10, అక్టోబర్ 2009, శనివారం

ఇవాళ వ్రాయడానికి పెద్దగా ఏమీ లేదు. అందుకే మళ్ళీ ఓ 4 పాత పోస్టులు మీ మీదకి వదులుతున్నా :))

మొదటిది - ఫింగర్ ఎలెవెన్ "పేరలైజర్" రీమిక్స్. వాడిన ఇన్స్‌ట్రుమెంట్లు Korg Triton Extreme కీబోర్డ్, డబ్ల్యూకే 800 పియానో



పాటలు వాయించి వాయించి బోరు కొట్టి ఒకసారి మనమే పాడితే ఎలాఉంటుంది? జనాలని చంపచ్చుకదా అనే అలోచన వచ్చింది. పక్కనే మా ఆవిడకూడా ఉంది. సరే పాడేద్దామని డీసైడ్ చేసా. కాని రెగ్యులర్ పాటలు పాడితే వెరయిటీ ఉండడని, ఒక తెలుగు / ఇంగ్లీష్ పాట ("తమ్ముడు" లో "ట్రావలింగ్ సోల్జర్"), ఒక హిందీ పాట ("ప్రేం పూజారి" లో "రంగీలా రే") పాటలకి కలిపి కరియోకే ట్రేక్ తయారు చేశా. పాట మేమిద్దరం కలిపి పాడేసాం. రమణ గోగుల కంఠాన్ని ఇమిటేట్ చెయ్యాల్సొచ్చిందనుకోండీ అది వేరే సంగతి. కానీ ఇదో కామెడీ ఎక్స్పరిమెంట్ అయ్యింది :)) వాడీన ఇన్స్‌ట్రుమెంట్లు Korg Triton Extreme కీబోర్డ్, డబ్ల్యూకే 800 పియానో. Used the original videos






"నేను పాడను, బిసీ గా ఉన్నా" అని మా ఆవిడ మొత్తుకుంటున్నా సరే వినకుండా వెంటపడి, వేధించి కిచెన్ లో పాడీంచిన పాట ఇది :)) - "Aage bhi" from Waqt - వాడిన ఇన్స్‌ట్రుమెంట్లు Korg Triton Extreme Keyboards, డబ్ల్యూకే 800 పియానో. Used the original video








ఏకలింగం ఉద్దేశం ప్రకారం తెలుగు బ్లాగర్లని, ముఖ్యం గా మార్తాండని "బాబోయ్, పాటలా!" అని భయపడీ పారిపోయేళా చేసిన పేరడీ ఇది .. "టక్కరి దొంగ" లో "నలుగురికి నచ్చినది" పాటికి ఒక "పంది" పేరడీ. "నలుగురికీ నచ్చిన ఫుడ్ నాకసలే ఇక నచ్చదురో" - వాడిన ఇన్స్‌ట్రుమెంట్లు Korg Triton Extreme కీబోర్డ్, డబ్ల్యూకే 800 పియానో

1 కామెంట్‌: