2, ఫిబ్రవరి 2010, మంగళవారం

సరే! ఇప్పుడేంటి??

నా తోలు కాస్తంత మందం - సాధారణంగా ఏడుపొచ్చే కధలకి, సంఘటనలకి స్పందించను నేను. మూడు రోజుల పాటు కూడలి చూడకపోవడం వల్లనేమో, నిన్న శ్రీనివాస్ చెప్పేదాకా ఈ వైష్ణవి సంగతి తెలియలేదు. అప్పుడెప్పుడో సికింద్రాబాద్ స్కూలు ముందు ఏక్సిడెంట్ సంఘటన తరవాత అంత బాధ పెట్టిన సంఘటన ఇది -

సరే, జరిగిందేదో జరిగింది మనమేం చేద్దాం? మీ ఛాయిస్ ఎస్.ఎం.ఎస్ ద్వారా మెయిల్ చెయ్యక్కర్లేదు గానీ క్రిందవాటిట్లో ఒకటి ఎంచుకోండి ...

(1) రెండు విషాధభరిత కవితలు వ్రాసి "ఆహా, ఓహో" అనిపించుకుందాం

(2) అసలేమి పట్టనట్టు మన బ్లాగులు మనం వ్రాసుకుందాం - నాలాగా ప్రపీసస కి అభినందనలు తెలుపుతూ

(3) రెండు రోజులు కన్నీళ్ళు కార్చి మూడోరోజునుండి, జూనియర్ ఎంటీఅరా లేక మహేష్ బాబా అని కొట్టుకుందాం

(4) తెలంగాణావాడినో, లేక కోస్తా ఆంధ్రా వాడినో బండబూతులు తిట్టుకుందాం

(5) "ఎంతటి రక్కసులీనధములు" అని రెండు నిమిషాలు తిట్టుకుని అవతార్ సినీమాకి చెక్కేద్దాం

(6) దీనంతటికీ కారణం మీరే అని పోలిసులనీ, రాజకీయనాయకులని కాసేపు తిట్టూకుని తరవాత క్రికెట్ లోనో, టివీ సీరియల్ లోనో మునిగిపోదాం

(7) "ఛీ! దీనంతటికీ కారణం మన మీడియా చానెళ్ళే" అనుకుంటునే వాటినే కళ్ళార్పకుండా చూసెద్దాం

(8) థూ! వాడెవడండీ "ఇలాంటివి ఇకముందు ఆగాలంటే ముందు మనం మారాలి, ప్రతీదానికీ పోలీసులమీద ఆధారపడకుండా మనమే ఏదో ఒకటి చెయ్యాలి, అలాంటి నేరస్థులకి సమాజంలో స్థానం లేకుండా మనమే ఏదో ఒకటి చెయ్యడం ఇప్పటికైనా మొదలు పెట్టాలి" అంటున్నాడు? కబుర్లెక్కువ, పని శూన్యం - పిచ్చివాడిలా ఉన్నాడు - .. రాళ్ళేసి కొట్టండి!

12 కామెంట్‌లు:

  1. 8 నాకు నచ్చింది.. ;-) బాగా స్మార్టు మీరు... ఎస్.ఎమ్.ఎస్ నంబర్ ఏది?

    రిప్లయితొలగించండి
  2. vellaki oka kalu,oka cheye,oka kannu thesi samajam lo ki vadhili pettali..appudu valaki anukshanam chesina papam gurthu vasthundhi...
    malli elanti thappu chesea variki kuda bayam vesea la vundali...Elanti siksha thappu chesina vallaki okasari amalu chesthea kondhari lo aeena marpu vasthundhemo.......

    రిప్లయితొలగించండి
  3. SOP is : నేరం ప్రూవ్ కాలేదు. రేప్పొద్దున్న పోలీసులు కొట్టి అలా చెప్పించారంటాడు హత్య కు ప్లాన్ చేసినాయన. మానవ హక్కుల వాళ్ళు, ప్రజా సంఘాలూ 'పోలీసు డౌన్ డౌన్!' అంటారు. మేజిస్ట్రేట్ కు లంచం ఇచ్చి బెయిల్ తెచ్చుకుంటాడు. ఒక వేళ కేసు నడిచినా జ్యుడీషియల్ కస్టడీలోనో, బెయిల్ మీద్ బయటకొచ్చి ఆరాం గానో గడిపేసి తక్కువ శిక్ష తో తప్పిచేసుకుంటాడు.

    కొంత మంది బాయిలర్ లో వేసి కాల్చేయమంటున్నారు. ఏది న్యాయం ఏది జస్టిస్ అని నిర్ణయించడానికి ఎవరు కరక్టు ? పోలీసుల అద్రుష్టం బావుండి వైష్ణవి బూడిద చిక్కింది. లేకపోతే ? పోలీసు ని నారా చెంద్ర బాబు నాయుడి నుంచీ, గల్లీ లో తాగి పడిపోయే అసామాన్యుడు కూడా 'అసమర్ధు' లని తేల్చేస్తారు. Which is not true. If it is, its because of certain bottle necks.

    So, ముందు మన వ్యవస్థ ని గౌరవించడం నేర్చుకోవాలి. వ్యవస్థ ని మెరుగుపరచాలి. మనమే ఏదో చెయ్యాలన్న ఆవేశం మంచిదే. మొదలంటూ ఎక్కడో ఒక చోట పెట్టాలి కదా. ఒక రూపు, రేఖా లేని ఆవేశాన్ని అలా గాలి లో కలిసిపోనివ్వకండి. దానికో షేప్ ఇచ్చె ప్రయత్నం చెయ్యండి. Lets do something.
    Option 8.

    రిప్లయితొలగించండి
  4. ఎంపిక చేయమంటే 8 ,కానీ వాస్తవంగా చెప్పాలంటే మనం చేసేది అది తప్ప మిగిలినవన్నీ.

    రిప్లయితొలగించండి
  5. మనమే ఏదో చెయ్యాలన్న ఆవేశం మంచిదే
    ______________________________

    I'm too old for "ఆవేశం" - this is more of a frustration

    దానికో షేప్ ఇచ్చె ప్రయత్నం చెయ్యండి
    _________________________

    There is no shape yet, but have a faint sketch in my mind.

    Anybody willing to know more may mail me: bharadwaja@yahoo.com

    రిప్లయితొలగించండి
  6. 8 పాయింట్ లో రాళ్ళతో కొట్టించుకునే ఆ శాల్తీ ని ఎక్కడో చూసినట్టుందే

    రిప్లయితొలగించండి
  7. మీ ఆవేదన అర్థవంతంగా వుంది. మీరే కాదు అంతమందిమి తోలుమందంగాళ్ళమైపోయాం. రోజుకో కొత్త అంశం మనముందుకొచ్చి పాతవి మరిచిపోయేట్లు చేస్తున్నాయి. తనవరకు వస్తే కానీ అర్థంకాని స్థితిలో వున్నాం. అసమర్థుని జీవనయానం యిలా సాగిపోనీ సారూ...

    రిప్లయితొలగించండి
  8. రాళ్ళేసి కొట్టించుకుంటానేమో తెలీదు కానీ ఇప్పుడే ఒక పోస్టు రాసి ఇటొచ్చా! సాధారణంగా "నా బ్లాగు చూడండి" అని ఎవర్నీ అడగను కానీ నేను రాళ్ళేయించుకుంటానో లేదో తెలియాలంటే నా బ్లాగు చూడాల్సిందే!

    రిప్లయితొలగించండి
  9. నేనున్నా నీతో తమ్ముడూ(నీదే ఆఫ్షన్ అయితే నాదదే)...

    రిప్లయితొలగించండి
  10. Im sorry..

    Na reply lo, Option 8 rasanu. Na uddesyamlo - rallesi kottalani ledu. I realised my mistake now.

    రిప్లయితొలగించండి