9, అక్టోబర్ 2018, మంగళవారం

హరిబాబు - చౌదరి - చిరంజీవి - వరుణ్ గార్లకు
అయ్యా సాములూ! మేమిక్కడ ఎవరిది తప్పో ఎవరిది కాదో జడ్జ్ చేసే పొసిషన్లో లేము. మీరేమి వ్రాసుకుంటారో మీ ఇష్టం. మీ పోట్లాటలు మీ ఇష్టం. (మాతో పోట్లాడితే అది వేరే సంగతి ... మేము హేపీగా దూరేస్తాం). మాకు సంబంధించినంత వరకూ మాలికలో ఏమి కనిపిస్తుందోనన్నదే విషయం. మీరు ఎప్పుడు ఎవరిని ఎలా తిట్టుకుంటారో మీ ఇష్టం. తిట్టడం, ఆ తిట్లు తియ్యకపోవడం - మీ బ్లాగుల వరకూ రెండూ తప్పులైనా అవ్వచ్చూ, కాకపోవచ్చూనూ - మాలికలో కనబడనంతసేపూ మాకేమీ ఇబ్బంది లేదు.
.
ఒక్క విషయం. బ్లాగుల్ని కాకుండా మనుషుల్ని బ్లాక్ చేసే ఉద్దేశ్యం మాకు లేదు,  ఆ అవసరం ఇకముందు కూడా రాకూడదనే కోరుకుంటున్నాం. దానికి మీ సహకారం కూడా కావాలి. దయచేసి మాకు కొన్నాళ్ళ గడువివ్వండి - ఆలోచించుకుని, లాంగ్ టెర్మ్ స్ట్రేటజీ అమలుపరచడానికి.  Meanwhile, please enjoy your blogging (or fighting, whatever!)
.