17, అక్టోబర్ 2010, ఆదివారం

వడ్రంగిపిట్ట - చెవిలో పువ్వు

అబధ్ధాలు సృష్టించి రెండు ముడూ సార్లు వల్లెవేసి, అదే నిజమని నమ్మి పక్కవాడు కూడా నమ్మాలని గోల చేసేవాళ్ళు పాపం బ్లాగుల్లో ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు మన కత్తి వీక్షణ గేంగు, వడ్రంగి పిట్టలతో ఆ కొరత తీరింది.

ఆర్యులు బయటనుండి ఈ దేశంలోకి వచ్చేసి, ద్రవిడులని తన్ని తగిలేసి పండగలు చేసుకుటున్నారని ఈయన ఆరోపణ. రోమిలా థాపరే ఈ అబధ్ధాన్ని చెప్పి చెప్పి తీరా అది అబధ్ధమని నిరూపణ అయ్యాక ఏమి చెయ్యాలో తెలియక విలవిల్లాడుతోంది.

అది అబధ్ధాయినా ఫరవాలేదు దానివల్ల ఏదో తొక్కలో ఉద్యమం వచ్చేసిందోహో అదుకే అది నిజమని నమ్మేస్తానని మన మేధావి ఉవాచ.

మరి ఈ వడ్రంగి పిట్ట మన చెవులలో పువ్వులెందుకు పెడుతున్నాట్టూ? వీకు క్షణానికి పోటీ వద్దామనా? లేకపోతే వీకు, వీకెండుల మధ్య దూరదామనా??




ఈయన వ్రాసింది చూడండి

**************************************

వాళ్ళు ఈ భూభాగంపై ప్రవేశించే నాటికి ఇక్కడ నగరాలు నిర్మించబడి, నాగరికతతో, శతృ దుర్బేద్యంగా వున్న రాజ్యాలు విలసిల్లాయనడానికి పురాణాలలో వర్ణించబడ్డ రావణాసురిడి లంకా పట్టణం, బలిచక్రవర్తి కేరళ రాజ్యం, హిరణ్యాక్షుడి రాజ్యాల వర్ణణలు చూస్తే అర్థమవుతుంది

**************************************


అసలు ఆర్యులొస్తే ఎప్పుడొచ్చారు, రావణాసురుడు ఏ కాలం వాడూ, బలి చక్రవర్తి ఎప్పటివాడు - వీటిట్లో దేనికయినా ఈయనగారి దగ్గర సమాధానం ఉందా?

అదీ చూద్దాం - ఈయన ఇంతకు ముందు వ్రాసిన టపాలో

http://vadrangipitta.blogspot.com/2010/10/blog-post.html

"అసలు మీరన్న హిందూ ధర్మం ప్రకారమే యుగాల లెక్కల ప్రాప్తికి ఇప్పటికి రాముడు పుట్టి కొన్ని లక్షల సంవత్సరాలైంది. ఒక్కో యుగం అంతమైనప్పుడు మొత్తం నాశనమైందన్నది మీ లెక్కే. అలా అయినప్పుడు అన్ని లక్షల సం.క్రితం నాశనమైన వాటి ఆనవాళ్ళు ఇంకా ఎలా లభ్యమవుతాయి"

అదే రావణాసురుడి విషయానికొచ్చేసరికీ - నాగరికతతో, శతృ దుర్బేద్యంగా వున్న రాజ్యాలు విలసిల్లాయనడానికి పురాణాలలో వర్ణించబడ్డ రావణాసురిడి లంకా పట్టణం, బలిచక్రవర్తి కేరళ రాజ్యం, హిరణ్యాక్షుడి రాజ్యాల వర్ణణలు చూస్తే అర్థమవుతుంది

రామాయణం జరిగిందా? జరిగితే రాముడూ ఏ ఇంజనీరింగ్ కాలేజ్? మీకు తెలియదు కాబట్టీ రామాయణం కట్టుకథ అనే ఈ పెద్ద మనుషులే, తమదాకా వచ్చేసరికీ రాముడు ఉండేవాడు, రావణాసురిడిని చంపాడూ అని కొత్తపాట :))

53 కామెంట్‌లు:

  1. వడ్రంగి పిట్ట ఎవరు ?

    రిప్లయితొలగించండి
  2. They all need to read Stephen Knapp.

    http://www.stephen-knapp.com/death_of_the_aryan_invasion_theory.htm

    రిప్లయితొలగించండి
  3. Forget Knapp - Let them go thru the proceedings of the Dartmough conference.

    http://malakpetrowdy.blogspot.com/2009/04/blog-post_11.html

    రిప్లయితొలగించండి
  4. The extract from that link:


    వామపక్ష చరిత్రకారులు సీసీఎంబీ ప్రయోగరూపంలో వేసిన బౌన్సర్ కి హిందుత్వ వాదుల దిమ్మ తిరిగింది. దెబ్బకి వారు కూడా జీనోం మీద పరిశోధనలు మొదలు పెట్టారు - లెకపోతే వారి ఉంకే ప్రశ్నార్ధకమౌతుంది కదా .. కానీ ఇందులో ఓ చిక్కుంది - కాలక్రమంలో ఒకరివి మరొకరికి కలిసి కలగూరగంప అయిన జన్యువులని పట్టుకోవడం కష్టమే.

    2006 లో అమేరికా లోని మేస్చూసెట్స్ రాష్ట్రంలో ఉన్న డార్ట్ మౌత్ లోని సెంటర్ ఫర్ ఇండిక్ స్టడీస్ జూన్ 2006 లో ఈ విషయంతో సంబంధం ఉన్న చరిత్రకారులనీ, భాషావేత్తలనీ, శాస్త్రజ్ఞులని అందరినీ ఒకే వేదికపైకి రప్పించి "ఇంక కొట్టుకోండీరా!" అంది - అదే నండి కాంఫరెన్స్ ఏర్పాటుచేసింది. అందులో రాజారం, విట్జెల్ లతో పాటు ఆర్కియాలజిస్టు బీ బీ లాల్, శ్టాన్ ఫోర్డ్ యూనివర్సిటి నుండి పీటర్ అండర్హిల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయలాజికల్స్ నుండి వీ కే కాశ్యప్ మున్నగువారు పాల్గొన్నారు.

    రాజారాo ఈ సందర్భంగా 1929 లో బ్రిటిష్ ప్రధాని స్టేన్లీ బాల్డ్విన్ సభలో ఇచ్చిన ఒక ఆసక్తికరమైన ప్రకటనని ఉటంకించారు

    “Now, after ages, …the two branches of the great Aryan ancestry have again been brought together by Providence… By establishing British rule in India, God said to the British, “I have brought you and the Indians together after a long separation, …it is your duty to raise them to their own level as quickly as possible …brothers as you are…”

    అంటే - భారతీయ ఆర్యులు బ్రిటిష్ వారి సోదరులని దేవుడు చెప్పినట్టా?

    ఇదిలా ఉండగా గ్రహాల పరిభ్రమణాన్ని లెక్కలు కట్టి మెంఫిస్ విశ్వవిద్యాలయానికి చెందిన నరహరీ ఆచార్ మహా భారతం కెఈ పూ 3067 లో జరిగింది అని ప్రతిపాదించారు. ఇదే గనక నిజమయితే ఆర్యులు క్రీ పూ 1500 లో వచ్చారు అనే సిధ్ధాంతానికి తూట్లు పడ్డట్టేగా? ఈ సందర్భంగా విట్జెల్ నోరు పారేసుకోవడం అక్కడ చాలామందికి నచ్చలేదు.

    సరే - ఇక అందరూ సరస్వతీ నది గురించి, వేదాల గురించి, హరప్పా గురించి తర్జన భర్జనలు పడ్డ తర్వాత జెనిటిక్స్ మీదకి దృష్టి మరలింది. అండర్హిల్ మాట్లాడుతూ

    “…the spatial frequency distributions of both L1 frequency and variance levels show a spreading pattern emanating from India, referring to a Y chromosome marker"

    అన్నారు. అంటే ఆర్యుల జన్యువులు భారత ప్రదేశానికే చెందినవిగా ఉన్నాయని. అయితే దాన్ని ఆయన నూటికి నూరు ఆతం ధృవీకరించలేదు. కానీ తరవాత మాట్లాడిన కాశ్యప్ మాత్రం తన పరిశొధన (mtDNA and Y-Chromosome) ఫలితాలని ఉటంకిస్తూ ఆర్యుల యూరోపియన్ల జన్యువులు వేరు వేరని, వాటికి కులాలతో కూడా సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా కాలక్రమంలో జన్యువుల మ్యుటేషన్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన "మ్యుటేషన్ మీద ఇంకా పరిశొధన జరగవల్సి ఉన్నా - ఆర్యుల యూరోపియన్ల జన్యువులలో భారీ తేడాలు ఉండడమే ఆర్యులు భారతీయులనడాని తార్కాణం" అని తెగేసి చెప్పారు.

    ఆసక్తికరం గా అప్పుడే విట్జెల్ తాను ఆర్యుల దండయాత్ర సిధ్ధాంతాని ఆమోదించట్లేదని బహిరంగంగా ప్రకటించారు.

    దీనితో వామపక్ష వాదులకి చావుదెబ్బ తగిలింది. సైన్సో సైన్సో అని చెవికోసిన మేకల్లా అప్పటిదాకా అరిచి గీపెట్టిన కమ్యూనిష్టుల నోళ్ళూ మూతబడ్డాయి. (మరో విషయంలో ఒక బీజేపీ చరిత్రకారుడు ఒక మార్క్సిస్టు చరిత్రకారుడిని దేనిగురించో "సైంటీFఇచ్ ప్రూఫ్" అడిగితే దానికి రోమిలా థాపర్ కామేంటు: "I felt bad when he asked that question about the proof. History is not learnt that way" - What happened to their scientific methods then?)

    మన సీ సీ యం బీ పరిశొధనలనీ, డార్ట్మౌత్ పరిశొధనలనీ పక్కపక్కన పెట్టుకుని చూస్తే మనకి అర్ధమయ్యేదేమిటంటె -

    "భారతదేశం నానా జాతి సమాగమమైనా అన్నీ జాతులూ భారత జాతులే" అని. ఇది తప్పు అని మరెవరైన నిరూపించేదాకా ఇదే నిజమని అందరు నమ్ముతారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే "నాలుగవ రోజు ఆట ముగిసే సమయానికి వ్యతిరేకులు వలసవాదులపై భారీ ఆధిక్యంలో ఉండి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి" నట్టు. వామపక్షవాదులు దీనిని ఎల ఎదుర్కొంటారో వేచి చూద్దాం!!

    రిప్లయితొలగించండి
  5. చరిత్రకారులేదో నిరూపించారంటగా. మరి దానిని సైంటిస్టులు వాయగొట్టినప్పుడు లేదా?

    రిప్లయితొలగించండి
  6. నిన్న TV9 లో ప్రత్యేక కార్యక్రమం గంటసేపు ఇదే చంపుకుతిన్నాడు వాడు.
    దసరా గురించి వాడేం చెబుతున్నాడంటే
    మఃఇషాసురుడు ఒక దళితచక్రవర్తి జనరంజకంగా పాలించేవాడు, ఆయన పాలనలో ప్రజలు దేశం సుభిక్షంగా ఉండేవి. ప్రజలే ఆయన బలం నిత్యం ప్రజలలో మమేకం!? ఐ ఉండేవాడు. ఆ రాజు గొప్ప ధర్మపరాయణనుడు !?
    ఆ మహిషాసురుడు అనే దళిత చక్రవర్తి అంత వాడు, ఇంతటి వాడు, గొప్ప యుద్ద చతురత కలవాడు. ఎన్నో యుద్దరీతులు తెలిసి శత్రువులను ముప్పుతిప్పలు పెట్టెవాడు ప్రజలను కంటికిరెప్పలా కాపాడుకునేవాడు. అతడిని ఎవరూ జయించలేకపోయారు. చివరికి అందరూ ఆర్య రాజులు ఒక్కటై అతడిపై యుద్దం ప్రకటించారు. ఒక ఆర్య రాణి అతడితో యుద్దం చేసి కత్తితో దళిత చక్రవర్తి ఐన మఃఇషాసురుడిని గుండెలపై పొడచింది. సింహాల బోనులో అతడిని పడవేయించింది. అతడి తలని తన చేతి తో పట్టుకుంది% ఇలా ఎవేవో పిచ్చి కూతలు కూస్తూ మధ్య మధ్య దుర్గాదేవి బొమ్మ వేశాడు.
    మూడు వేలఏళ్ళనాడు ఇది జరిగిందట antu ఆ TY9 వాడు ఇప్పుడే చూసొచ్చినట్టు పెద్ద గొంతేసుకుని అరుస్తూ వాగేస్తున్నాడు కాసేపు TVచూసి కట్టేశాను.

    రిప్లయితొలగించండి
  7. మూడు వేలఏళ్ళనాడు ఇది జరిగిందట
    _________________________

    Does he mean 1000 BC? Lolz, he must have been smoking crap!

    రిప్లయితొలగించండి
  8. dani peru ’రాక్షసుడు కాదు దళితరాజ’ ninna tv9 TV show evarainaa pedite you tube lo dorakavachchu.

    రిప్లయితొలగించండి
  9. http://www.youtube.com/watch?v=YTuFR8NrBN4



    http://www.youtube.com/watch?v=YTuFR8NrBN4

    రిప్లయితొలగించండి
  10. అయ్యా మలక్ పేటరౌడీ గారు నా పోస్ట్ కు మీ బ్లాగులో చర్చపెట్టినందుకు సంతసంగా వుంది. ఇంక నన్ను కులగజ్జిగాడు అనడంలో ఔచిత్యమేమిటి. మీ అందరు కత్తిపై దాడి చేయడం వెనక మీ మీ అగ్రకులహంకారం లేదా? దళిత భావజాలంపై మీ ఆగ్రహం ఎందుకు. మాకున్నది బ్రాహ్మణులపై ఆగ్రహం కాదు బ్రాహ్మణిజంపై అన్నది గ్రహించగలరు. కులగజ్జి వున్నవారెవరో ఈ బ్లాగ్ లోకంలో బహిరంగరహస్యం. ఇంక చరిత్ర పరిశోధనలపై మీ వ్యాఖ్య బానే వుంది. ఇప్పటికిది సత్యంగా వున్నది రేపటికి మారొచ్చు. అసలు నిజం బయటపడొచ్చు. ఆధిపత్య భావజాలానికున్న ప్రాధాన్యత ఈ పరిశోధనలలో కనబడుతోంది. త్రిపీటికాచార్య, వేదపండితుడుగా గౌరవింపబడ్డ రాహుల్ సాంకృత్యాయన్ రచనలు చదవగలరు. ఆయా వేద శ్లోకాలనుండే ఆయన తాత్పర్యంతో సహా ఆర్యుల చరిత్ర చెప్పారు. హిట్లర్ ఈ భూభాగంను ఆక్రమించదలచుకోవడానికి తన జాతిని ఆర్యజాతిగా గొప్పలు చెప్పబట్టే వాళ్ళు తెగబడ్డారు.

    ఇక్కడ మరుగునపడ్డ చరిత్రను తప్పక తవ్విపోయాల్సిందే..

    రిప్లయితొలగించండి
  11. ఇదేదో భలేగున్నది అబ్బాయా.. కామెంటు పెట్టిన టయం చూసి, వాడిది ఏ కులమో నిశ్చయించేస్తావా? సూపర్ కేక, ఆ తంత్రాల శాస్త్రికన్నా పవర్ఫుల్‌గా అగుపిస్తున్నావే, ఈ విధ్యేదో మాకూ కాస్తా నేర్పొచ్చుగా..

    ఇప్పటివరకూ సైన్సు సైన్సు అనే అన్నారు, హార్వార్డ్ డి.యన్.యే . ఎనాలిసిస్ వచ్చాక అసలు సైన్సు ఉత్తిదే అదీ తప్పు అనడం మొదలెట్టారు..

    రిప్లయితొలగించండి
  12. ఆధిపత్య భావజాలానికున్న ప్రాధాన్యత ఈ పరిశోధనలలో కనబడుతోంది.
    ------

    వార్నీ సైన్సుకి కుడా మీరు కులం అంటగాస్తున్నారుగా, ఏందీ బ్రాహ్మినికలా, కూరలు తింటే నేరం, మాంసం తినాలి, వార్నీ ఒక్కోడికి తేరగా రోజు మాంసం వండి పెట్టాలా కాలేజీల్లో, డబ్బులు ఎవడిస్తాడయ్యా? ఏందీ మీకు మాంసం పెట్టకపొతే అది బ్రామర్ల దురహంకారమా, అదే ఒక కమ్మోడో, రెడ్డో, రాజో తింటే పేదలకి పెట్టకుండా రోజూ మాంసం తింటున్నారు అంటారా? ఎవడూ ఎవడి డబ్బులు ఖర్సు పెట్టుకోకుండా మీకు పెడితేనే అది బ్రాహ్మినికల్ యాటిట్యుడో, యాల్టిత్యుడో కాకుండా పోతాదా? లేకపొతే ఎవడి డబ్బులు ఆడు ఖర్సేసుకుంటే కుల గజ్జి ఐపోతాదా.. ఈ ఎదవ కబుర్లు సెప్పకుండా సక్కగా సతువుకొని ఉద్యోగమో, సద్యోగమో సేసుకోవచ్చుగా నాయనా? మేమందరం మీకు సంపాదించి పెట్టాలి అనకపొతే.

    రిప్లయితొలగించండి
  13. ఆయా వేద శ్లోకాలనుండే ఆయన తాత్పర్యంతో సహా ఆర్యుల చరిత్ర చెప్పారు.
    -----

    ఏట్టెట్టా అంతున్నదా, ఐతే ఏసుక్రిస్తు కుడా కన్యకా స్త్రీకి పుట్టాడు అని ఉన్నది బైబిల్లో ఐతే అది ఇప్పుడు ఏసుక్రిస్తు చరిత్ర ఐపోతాదా? ఐతే పూర్వం మగవారి అవసరం లేకుండా ఆడవారు పిల్లల్ని కనేవారు అని పుస్తకాల్లో పేట్టేసి పదోతరగతి చరిత్రలో పాఠంగా పెట్టేద్దామా

    రిప్లయితొలగించండి
  14. ఆయా వేద శ్లోకాలనుండే ఆయన తాత్పర్యంతో సహా ఆర్యుల చరిత్ర చెప్పారు.
    ............

    వేదాలు ఐదువేల ఏళ్ళకి పూర్వంవి మరి, మరి మీ లెఖ్ఖ ప్రకారం ఆర్యులు వచ్చిందే నాలుగున్నారవేల ఏళ్ళ క్రితం, మరి, ఐతే వేదాల్లో చరిత్రని ముందే ఊహించి రాసేశారంటారా? ఏది మీరు కామెంటు పెట్టిన సమయం చూసి ఎవరు పెట్టారో, వారి కులం, చెప్పినట్టు.

    రిప్లయితొలగించండి
  15. ఈ బుఱ తక్కువ వెధవలు సామాన్య దళిత జనానికి ఇవేమీ పట్టవని, వాళ్ళ పొట్టకోసం పాడుపడుతూ వుంటారని, ఎవడో ఒకడు పంచా అయ్యలయ్య లాంటి వాడు పిచ్చి పుస్తకం రాసి బ్రహ్మణుల మీది పడి ఎడుస్త్తూ ఎమైనా అంటె బ్రహ్మణిజం వేరు బ్రహ్మణులు వేరు అని పైకి చెపుతూ లోపల వేరే అజెండాతో పని చెస్తూఉ ఉంటారు. 50సం|| రిసర్వేషన్ సౌకర్యం అనుభవించి దేశవ్యాప్తం గా ఉన్న 50 ప్రముఖ దళితులను పేర్లు చెప్పండి అని అడిగితే కనీసం పది మంది పేర్లు చెప్పటానికి ఒక్కరు ముందుకురారు. మీకు పుస్తకాలు రాసి దానిని ప్రభుత్వం చేత కొనిపించి డబ్బులు దొబ్బి తినటం అలవాటైయింది. వీటిని మీకు మీ అన్నలు ఎర్ర చరిత్రకారులైన రోమిలా తాపర్ లాంటి వారినుంచి నేర్చుకున్నారు. అందువలన వారిని పొగుడుకుంటూ మాకు అన్యాయం జరిగినదని పుస్తకాలు రాసుకొంటూ దళితులకు మేలు చేశామని అని అనుకొంట్టున్నారు. మీ లాంటి వారు చేసింది శూన్యం. కత్తి గారిని నేను చాల సార్లు దళిత హాస్టల్ లో ఉన్న సౌకర్యాలు పరిశిలించి వాటి మీద పోరాడవచ్చు కదా మీరు పరిశిలించిన అంశాలు బ్లాగులో రాయ వచ్చు కదా అని అడిగితే ఆయన నోరు మెదపలేదు. మీబోటీ వారా ఈ దేశం గురించి దేశ భక్తి గురించి రాసేది.

    రిప్లయితొలగించండి
  16. గాంధి:అసత్యాలను వినవద్దు,చూడవద్దు,మాట్లాడవద్దు.
    నేను:అసత్యాలను గూర్చి discuss చేయవద్దు!!

    రిప్లయితొలగించండి
  17. మీకు తెలుసో లేదొ గత వారం చనిపోయిన మాజీ ఐ.ఏ,యస్. అధికారీ శంకరన్ బ్రాహ్మణుడు ఇతను తన జీవితకాలం లో వెనుక బడినా వారి కొరకు ఎన్నో సేవలు చేశాడు. మరి నువ్వు గాని, మహేషగాని ఒక్కసారి ఆయన గురించి ఎక్కడైనా రాశారా? వేనుకబడిన వారిలో అభివృద్దిచెందిన వారు తోటి వెనుకబడిన వారికి సహాయం చేయకుండా నిద్దర లేచిన మొదలు రాజ్యాదికారం చేపట్టటం ఎలా అనే పుస్తకాలు రాసుకొంట్టు ఫోజులు కొడుతుంటారు.

    రిప్లయితొలగించండి
  18. అయ్యా , క్రిష్టియన్ మిశినరీల నుండి ... హిందూ మత ద్వంసం కోసం భారీగా నిధులు దిగాయి. అందులో భాగమే ఇదంతా . చర్చ అనవసరం. వాడెవడో రాముడిని పట్టుకుని రౌడీ షీటర్ అంటాడా ......వీరభోగ వసంతరాయలు రాక కోసం వేచియుందండి . ముందు ముందు ఉంది ముప్పై రెండు రీళ్ళ సినిమా ప్రతి ఒక్కడికీ.

    రిప్లయితొలగించండి
  19. Deleted some of the rude points

    and Vadrangi Pitta,

    ఆధిపత్య భావజాలానికున్న ప్రాధాన్యత ఈ పరిశోధనలలో కనబడుతోంది.
    ___________________________________________


    Lolz hehehehe for your information, Science doesnt know caste. Hatemongers have spread lies allover these days and the scientific stuies are proving what kind of liars they are.

    రిప్లయితొలగించండి
  20. "మీ అందరు కత్తిపై దాడి చేయడం వెనక మీ మీ అగ్రకులహంకారం లేదా?"
    -------

    కారు కూతలు కూస్తే చూస్తూ ఊరుకోవాలి కదా. కత్తి ఒక దెబ్బేస్తే రౌడీ తిరిగి పది దెబ్బలేశాడు.

    రిప్లయితొలగించండి
  21. ఒక కులం వారిపై కత్తి కక్కే విషం తమకి కనబడదు గానీ కత్తినేమన్నా ఎవరైనా అంటే కులం గుర్తొచ్చేస్తుంది.

    రిప్లయితొలగించండి
  22. వడ్రంగిపిట్ట బాగా ప్రయత్నిస్తే 2019 నాటికి ప్రవీణ్ స్థాయికి చేరగలడు. అక్కడినుండి కత్తి స్థాయికి చేరాలంటే 2024. తెరాసలో చేరితే మరింత వృద్దిలోకి వచ్చి, ఏ మేధావో అయిపోగలడు.

    రిప్లయితొలగించండి
  23. అజ్నాత గారు మీ కామెంట్లద్వారా మీ అభిజాత్యాన్ని, అహంకారాన్ని, మీ కులపొగరుని చూపించుకుంటున్నారు. క్రిస్టియన్ మిషనరీలద్వారా నిధులు దిగాయా? గుజరాత్ మారణకాండకు మీ హిందూ ఫాసిస్ట్ లు విదేశాలనుంచి కూడబెట్టిన సొమ్ము పంపి అంతమంది ముస్లిముల చావుకు కారణమయ్యారు. ఆ డబ్బు క్రిస్టియన్ దేశస్తులది కాదా? మీరిప్పుడు క్రిస్టియన్ దేశాలలొకిపోయి వాళ్ళకి ఊడిగం చేసి సంపాదించిన సొమ్ముతో ఎంజాయ్ చేయడంలేదా? మరి వాళ్ళ పంచలో బతుకుతూ, వాళ్ళ మోచేతినీళ్ళు తాకుతూ గొప్ప దేశభక్తులుగా, హిందూధర్మ ప్రచారకులుగా ఫోజులు కొట్టడమెందుకు. ఈ మట్టిలో పుట్టి ఈ మట్టికోసం బతుకుతున్న దళిత జనంపై ఆక్రోశమెందుకు.. మీ మీ కామెంట్ల ద్వారా మీ కులాధిపత్యాన్ని చూపడంలేదా? మీకు ప్రశ్నిస్తే కోపాలా? మీరెన్నన్నా అణగిమణగి వుండాలా? మీ కాళ్ళ కింద చెప్పులా పడి వుంటే మీరు పొందే పైశాచిక ఆనందం కొన్ని యుగాలుగా చూసే ఈ చిన్న ప్రశ్న వేస్తేనే భరించలేకపోతున్నారే. ఈ బ్లాగులోకంలో ఎంతమంది దళితులు రాస్తున్నారు? ఎంతమంది వారికి మద్ధతుగా రాస్తున్నారు? ఈ మాత్రం స్పేస్ కూడా మిగలనివ్వరాదన్న మీ కుళ్ళు, మెజారిటీ పొగరును చూపెడుతున్నారు.. కానివ్వండి..

    రిప్లయితొలగించండి
  24. Vadrangi pitta

    It's probably because the people who call themselves Dalits are actually well to do guys and their interest lies only in attacking the others.

    Let somebody write about the genuine problems of Dalits the discrimination they are facing etc and I m sure one will have support from all quarters. Getting support to spread hatred is not easy.

    People hate your guy because he is a rogue not because he is a Dalit. If you observe carefully even the Brahimns who write like That guy are opposed in the same way. It's just that your perspective is limited and self serving

    రిప్లయితొలగించండి
  25. వీసాల్లో కోటా అమలుచేసి, ఎన్.ఆర్.ఐ.లపై జిజియాపన్ను వేస్తేగాని మన దేశీ ఉద్యమాలు స్పూర్తితో ముందుకు పోజాలవు. మీరు ఆ గతి-తార్కిక కోణంలో ఆలోచిస్తేగాని అభిజాత్యానికి అడ్డుకట్టవేయజాలము. దళిత హిరన్యకచిపుడు, మహీహీసాసురులే మన ఉద్యమానికి స్పూర్తి. ఇందులో యూరోప్ క్రిస్టియన్ ఆర్యులు, ప్రష్యా ముసల్మాన్ ఆర్యుల కుట్ర కోణం వుందేమో సి.బి.సీఇడితో దర్యాప్తు చేయించాల.
    జై మహిషాసురా.

    రిప్లయితొలగించండి
  26. @వడ్రంగి పిట్ట నోరుడింది కదా అని పారేసుకోమాకు , ఎక్కడెక్కడి సోది తెచ్చి ఇక్కడ పోయకు . కొద్ది నోరు అదుపు లో పెట్టుకో అంట దురద గా ఉంటె ఒక రిజర్వేషన్ సంఘం పెట్టి మీ వోడు అన్న వాడికల్ల ఒక వంద కామెంట్లు పెట్టు .

    రిప్లయితొలగించండి
  27. Take for instance K Cube Varma. He presents a totally different perspective on many things. I certainly differ with him on many issues but still nobody can deny the fact that he presents something different. Have you guys tried it?

    You are always worried about a rich Dalit being abused by a rich Brahmin in some guest house in Delhi. Who gives a damn?

    Who cares a dime if a hatemonging Dalit blogger is insulted by some other arrogant blogger?

    రిప్లయితొలగించండి
  28. Malakpet Rowdy సార్ మీరు చెప్తున్నది వాస్తవం కావచ్చు. దళితులెదుర్కొంటున్న ప్రధాన సమస్య అంటరానితనం. దానిని expose చేయకుండా ఎలా వుండగలరు? ఆకలి, పేదరికం, నిష్టుర జీవితం ఇవి అన్ని కులాలలోను వుంటాయి. కానీ మనిషిని మనిషి అసహ్యించుకోవడం ఈ దేశ దౌర్భాగ్యం. ఈ దేశ పునర్నిర్మాణంలో వారిని కలుపుకోవాలన్న ఆకాంక్షకు ప్రతిరూపమే రిజర్వేషన్లు. వాటిని అవహేళన చేసినప్పుడు defend చేయకపోతే ఎలా? దుర్వినియోగాన్ని అడ్డుకట్టవేయాల్సింది పాలకులే. దానిని భూతద్దంలో చూపెడుతూ కోట్లాదిమందిని తూలనాడాల్సిన అవసరంలేదు. చిన్నచూపు మాకు కొత్తకాదు. చర్చ వేరే దారిలోకి మళ్ళించబడుతూ వుంటుందెప్పుడూ.. ఇక్కడి కామెంట్లలో వున్న వర్ణాధిపత్యాన్ని గమనిస్తున్నారు కదా?

    రిప్లయితొలగించండి
  29. ఈ మట్టిలో పుట్టి ఈ మట్టికోసం బతుకుతున్న దళిత జనంపై ఆక్రోశమెందుకు..
    ---
    సూటిగా అడిగారు, మట్టిలో మాణిక్యాలను సాన బెడితే ఆర్యులు మిలియన్లిచ్చి కొంటారు. ఆర్యులకు ఆభరణాల పిచ్చి అని పమెల్లా సూపర్ ఉటంకించారు.

    రిప్లయితొలగించండి
  30. Sure expose untouchability. I am sure there will be dozens of bloggers who will support that. As far as I know it's on the decline in the cities already. Write about the cases of untouchability and people will support you.

    Okay let's do this. You choose a small village and try to eradicate untouchability. This can be done with proper education and a little bit on enforcement. I am willing to be a part of your team and will do whatever I can but on one condition. Keep that double tongued Katti guy away.

    రిప్లయితొలగించండి
  31. కత్తి లేకుండా పిల్లితల గొరగడం ఎలా, పిల్లిగడ్డం పెట్టడమెలా?

    రిప్లయితొలగించండి
  32. right sir.. we are always in that way.. but where and when the people unite there is a evil try to crush it.. and this is not only from us all of u come and together to eradicate this crime and make this country as a great humane..

    రిప్లయితొలగించండి
  33. yes, crush the evil. Ok ssar, stop today and again start tomorrow saar.
    RIP
    Jai Hind!

    రిప్లయితొలగించండి
  34. I can speak only for myself and stll stand by my word. Take your time and come out with a plan. Start with baby steps and lets see how it goes.

    రిప్లయితొలగించండి
  35. వడ్రంగి పిట్ట,

    మీరు దళితులకు జరిగే అన్యాయాలపై పోరాడుతాను అంటే తోడ్పాటు అందిచడానికి చాలా మంది సిద్దంగా ఉన్నారు. కాకపోతే ఒక విషయం. తర తరాలుగా బ్రాహ్మణులు దళితులమీద ఆదిపత్యం చలాయించారు అనో, లేదా ఆర్యులు ద్రవిడులను అణగదొక్కారు అనో చరిత్రలు తవ్వకుండా, ఇప్పుడు వివక్ష ఎక్కడుందో దాన్ని బయటకు తీసుకురండి. ఇక కులవివక్ష అనేది, అందరిలోనూ ఉంది, దళితులలో కూడా ఒక కులం వారు గొప్ప, మరొక కులం వారు తక్కువ అన్న బేధాలు ఉన్నాయి కదా? అందరమూ ఆతానులో ముక్కలమే.

    రిప్లయితొలగించండి
  36. రౌడీగారు ఓ విద్వేషంతో రగిలిపోతున్న వడ్రంగిపిట్టని కాసేపు మనిషిగా ట్రాన్స్ ఫార్మ్ చేశారు. ఈ చెట్టు వదలి ఇంకో చెట్టు మీద ఇదే కొట్టుడు కొట్టకపోతుందా, కాలమే సమాధానం చెబుతుంది.:)

    రిప్లయితొలగించండి
  37. You asked for the support for a genuine cause and you already have two supporters in less than 30 min. If one is committed to this it's not impossible to make it 200

    రిప్లయితొలగించండి
  38. ఆర్యులు ద్రవిడులను అణగదొక్కారు అనో చరిత్రలు తవ్వకుండా
    --
    చరిత్రలు తవ్వడమేమిటి సార్, అది పాత పద్ధతి. మీరు గతి-తార్కిక విప్లవ విధానంలో ఆలోచించడం లేదు. చరిత్రలు మా మద్యమకళాకారులచే కావాల్సినట్టు రాయిస్తాం.

    రిప్లయితొలగించండి
  39. ఇప్పుడు నేపథ్యంలో మసిబారిన పాట...

    జోత్ సే జోత్ జగాతే చలో
    ప్రేం కి గంగా బహాతే చలో
    పేడ్ సే పేడ్ మార్ తే చలో వడ్రంగి

    రిప్లయితొలగించండి
  40. ఆకాశరామన్నగారు చరిత్ర చెప్పుకోకుండా ఎలా సార్.. చరిత్రంటే అంత భయమెందుకు..

    అజ్నాత గారు ఇది గాలిలో కట్టే మేడలాంటిది.. ఇలా ప్రశ్నించే వారినే కారంచేడు, చుండూరు, వేంపెంటలలో ఏం జరిగిందో తెలియనిదా? ఆచరణకు దూరంగా వున్నవాళ్ళం కాదు. ఈ చిన్న బ్లాగ్ లలోనే మా ఉనికిని భరించలేని వాళ్ళు నేలమీదనా.. ఇదేదో ఒక్కమారుగా ఒనగూరేది కాదు అని ఎరుకగలిగిన వాళ్ళమే..

    రిప్లయితొలగించండి
  41. ఈ చిన్న బ్లాగ్ లలోనే మా ఉనికిని భరించలేని వాళ్ళు నేలమీదనా
    ---
    అందుకే వీసాలొక్కటే కాదు MNC లోనూ బ్లాగుల్లో కూడా కోటా వుండాలి అంటాను, వడ్రంగీ. మన కొట్టుడే వినాలి అని రాజ్యాంగాన్ని సవరించాలి. మంత్రి పదవుల్లో 102% మట్టిలో పుట్టి మట్టి పిసుక్కునే వాళ్ళకే ఇచ్చేంతవరకూ మన పోరాటం ఆగదు.

    రిప్లయితొలగించండి
  42. మా వూళ్ళో ఆర్య రైతులు ఆర్య పద్మశాలీలు ఆర్య పాములోల్లు, ఆర్య కోమట్లు:), ఆర్య చాకల్లూ, ఆర్య మంగల్లూ, ఆర్య వండ్రంగులు, ఆర్య కశ్టజీవులు ఆర్య కార్మికులు ఉన్నారు ఇతర ఆర్య చిన్నా చితక పలురకాల కులస్థులు :) అందరూ ఏదో పని చేసి దేశానికి తమవంతు ఉపయోగపడుతూనే ఉన్నారు. తమ నైపుణ్యమో మేధస్సో దేశానికి ఇస్తూనే ఉన్నారు. అడుగుతున్నానని దాడికి దిగకుండా ఒకసారి ఆత్మ విమర్శచేసుకొండి మీరు ఈ దేశానికి ఏమిచ్చారు. పోనీ ఏం ఇవ్వబోతున్నారు? బుద్ది బలమూ కండబలమూ సృజనాత్మకతో ఏదో ఒకటి పెంచుకోకుండా ఈ రిజర్వేషన్స్ అడ్డుగా ఉన్నాయని అనిపించటం లేదూ.
    ఆ ఉద్యమాలేవో ఆ వర్గపు ప్రజలను నిజమైన విధ్యావంతులుగా మార్చే దిశలో సాగుతే బావుంటుంది.

    రిప్లయితొలగించండి
  43. వడ్రంగి పిట్ట,

    చరిత్రంటే నాకు భయం లేదండీ. కానీ, అది ఉపయోగించే విధానమీదే నా అందోళన. సరే, చరిత్ర ఉన్నదున్నట్టుగా చెప్పుకుందాం. అంతా అంతే ప్రతీ ఒక్కటి. సెలెక్టివ్‌గా కాదు. అది నాకు కూడా ఇష్టమే. మనకా హక్కువుంది నా నమ్మకం కూడా. కాకపోతే, మహిషాసురుడు ద్రవిడుడని, ఆర్య స్త్రీచేతిలో చనిపోయాడని ఈ చరిత్రలో చెప్పుందో చెప్పండి. అది చరిత్ర కాదు. నమ్మకం లేని వాల్లకు అదో కథ, నమ్మకం ఉంటే అది పురాణం. మీరు మైసమ్మ, బతుకమ్మ, పోలేరమ్మ లాంటి వారు ద్రవిడ దేవతలని చెప్పారు. కానీ ఆ ద్రవిడ దేవతలను ఎంతోమంది దలితులు కాని వారు పూజించట్లేదా? మీరు ఇప్పుడు కొత్తగా దేవతల మధ్య ఆర్య దేవతలు, ద్రవిడ దేవతలు అనే గ్రూపులు ఏర్పరచి సాధించ దలిచింది ఏమిటి?

    ఎవరైనా ప్రశ్నించేది, వ్యతిరేకించేది ఇటువంటి వాటినే. అంతే కానీ, దళితుల మీద వివక్షను ఎవ్వరూ సమర్ధించరు, At least బహిరంగంగా.

    రిప్లయితొలగించండి
  44. వడ్రంగి పిట్ట,

    మీరు కారంచేడు సంఘఠన గురించి రాయండి. ఇటీవల జరుగుతున్న పరువు హత్యల గురించి రాయండి. ఎవరైనా వాటిని తప్పు పడితే మీకు సపోర్టూగా ఎంత మంది వస్తారో చూడండి. ఖచ్చితంగా చాలా మంది వస్తారు. నాకు తెలిసినంత వరకూ బ్లాగుల్లో మిగీలిన కులాల వారు బహిరంగంగా, దళితులకు వ్యతిరేకంగా మాట్లాడే అంశము ఏదన్నా ఉంటే అది రిజర్వేషన్ల గురించే. ఎందుకంటే వారు రిజర్వేషన్ల కారణంగా కొన్ని అవకాశాలు కోల్పోతున్నారు కాబట్టి వారికి ఆమాత్రం కోపం ఉండడం సహజం. దాన్ని కూడా మనం సమర్ధించుకోవచ్చు. మనల్ని మనం డిఫెండ్ చేసుకోవచ్చు. ఎందుకంటే రిజర్వేషన్ల అవసరం దళితులకు ఉంది కాబట్టి. అటువంటి అభిప్రాయాలకి, ఇప్పుడు మీరు మహిషాస్రుడు ద్రవిడియన్, అతన్ని చంపిన స్త్రీ ఆర్యన్ అంటూ చెబుతున్న దానికీ తేదా లేదా?

    రిప్లయితొలగించండి
  45. ఆకాశం: మీరిలా మా మేధస్సుని ప్రశ్నించకూడదు. మేం చెప్పిందే చరిత్ర, పాడిందే పాట. పలికిందే రాజ్యాంగం అని మీలాంటి కుహనామేదావులకు అర్థం ఎందుకు కాదు? ఇది అణగద్రొక్కడమే. అభ్యంతరం లేకుంటే మీపైన ఓ కేసేసుకుంటాం. అసలు మహి +అ+సురుడు అంటే అర్థం తెలుసా? భూమిలో+అందరి+దేవుడు అని! అసలు మీకు సమస్కురుతం వచ్చా? నేర్చుకొండి, మా పరనసాలలో ఒక ఇస్కూల్ అఫ్ థట్ వుంది.

    రిప్లయితొలగించండి
  46. ఈ చిన్న బ్లాగ్ లలోనే మా ఉనికిని భరించలేని వాళ్ళు నేలమీదనా.. ఇదేదో ఒక్కమారుగా ఒనగూరేది కాదు అని ఎరుకగలిగిన వాళ్ళమే..

    ఎస్సీ ఎస్స్టీ అట్రాసిటీ చట్టం అవసరమే..!!!

    ఇంత రాసిన తరువాత కూడా నా ఉనికిని బ్లాగర్లు భరిస్తూనే ఉన్నారు. నా ఉనికినే కాదు, మీరు లేదు అని అనుకుంటున్న వారి అందరి ఉనికినీ భరిస్తున్నారు (ఆమోదిస్తున్నారు).

    రిప్లయితొలగించండి
  47. @అజ్ఞాత,

    <<మహి +అ+సురుడు అంటే అర్థం తెలుసా? భూమిలో+అందరి+దేవుడు అని!

    Lol.. :)

    రిప్లయితొలగించండి
  48. ఆకాశరామన్న గారు
    మేము చెప్పిందే కరకట్టు . మహిషాసురుడు, రావణాసురుడు దళితులు కాబట్టే చంపారు. శూద్రులు పూజలు చేశారు. ఆర్యులు రాజ్యం ఏలారు. మేము ఇప్పుడు రాజ్యాధికారం అందిపుచ్చుకుంటాం.

    బాటం లైన్: రిజర్వేషన్స్ ఇక అవసరం లేదు

    రిప్లయితొలగించండి
  49. paina vaallantaa entento chepparu. vaati meeda naaku anta command ledu. maa intlo oka housemaid undi. tanaki nela jeetam 7000rs. tanu vaalla pillalai okkokkallaki minmum 1000rs petti dresses kontundi. adigithe maaku school lo food free gaa pedataaru. maa abbayiki christian missionry lo schooling free. adapillalu pedda aite school free. sampadinchi dachukuni emi chestaam antundi. vaalla ayana eppudoo taagi tirugutoo untaadu. baaga chadivinchataniki money kavaala ante enduku maaku antaa free ne kadaa antundi.
    mari meeru anna aa socalled kamma,reddy vaallu maa oorilo 20acres polam unnaa pillalaki 300,400 minchi dress konaru enduku ante anni kharchulu aa income lone jaragali plus pai chaduvulu chadavalante money kavali kadaaa.
    mari evaru future gurinchi tension lekundaa batukutunnaro vignulainaa vaaru alochinchandi.

    రిప్లయితొలగించండి
  50. అంతా ఫ్రీ గానే చెప్పేస్తుంటే మరి ఇంత మంది నిరక్షరాస్యులు, నిరుద్యోగులు మాలో ఎందుకున్నారు సార్. తమను తమలాంటి వారు చూసే చూపులనుండి తప్పించుకోవాలన్న ఆశో, లేక తాననుభవించిన చింకిపీలికల బతుకు తమ పిల్లలకొద్దనుకొనే ఆలోచనో తనచే ఆ పనిచేయిస్తుండొచ్చు. ఆమె భర్త తాగుడుకు అలవాటుపడడానికి తాను చేస్తున్న కాయకష్టం మరచిపోవడానికి కావచ్చు. మీలా దాచుకునే తత్వం వాళ్ళ మొదలులోనే లేకపోవడం కూడా కారణం కావచ్చు. అది ఒక అమాయకత్వానికి చిహ్నంగా భావించి మీలాంటి విజ్నులు వాళ్ళని సరైన విధంగా పొదుపు వైపు, మంచి బతుకువైపు దారి చూపొచ్చు కదా సార్..

    రిప్లయితొలగించండి
  51. Malak, Please read below article

    2G scam: Hot tapes expose mediamen as power players
    http://indiatoday.intoday.in/site/Story/120436/Top%20Stories/2g-scam-hot-tapes-expose-mediamen-as-power-players-.html

    2G Spectrum Scam: What To Read And Listen To, And Where

    Yesterday, Open magazine and Outlook published audio files and transcripts of conversations that Niira Radia, who runs several PR and consultancy companies, allegedly had with Tata Group Chairman Ratan Tata, Telecom Minister A. Raja, and the DMK’s Kanimozhi, as well as with senior journalists Barkha Dutt (from NDTV) and Vir Sanghvi (Editorial Director, HT Media), around the appointment of the Telecom Minstry in India. This follows previous revelations published by Mail Today and The Pioneer, and broadcast by HeadlinesToday. For reference purposes, we’re putting together is a list of information related (and allegedly related) to the appointment, and the 2G Spectrum scam that preceded the appointment, that has been published online; if true, it is shocking commentary on how the Telecom sector is manipulative, and policies manipulated. We’re updating this list, so feel free to suggest more links in the comments below.

    Introduction

    Some of these are alleged to be recordings of conversations that Niira Radia had with several people, in the aftermath of the Parliamentary elections that took place last year, discussing alleged issues with the appointment of ministers from the DMK, a regional political party from Tamil Nadu, as well as appointments to India’s Cabinet of Ministers. The context of these discussions is appointment of A. Raja as Telecom Minister, who allocated 2G mobile licenses in India, on a controversial first-come-first-served basis, by choosing an arbitrary cut-off date for allocation, and it was expected at the time that he would not head the ministry again.

    Courtsy from
    (1) http://www.medianama.com/2010/11/223-2g-spectrum-scam-what-to-read-where/
    (2) http://www.lkadvani.in/forum/viewtopic.php?f=38&t=7503
    (3) http://outlookindia.com/article.aspx?268068

    రిప్లయితొలగించండి