలాంటి సంబంధంలేని మేసేజెస్ పెట్టడానికి


బులుసు: నేను అన్నది జస్ట్ హుసేన్ మరణం అని. ఇంత గొడవ జరుగుతుందనుకోలేదు



రాజ్ కుమార్: నోరు ముయ్యెహే! నువ్వు పెట్టిన ఒక్క కామెంట్ చాలు గొడవ లేవదియ్యడానికి. సిగ్గుండాలి.


బులుసు: ఛస్! నాకే సిగ్గులేదు. నిజంగానే సిగ్గులేదు.


బద్రీ: ఆ మాత్రం అర్థమయ్యింది కదా ఇప్పటికి, ఇక ఇక్కడనుండి బయటకు తగలడు.


బులుసు: అవునండీ అర్థమయ్యింది. ఇక ఈ బజ్ కి కామెంట్లు క్లోస్ చేస్తున్నా!




X Bulusu has disabled comments on this post


********************************************************************

15 కామెంట్‌లు:

  1. ROFL!!
    పొద్దున్నే ఇంతగా నవ్వించి చంపడం మీకు భావ్యం కాదు మలకన్నా.. హహహ.. ఎలా వస్తాయి బాబూ మీకు ఈ అవిడియాలు.. you just rock!!

    రిప్లయితొలగించండి
  2. >>బులుసు: ఛస్! నాకే సిగ్గులేదు. నిజంగానే సిగ్గులేదు.
    పాపం బులుసు గారు.. :D
    అసలు బులుసేరియా అని నేను ఒక టపా రాద్దామనుకుంటున్నా.. అందులో బులుసు గారి వల్ల నేను పడ్డ కష్టాలు వివరిస్తా.. వచ్చే వారం లో రాస్తా..

    రిప్లయితొలగించండి
  3. పాపమండీ మధ్యలో బులుసుగారు బలైపోయారు.

    రిప్లయితొలగించండి
  4. సరదాగా వ్రాసిందండీ. ఆయన నొచ్చుకోరనే అనుకుంటున్నా, క్షమాపణలతో.

    రిప్లయితొలగించండి
  5. u should have written it in reverse.. then everyone will surprise at marthanda's superb entry like of dinakar.

    రిప్లయితొలగించండి
  6. u should have written it in reverse
    ____________________________________

    This is a greeeeeat idea. Why didnt it strike me?

    రిప్లయితొలగించండి
  7. వ్యాఖ్యను పోస్ట్ చేయండి అని ఉంటే చెయ్యాలా, చస్ నాకు బుద్ధిలేదు.

    >>>సరదాగా వ్రాసిందండీ. ఆయన నొచ్చుకోరనే అనుకుంటున్నా, క్షమాపణలతో.
    ఈ కామెంటు కష్టం కలిగించింది. గీత దాటనంత కాలం , నవ్వుకోవడానికి తరతమ బేధాలు ఉండకూడదు అని నమ్మిన వాడిని. నామీద జోకుకి నేనే ఘట్టిగా నవ్వుతాను. ఇందులో క్షమాపణల ప్రసక్తి లేదు. ఉండకూడదు.

    రిప్లయితొలగించండి
  8. పాపం బులుసు గారిని ఇలా బలిచేసారా?
    కథలో కార్తీక్ ఎంటర్ అవ్వక పోయినా కూడా సరిగానే ఉండేది :-))

    రిప్లయితొలగించండి
  9. హ హ హహ Crazy.........
    పాపం బులుసు గారిని బలి చేస్తావా..
    బులుసు గారూ, మీరు తగ్గొద్దు, మీ వెనక మేముంటాం, మీరీ భరద్వాజ్ మీద బదులు తీర్చుకోవాల్సిందే. బస్తీ మే సవాల్ :-))
    Power respects only Power, పోస్టుకి, పోస్టుతోనే సమానం.
    నడుం బిగించండి మరి. మార్తాండ క్లెవర్ గా తప్పుకుంటాడా మధ్యలో, హన్నా, వదలొద్దు.

    రిప్లయితొలగించండి
  10. గూగుల్ బజ్ మాయొక్కటే కాదు. కొంతమంది కామెంట్లు పెట్టిన తర్వాత, అవతలి వాళ్ళు కామెంట్లు పెట్టే లోపే ఎడిట్ చేసి, లేక వెనక్కెళ్ళీ డిలీట్ చేసి, అవతలి వాళ్ళని రాంగ్ ట్రాక్ లోకి కావాలని లీడ్ చేస్తున్నారు. తీరా అది చదివేవాళ్ళకి ఇదేమిటి ఒకవైపువాళ్ళేంటీ ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు అనే ఇంప్రెషన్ వచ్చేలా. అది గమనించి ఆ కామెంట్ పెట్టానా రోజు:-)

    రిప్లయితొలగించండి
  11. బజ్ మొదట్లో బాగుండేది
    చెప్పదలుచున్న విషయాన్ని సూటిగా రెండు ముక్కల్లో చెప్పడం , దానికోసం పోస్ట్ రాయకుండా క్లుప్తం గా చెప్పడం నాకు నచ్చేది ( అజ్నాతల గొడవలు ఉండవు )
    కాకపొతే ఈ కామెంట్స్ మిస్ అవడం వల్ల, రెండు రోజులు ( వీకెండ్ లలో ) బజ్ ఓపెన్ చేయక పోవడం వల్ల చూడాల్సిన బజ్ లు పెరిగి పోవడం , ఇంకా బోలుడన్ని కారణాల వల్ల బజ్ కి దూరం గా ఉన్నా కొంత కాలం
    కాకపొతే ఏదో మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ వల్ల అప్పుడప్పుడు బజ్ చూస్తున్నా
    కుమార్ గారు చెప్పినట్లు కొంత మంది కామెంట్స్ రాసి ఎడిట్ చేస్తున్నారు :(
    కొన్ని రోజుల క్రితం వేణు శ్రీకాంత్ గారు కప్పు మీద సినిమాలు అని బజ్ కొట్టారు , దానికి మలక్ గారి పేరడీలు చదివి పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వుకున్నాం మా స్నేహితులం

    రిప్లయితొలగించండి
  12. https://profiles.google.com/117385813833830611794/posts/dVU5EKsug63

    రిప్లయితొలగించండి